ప్రతిపక్ష హోదాపై జగన్ వెనకడుగు?

Publish Date:Feb 2, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన మంకుపట్టు వీడనున్నారా? ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరౌతాను అన్న పంతం వీడి ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతారా అంటే వైసీపీ శ్రేణుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం పాకులాడి పరువు పోగొట్టుకోవడం కంటే.. పంతం వీడి అసెంబ్లీకి హాజరు కావడమే మేలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు కనిపిస్తోంది.

అయితే ప్రతిపక్ష హోదా విషయంలో జగన్ వెనకడుగు వేయడానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు.  వైసీపీ ఎమ్మెల్యేలు స‌భ‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్నార‌ని, భ‌త్యాల‌కు ద‌ర‌ఖాస్తు చేస్తున్నార‌ని.. స్పీక‌ర్ అయ్య‌న్న బాహాటంగా చెప్పడమే కాకుండా, సభకు గైర్హాజర్ అయ్యే ఎమ్మెల్యేల వేతనాల్లో కోత పెట్టడమే కా కుండా, వారిని అనర్హులుగా ప్రకటించాలని కూడా ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనర్హత వేటు భయంతో పాటు.. ఇంకా అసెంబ్లీ బహిష్కరణ అంటే పార్టీ ఎమ్మెల్యేలు తన మాట వినకపోవచ్చన్న ఆందోళన కూడా జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ విషయంలో తన వైఖరి మార్చుకోవడానికి కారణం కావచ్చని పరిశీలకులు అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14న అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు.  ఈ నేపథ్యంలోనే  వైసీపీ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   గ‌త 18 నెలలుగా వైసీపీ నాయకులు అసెంబ్లీకి గైర్హాజరౌతున్న సంగతి తెలిసిందే.  శాస‌న స‌భ్యులుగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు స‌భ‌కు వచ్చారు. ఆ తరువాత   2025-26 బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజున, గ‌వ‌ర్నర్ ప్ర‌సంగానికి జ‌గ‌న్ తన ఎమ్మెల్యేల‌తో హాజ‌ర‌య్యారు. ఆ సందర్భంగా  న‌ల్ల‌కండువాల‌తో  స‌భ‌కు వ‌చ్చిన వైసీపీ సభ్యులు..   గ‌వ‌ర్న‌ర్  ప్ర‌సంగ ప్ర‌తుల‌ను చింపేసి వాకౌట్  చేశారు.  ఆ తరువాత వైసీపీ సభ్యులెవరూ ఇంత వరకూ అసెంబ్లీకి హాజరైంది లేదు.  అయితే ఇప్పుడు సభ్వత్వాలను కాపాడుకోవడం కోసం అసెంబ్లీకి హాజరు కావాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. అయితే పూర్తి బడ్జెట్ సెషన్ కు కాకుండా, ఉభయ సభలను ఉద్దేశించి చేసే గవర్నర్ ప్రసంగానికి హాజరై నిరసన వ్యక్తం చేసి, సభ నుంచి వాకౌట్ చేయాలన్న వ్యూహంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అలా చేయడం ద్వారా అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.  

By
en-us Political News

  
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.