Publish Date:Jul 17, 2025
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన సొంత ప్రాంతమైన రాయలసీమపై విషం చిమ్ముతున్నారు. సీమ సాగు, తాగు నీటి కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గోదావరిపై నిర్మింత తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఆయన నైజాన్ని బయటపెడుతున్నాయి. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఇసుమంతైనా మేలు, ప్రయోజనం కలగకూడదన్న ఆయన ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించేందుకు తాను ఇసుమంతైనా వెనుకాడనని బనకచర్లపై చేసిన వ్యాఖ్యల ద్వారా జగన్ మరో సారి రుజువు చేశారు.
సరిగ్గా హస్తినలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్న సమయంలో జగన్ తన కపటత్వాన్ని బయటపెట్టుకుంటూ బనకచర్లకు వ్యతిరేకంగా విష వ్యాఖ్యలు చేశారు. బుధవారం జులై (16) జాతీయ మీడియాతో మాట్లాడిన జగన్ బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం కరెక్టు కాదన్నారు. మిగులు జలాలు లేకుండా లింక్ ప్రాజెక్టును నిర్మించడం తగదని చెప్పారు. తెలంగాణ వాదనను బలపరిచేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీమ ప్రయోజనాలకు పోలవరం - బనకచర్ల అవసరమని ఏపీ ప్రభుత్వం చెబుతుంటే.. జగన్ సీమ ప్రయోజనాలు కాదు.. తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని బనకచర్చకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల ద్వారా మరో సారి రుజువు చేసుకున్నారు.
గతంలో కూడా హంద్రీ - నీవాను నిర్లక్ష్యం చేసి జగన్ సీమకు తీరని అన్యాయం చేశారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. జగన కు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, సీమ అభివృద్ధి ముఖ్యం కాదని తేలిపోయిందని అంటున్నారు. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుపై విషం కక్కడం కూడా అందుకేనని అంటున్నారు. మిగుల జలాలే లేనప్పుడు బనకచర్ల నిర్మాణం వృధా అని ప్రజాధనాన్ని నీళ్ల పాలు చేయడమే అవుతుందన్న జగన్ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-spits-venom-on-banakachar-39-202122.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!