అమరావతి... ఏ రోజున ఏం జరిగిందంటే..

Publish Date:Nov 23, 2021

Advertisement

ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ప్రకటించింది మొదలు అమరావతి నిర్మాణ పనులు చకచకా జరిగిపోయాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రైతుల నుంచి 30 వేల ఎకరాలు సేకరించింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దేశంలోని ప్రముఖలంతా విచ్చేసి అమరావతికి ఆశిస్సులు అందించారు. కాని 2019లో సీన్ మారిపోయింది. వైసీపీ అధికారంలోకి రావడం అమరావతికి గండంగా మారింది. ఆంధ్రుల కోటి ఆశ... మూడు ముక్కలాటలుగా మారిపోయింది. జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన సంచలనమైంది. 

జగన్ రెడ్డి ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఏడు వందలకు పైగా రోజులుగా రోడ్డుపైనే ఉన్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినదిస్తున్నారు. సోమవారం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది జగన్ రెడ్డి సర్కార్. దీంతో అమరావతిపై శంకుస్థాపన నుంచి ఉపసంహరణ వరకు అన్నీ సంచలనమే..

అమరావతిపై ఏ రోజున ఏం జరిగిందో చూద్దాం..   

2014 సెప్టెంబరు 3:  రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ అసెంబ్లీ తీర్మానం   

డిసెంబరు 23:   ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని ఆమోదించిన శాసనసభ   

డిసెంబరు 30:   సీఆర్‌డీఏ అథారిటీ ఏర్పాటు. 7,317 చ.కి.మీ. విస్తీర్ణంలో కేపిటల్‌ రీజియన్‌ని, 217.23 చ.కి.మీ.లలో రాజధాని నగరాన్ని నోటిఫై చేసిన ప్రభుత్వం   

2015 ఫిబ్రవరి 28:  కేవలం రెండు నెలల వ్యవధిలో 32,469 ఎకరాలు ఇచ్చిన 20,510 మంది రైతులు   

అక్టోబరు 22:  ఉద్ధండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన   

2016 ఏప్రిల్‌ 25:  వెలగపూడి సచివాలయం ప్రారంభం.   

జూన్‌ 6:  సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు లాటరీ ద్వారా స్థలాల కేటాయింపు ప్రక్రియ నేలపాడు గ్రామంతో ప్రారంభం   

అక్టోబరు 28:  పరిపాలన నగరానికి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన   

2017 మార్చి 2:   వెలగపూడిలో అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు   

డిసెంబరు 27:  రాజధాని నగరం అమరావతిని సందర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌   

2019 ఫిబ్రవరి 3:  జ్యుడిషియల్‌ కాంప్లెక్స్‌  ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన అప్పటి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌   

డిసెంబరు 17:  మూడు రాజధానుల్ని ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటన   

డిసెంబరు 18:  సీఎం ప్రకటనకు నిరసనగా ఉద్యమం ప్రారంభించిన రాజధాని రైతులు   

2020 జనవరి 3:  మూడు రాజధానుల్ని సిఫారసు చేస్తూ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక   

జనవరి 20:  నిరసనగా అసెంబ్లీ వద్దకు చేరుకున్న రైతులపై లాఠీఛార్జి   

జనవరి 20:  మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఆమోదించిన అసెంబ్లీ   

ఫిబ్రవరి 10:  ప్రొసీజర్‌ ఫాలో అవ్వనందున బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపలేనంటూ మండలి ఛైర్మన్‌కు తిప్పి పంపిన ఇన్‌ఛార్జి సెక్రటరీ   

జూన్‌ 16:  ఆ రెండు బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన ప్రభుత్వం   

జూన్‌ 17:  కౌన్సిల్‌లో తెదేపాఆందోళనతో చర్చకు నోచుకోని బిల్లులు   

జులై 31:   బిల్లులకు ఆమోదముద్ర వేసిన గవర్నర్‌   

2021 నవంబరు 1:  తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన రైతులు   

నవంబరు 22:  కొత్త బిల్లులు తెస్తామంటూ.. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని ఉపసంహరిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టిన  ప్రభుత్వం   

By
en-us Political News

  
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.