Publish Date:Sep 11, 2025
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ తాను సాధించిన అతి గొప్ప విజయంగా 17 కాలేజీలు నిర్మించానని తన భుజాలు తానే చరిచేసుకుంటూ ఉంటారు. ఆయన పార్టీకి కూడా చెప్పుకునేందుకు ఇది తప్ప మరొకటి కనిపించని పరిస్థితి ఉంది. అయితే వాస్తవం ఉమిటంటే.. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదు. మహా అయితే ఓ ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయి ఉంటుంది. అలా పూర్తయిన కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. ఇక మిగిలిన కాలేజీల విషయానికి వస్తే భూ కేటాయింపులైతే జరిగాయి కానీ, నిర్మాణ పనులు ఆరంభం కాలేదు. కొన్ని కాలేజీలకు పునాదులు మాత్రమే పడ్డాయి. అంతే. ఐతే వైసీపీ మాత్రం 17 కాలేజీల నిర్మాణం తమ హయాంలో పూర్తయ్యిందని గప్పాలు కొట్టేసుకుంటున్నది. ఇదే విషయాన్ని జగన్ బుధవారం (సెప్టెంబర్ 10) మీడియా సమావేశంలో తన హయాంలో 17 కాలేజీల నిర్మాణం పూర్తయ్యిందని మరోమారు చెప్పుకుని, తన భుజం తానే చరుచుకుని చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. సరే జగన్ విమర్శలకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారనుకోండి అది వేరు సంగతి.
ఇప్పుడు విషయానికి వస్తే జగన్ ను మీడియా ప్రతినిథులు కాలేజీల నిర్మాణం పూర్తి కాలేదుగా అని అడిగితే.. జగన్ ఏ నిర్మాణమైనా ఒక్క రోజులో పూర్తి కాదు.. కొన్నేళ్ల సమయం పడుతుందంటూ జవాబిచ్చారు. ఇందుకు ఉదాహరణగా మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టిందంటూ ఉదాహరణ చూపారు. మంగళగిరి ఎయిమ్స్ భారీ భవన సముదాయం. నిర్మాణానికి సమయం పట్టిందంటూ అర్ధం ఉంది. దానిని ఉదాహరణగా చూపుతూ మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూడా సమయం పడుతుందంటూ జగన్ సమర్ధించుకోవాలని చూశారు. ఆయన సమర్ధింపు ఎలా ఉందంటే.. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఐదేళ్ల సమయం సరిపోదన్నట్లుగా ఉంది. ఈ లాజిక్ తో మీడియా నోరు మూసేశానని జగన్ సంబరపడి ఉండొచ్చు కానీ 2015లో అమరావతి రాజధానిగా ఖరారయ్యాక తర్వాతి నాలుగేళ్లలో రాజధాని పూర్తి కాలేదంటూ అప్పట్లో జగన్ కురిపించిన విమర్శల మాటేంటన్న ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెబుతారు.
40 వేల కోట్లకు పైగా వ్యయంతో పలు భారీ భవనాలు దాదాపు పూర్తి అయినా అప్పట్లో అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఏం లేదంటూ చేసిన వ్యాఖ్యల సంగతేంటని నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఐదేళ్లు ఎలా సరిపోతాయంటూ తర్కం మాట్లాడుతున్న జగన్.. అమరావతిపై నిర్మాణాలపై అప్పట్లో చేసిన వ్యాఖ్యలు, విమర్శలకు ఏం లాజిక్ చెబుతారని నిలదీస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-say-takes-time-for-constructions-39-205977.html
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.