వన్ బిల్- 3 టార్గెట్స్.. మూడు ప్రాంతాలనూ ముంచేసే స్కెచ్!
Publish Date:Nov 23, 2021
Advertisement
జగన్‌రెడ్డి. మోస్ట్ టెరిఫిక్ పొలిటీషియన్. నమ్మించి నట్టేట ముంచడంలో ఎక్స్‌పర్ట్. కక్ష్య సాధింపు కోసం ఇంట్లో మహిళలనూ కించపరిచే మనస్తత్వం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై అన్నారు. అందల మెక్కగానే మూడు రాజధానుల డ్రామా మొదలుపెట్టారు. అమరావతిని ఆగం చేశారు. రైతులకు చుక్కలు చూపించారు. విశాఖ, కర్నూలులను త్రిశంఖు స్వర్గంలో విహరింపజేశారు. కట్ చేస్తే.. మూడు రాజధానుల బిల్లుకు పవర్ లేదు. హైకోర్టులో వీగిపోవడం ఖాయం. ఇక రెండేళ్లవుతున్నా.. విశాఖలో కానీ, కర్నూలులో కానీ.. కొత్తగా వచ్చిన మార్పేమీ లేదు. రాజధాని అంటూ ఊరించడం మినహా.. ఒక్క పునాది రాయి వేసింది లేదు.. ఒక్క రూపాయి పని చేసింది లేదు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అని విశాఖ వాసులు.. జ్యుడీషియల్ కేపిటల్ అంటూ కర్నూలు వాసులు.. కాలర్ ఎగరేశారే గానీ.. కాలం గడుస్తున్నా.. ఏమాత్రం ఎదుగూబొదుగూ లేకపోవడంతో ఆలస్యంగానైనా తత్వం బోధపడింది. జగన్‌రెడ్డి నిజ స్వరూపం తెలిసొచ్చింది. ఇక విశాఖలో పరిపాలనా రాజధాని పేరు చెప్పి.. ఆస్తుల విధ్వంసాలకు పాల్పడటం, వైసీపీ నేతల రియల్ ఎస్టేట్ దందాలపై ప్రజలు విసిగి వేశారి పోయారు. విజయసాయిరెడ్డి అరాచకాలతో అలసిపోయారు. ఇక తిరుగుబాటు తప్పదని జగన్‌రెడ్డి గుర్తించారు. ఇటు అమరావతిలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుండటం.. అటు విశాఖ, కర్నూలులో వ్యతిరేకత వ్యక్తమవుతుండటం.. నిధులు లేక ఖజానా ఖాళీ కావడం, రాష్ట్రం అప్పుల పాలు అవడం.. ఇలా అన్నిటినీ లెక్కలేసుకున్నాక.. జగన్‌రెడ్డి మూడు ప్రాంతాల వ్యతిరేకతను ఒక్క బిల్లుతో తుడిచిపెట్టాలనే స్కెచ్ వేశారని అంటున్నారు. అందులో కొంచెం సక్సెస్.. కొంచెం ఫెయిల్యూర్. జగన్ ఫస్ట్ టార్గెట్ అమరావతి. మూడు రాజధాని బిల్లును వెనక్కి తీసుకొని, సీఆర్‌డీఏ బిల్లు పునరుద్దరించడంతో రాజధాని రైతులు పాక్షిక విజయం సాధించినట్టే. మళ్లీ మరోసారి కొత్త బిల్లు తీసుకొస్తేనే ప్రాబ్లమ్. లేదంటే అప్పటి వరకూ అమరావతి రైతుల మంట కాసింత తగ్గినట్టే. వైసీపీ నాయకులకు అమరావతిలో భయం, బెదరు, నిరసనలు లేకుండా తిరిగే అవకాశం చిక్కినట్టే. అయితే, అమరావతిని ఇప్పుడు ఉన్నట్టు అలానే ఉంచితే ఏం లాభం? రాజధానికి నిధులు కేటాయించి.. అభివృద్ధి చేస్తేనే కదా ఉపయోగం. మరి, జగన్‌రెడ్డి అమరావతిని ఏమాత్రం డెవలప్ చేయరనే విషయం అందరికీ తెలిసిందే. ఇక విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అని ప్రకటించారే కానీ, నిధులు విదిల్చింది లేదు. ఒక్క అభివృద్ధి పనీ చేసింది లేదు. కేపిటల్ పేరు చెప్పి భూముల ధరలు పెంచేశారే కానీ, రియల్ ఎస్టేట్ దందాలతో దోచుకున్నారే కానీ.. విశాఖను పట్టించుకున్న పాపాన లేదు. ఇక, కర్నూలు దుర్గతి గురించి ఎంత చెప్పినా తక్కువే. న్యాయ రాజధానా? అంటే ఏంటి? అనేట్టే ఉంది ఇప్పటికీ పరిస్థితి. ప్రకటనలైతే వచ్చాయి కానీ, వాటివల్ల నష్టమే కానీ, ఏమాత్రం లాభం లేకుండా పోయిందనేది అక్కడి ప్రజల ఆక్రందన. అందుకే, ఆ ప్రజావ్యతిరేకతను తగ్గించుకునేందుకే, మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకొని.. వారి ఆశలపై నీల్లు చల్లి.. ఆ మంటను కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా, మూడు రాజధానుల పేరుతో రెండేళ్లుగా మూడు ప్రాంతాలకు తీవ్ర నష్టం చేసిన జగన్‌రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు హ్యాండ్సప్ అంటూ చేతులెత్తేసి.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటోంది. ఇప్పటికే నష్టం అయితే జరిగింది. ఆ నష్టం మరింత కష్టం తీసుకురాకుండా ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టింది వైసీపీ సర్కారు.
http://www.teluguone.com/news/content/jagan-sketch-on-3-capitals-bill-repeal-25-126931.html





