LATEST NEWS
నీట్ పేపర్ లీకేజీల నిరసనల్లో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా ఇప్పుడు పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్ ను ఇరుకున పెట్టింది. నీట్ లీకేజీకి నిరసనగా.. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హస్తిన వేదికగా జరిగిన ఆందోళనకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ,   ప్రధాన్ మస్ట్ గో’ అంటూ ప్రచారం చేసింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆపార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాలు జంతర్ మంతర్ కు వెళ్లి మరీ కాక్రోచ్ ఆందోళనలకు సంఘీ భావం ప్రకటించారు.   ఆ సందర్భంగా  ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా   పంజాబ్‌లో  అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంలో ఇప్పటి వరకూఅంటే గత నాలుగున్నర ఏళ్లుగా  ఒక్క పేపర్ లీక్  అవ్వలేదని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా, ఒక వేళ అలా లీక్ అయి ఉంటే పంజాబ్ విద్ాయమత్రి చేత రాజీనామా చేయించి ఉండేవారమని సవాల్ చేశారు.   ఆ సవాలే ఇప్పుడు ఆప్ విద్యామంత్రి పదవికి ఎసరు తెచ్చింది.  మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన   కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్  పార్టీలు  పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో  కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు,  లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.  ఇటీవల ఫరీద్‌కోట్‌లో జరిగిన 454 ఫార్మసిస్ట్ పోస్టుల నియామక పరీక్షలో చోటుచేసుకున్న హైటెక్ కాపీయింగ్ వ్యవహారం పంజాబ్‌లో పెద్ద కలకలం రేపిన సంగతి విదితమే. అభ్యర్థులు పెన్ కెమెరాల ద్వారా ప్రశ్నపత్రాలను ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా బయటకు పంపి, వైర్‌లెస్ పరికరాల ద్వారా సమాధానాలు పొందినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలకు సంబంధించి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 3.5 లక్షల నుండి రూ. 13 లక్షల వరకు లంచాలు వసూలు చేసినట్లు పోలీసు దర్యాప్తులో బయటపడింది. అలాగే ఫిబ్రవరి 2023లో..  పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ 12వ తరగతి ఇంగ్లీష్ బోర్డు పరీక్ష ప్రారంభానికి   ముందు  లీక్ కావడంతో ఆ పరీక్షను అత్యవసరంగా రద్దు చేశారు. ఇవే కాకుండా,  నైబ్ తహసీల్దార్ రిక్రూట్‌మెంట్, పంజాబ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష , అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, పిఎస్‌ఎస్‌ఎస్‌బి గ్రూప్-బి పరీక్షలలో కూడా   కుంభకోణాలు బయటపడ్డాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, నీతికి కట్టుబడి పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బేన్స్, ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ కూడా  తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్, అకాలీదళ్ నాయకురాలు హ డిమాండ్ చేస్తున్నారు.  దీంతో ప్రధాన్ మస్ట్ గో’ ఉద్యమం కాస్తా పంజాబ్‌లో  బేన్స్ రాజీనామా’ డిమాండ్ కు  దారి తీసింది. చూడాలి మరి ఇప్పుడు ఆప్ ఏ విధంగా స్పందిస్తుందో?   Harjot Singh Bains, Manish Sisodia Challenge, Punjab Paper Leak Scam, Dharmendra Pradhan Resignation, Punjab Elections
  ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ  నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, వైసీపీ నేత జోగి రమేష్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జోగి రమేష్ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ, ఆయన ఎన్నికల చరిత్ర, నియోజకవర్గాల మార్పులు  గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై వసంత కృష్ణప్రసాద్  టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  వర్తమాన రాజకీయ పరిస్థితికృష్ణా జిల్లా రాజకీయాల్లో మైలవరం, పెనమలూరు, పెడన నియోజకవర్గాలు అత్యంత కీలకమైన ప్రాంతాలు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణప్రసాద్, 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం నుంచి 43,000 పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు, వైఎస్సార్‌సీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన జోగీ రమేష్ 2024 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 60,000 పైగా భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంతో పాటు, మైలవరంలో రాబోయే రోజుల్లో 80,000 మెజారిటీతో ఓడిస్తానంటూ జోగీ రమేష్ చేసిన సవాళ్లను వసంత కృష్ణప్రసాద్ తీవ్రంగా తప్పుపట్టారు. వరుసగా నియోజకవర్గాలు మారుస్తూ స్థిరత్వం లేని నేతగా జోగీ రమేష్ మిగిలిపోయారని, ఎన్నికల్లో తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొన్న వ్యక్తికి తనపై మాట్లాడే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యూహాలు  పరిణామాలు మైలవరం నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే, సాధారణంగా మెజారిటీలు చాలా తక్కువగా ఉంటాయి. 1972 నాటి రికార్డులను తిరగరాస్తూ 2024లో సాధించిన 43,000 ఓట్ల మెజారిటీ తన ప్రజాదరణకు నిదర్శనమని వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రెండు విభిన్న పార్టీల తరఫున ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడం తన రాజకీయ బలానికి నిదర్శనమని స్పష్టం చేశారు.అలాగే జోతి రమేష్ రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ — 2009లో పెడన, 2014లో మైలవరం, 2019లో తిరిగి పెడన, 2024లో పెనమలూరు నుంచి పోటీ చేయడం ఆయనకున్న ఓటు బ్యాంకు లేమిని ఎత్తిచూపుతోందని విమర్శించారు.  గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పెడన నియోజకవర్గంలో ఇసుక మైనింగ్, చేపల చెరువులు, రెవెన్యూ పాస్ పుస్తకాల మంజూరు వంటి వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. భవిష్యత్ రాజకీయ ప్రభావంకృష్ణా జిల్లా రాజకీయాల్లో వసంత కృష్ణప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సమస్యలపై స్పందిస్తూనే, ప్రతిపక్షం చేసే ఆరోపణలను తిప్పికొట్టడంలో కృష్ణప్రసాద్ దూకుడు ప్రదర్శిస్తున్నారు.  ఓటమి భారం నుంచి తేరుకోకముందే నేతల మధ్య పరస్పర ఆరోపణలు పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. స్థానిక నాయకత్వ పోరు: రాబోయే రోజుల్లో మైలవరం, పెనమలూరు పరిధిలో వైఎస్సార్‌సీపీ పునర్నిర్మాణం అంత సులువు కాదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి, మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు కృష్ణా జిల్లా రాజకీయాల్లో వేడిని మరింత పెంచాయి. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.     Vasantha Krishnaprasad, Jogi Ramesh, Mylavaram MLA, TDP, YSRCP, Krishna district politics, Penamalur elections, Andhra Pradesh politics, Pedana constituency, AP Politics
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవలి  తీరు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.  ఆయన అడుగులు తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా పడుతున్నాయా? అన్న చర్చ మొదలైంది. గతంలో కేశినేని నాని, అంతకంటే ముందు కొడాలి నాని, వంశీ వంటి నేతల బాటలోనే బోండా ఉమ అడుగులు పడుతున్నాయా అన్న అనుమానాలకు తావిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు..  ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి.   గుంటూరులో జరిగిన  ముద్రగడ సంస్మరణ సభ వేదికగా..  బోండా ఉమా చేసిన ప్రసంగం వైసీపీ స్వరం వినిపించేలా ఉంది.   రాష్ట్ర జనాభాలో   25 శాతానికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజకీయాల్లో, ప్రభుత్వ సంక్షేమ నిధుల్లో తగిన ప్రాధాన్యం లభించాలనీ,  కాపుల ఆవేదనను,  డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే ఆలకించి, వారికి న్యాయమైన వాటా దక్కేలా నిర్ణయాలు తీసుకోవాలని బోండా చేసిన వ్యాఖ్యలు.. ఇటీవలి కాలంలో వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను బలపరిచేవిగా ఉన్నాయి. బొండా ఉమానే స్వయంగా తమ పార్టీ  ప్రభుత్వ తీరును ఎత్తిచూపేలా మాట్లాడటం వెనుక ఉన్న వ్యాహంపై చర్చోపచర్చలు   మరొకవైపు, గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై, పార్టీ సిద్ధాంతాలపై అత్యంత దారుణమైన పదజాలంతో విరుచుకుపడిన అంబటి రాంబాబుతో బోండా ఉమా వేదిక పంచుకోవడం, సన్నిహితంగా మెలగడం కూడా బోండా ఉమా రాజకీయ అడుగులు ఏ దిశగా పడుతున్నాయో తేటతెల్లం చేశాయంటున్నారు.  తెలుగుదేశం   అధినేతను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తితో వేదిక పంచుకోవడమే కాకుండా, ఆయనతో నవ్వుతూ ముచ్చటించడం ద్వారా బోండా ఉమా తీరుపై తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.     ఇక పోత తెలుగుదేశం కేడర్ మాత్రం ఉమా పార్టీని వీడితేనే మేలని అభిప్రాయపడుతోంది. ఆయన పార్టీని వీడ వరకూ ఆగకుండా తెలుగుదేశం అధిష్టానమే ఆయనను బహిష్కరించాలని కూడా కోరుకుంటోంది. ఎందుకంటే.. ఉమా తెలుగుదేశం పార్టీని వీడితే కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న చంద్రంగా ఇంత కాలంగా విజయవాడ రాజకీయాలలో క్రియాశీలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న వంగవీటి రాధాకు మార్గం సుగమం అవుతుందని పార్టీ క్యాడర్ భావిస్తున్నది.   రాబోయే రోజుల్లో బోండా ఉమా తన రాజకీయ ప్రయాణంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమా నిజంగానే జెండా మారుస్తారా లేక పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచి తన ప్రాధాన్యాన్ని పెంచుకోవడానికి ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. విజయవాడ నగర రాజకీయాల్లో బోండా ఉమా తీసుకునే నిర్ణయం కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండింటికీ ఎంతో కీలకమైనదిగా మారనుంది. 2024 ఎన్నికలలోనే తెలుగుదశం పార్టీ వంగవీటి రాధాను  మచిలీపట్నం ఎంపీ సీటు లేదా ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఆఫర్ చేసింది. అయితే అప్పట్లో  రాధా  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అయితేనే పోటీ చేస్తాననీ, లేకుంటే.. పోటీలో ఉండననీ స్పష్టం చేయడమే కాకుండా, పోటీ చేయకున్నా..  తెలుగుదేశం అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని చెప్పి అదే పని చేశారు. అప్పట్లో.. విజయవాడ సెంట్రల్ నుంచి అంతకుముందు ఎన్నికలలో స్వల్ప తేడాతో పరాజయం పాలైన బోండా ఉమాను పక్కన పెట్టడం ఇష్టం లేక వంగవీటి రాధా కోరినట్లుగా  ఆ నియోజకవర్గ టికెట్ వంగవీటి రాధాకు ఇవ్వలేదు చంద్రబాబు.   ఇప్పుడు బోండా ఉమానే తన వ్యవహార శైలితో కాగల కార్యాన్ని స్వయంగా ఆయనే నెరవేరుస్తున్నారని తెలుగుదేశం వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. బోండా ఉమా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరితే.. వంగవీటి రాధా వచ్చే ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుంచి పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనీ, అదే జరిగితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మరింత బలపడే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. అదే సమయంల వైసీపీలో బోండా ఉమా చేరిక ఆ పార్టీలో విభేదాలకు కారణమౌతుందనీ, విజయవాడలో ప్రస్తుతం వైసీపీ తరఫున చక్రం తిప్పుతున్న దేవినేని అవినాశ్, ఇతర నేతలు నిస్సందేహంగా వ్యతిరేకిస్తారనీ చెబుతున్నారు. మొత్తం మీద బోండా ఉమ పార్టీ మారతరన్న వార్తలు తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ పింపుతుంటే.. వైసీపీ శ్రేణుల్లో గుబులు మొతలైందని పరిశీలకులు విశ్లేషిస్టున్నారు.  Bonda Uma, Ambati Rambabu, TDP Political News, Vijayawada olitics, YCP Rumors
నీటి పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ  ఆధ్వరంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా నిరసనకు తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు ప్రధాని నరేంద్రమోడీ. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు అనివార్యంగా ధర్మేంద్రప్రధాన్ చేత రాజీనామా చేయిం,చాల్సిన పరిస్థితి ఎదురుర కావడం మోడీ ప్రతిష్ట మసకబారడానికి కారణమైంది.  కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా  విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు. అటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉండగానే విద్యావ్యవస్థలో అక్రమాలపై విద్యార్థులే ఉవ్వెత్తున ఉద్యమించారు. అదలా ఉంచితే.. నరేంద్ర మోడీ తాత్కాలికంగా జోషీకి విద్యాశాఖ అప్పగించారనీ, త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో విద్యాశాఖ బాధ్యతలు రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరికి అప్పగించే అవవకాశాలు మెండుగా ఉన్నాయనీ ఢిల్లీ వర్గాల సమాచారం.  గతంలో క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉండంతో ప్రధాని మోడీ ఆమెవైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు.  నీట్   లీకేజీ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట బాగా మసకబారిందనడంలో సందేహం లేదు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ మోడీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు, నిరసనలు ఎదురయ్యాయి. దీంతో ప్రధాని మోడీ నష్టనివారణపై దృష్టి పెట్టారంటున్నారు.  ఇప్పటికే మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రధాని విద్యాశాఖను విద్యావంతురాలు, రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే క్లీన్ ఇమేజ్ ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసిన పురంధేశ్వరి  సమర్థవంతమైన నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల కు ముందు బీజేపీలో చేరిన పురంధేశ్వరి..ఆ ఎన్నికలలో  రాజంపేట నుంచి  పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లోఆమె రాజమహేందర వరం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను కేబినెట్ లోకి తీసుకుని విద్యాశాఖను అప్పగించాలని మోడీ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.   Daggubati Purandeswari into union cabinet, Union Education Minister, Dharmendra Pradhan resignation, Rajahmundry MP, Modi Cabinet expansion 
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు,  మాజీ మంత్రి,  ఆర్.కె. రోజా అరెస్టు కాక తప్పదా? తాజాగా పోలీసులు రోజాకు నోటీసులు జారీ చేయడంతో రాజకీయవర్గాలలో రోజా అరెస్టు అవుతారా అన్న చర్చ జోరందుకుంది.   ఒక పాత కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు.  ఆ నోటీసులలో  ఈ నెల 30 న విచారణాధికారుల ఎదుట  హాజరుకావాలని, లేనిపక్షంలో  అరెస్ట్ చేస్తామనీ పేర్కన్నారని అంటున్నారు.  రోజా ఇటీవల కొంత కాలంగా రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా ఉండటం లేదు.  తాజాగా పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడానికి, వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో   రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర  క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా   క్రీడా పరికరాల కొనుగోల విషయంలో  భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై   వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో  అప్పటి మంత్రి రోజాను ప్రశ్నించడం కోసం నోటీసులు జారీ చేశారు.  ; పోలీసు నోటీసుల మేరకు రోజా ఈ నెల 30న విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు కాకున్నా, విచారణలో అధికారులకు సహకరించకున్నా అరెస్టు తప్పదని ఆ నోటీసులలోనే పేర్కొన్నట్లు తెలుస్తోంది.  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మాజీ మంత్రి రోజా రాజకీయంగా పెద్దగా క్రీయాశీలంగా వ్యవహరించడం లేదు. కానీ గతంలో ఆమె విపక్షాలపై మీడియా సమావేశాల్లో, సభల్లో పెద్ద ఎత్తున విమర్శలతో విరుచుకుపడేవారు. ఆ సందర్భంగా ఆమె అనుచిత భాషా ప్రయోగం చేసేవారన్న ఆరోపణలున్నాయి. అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి, తాను కూడా స్వయంగా నగరి నుంచి పరాజయం పాలైన తరువాత నుంచి ఆమె మీడియా ముందుకు రావడం బాగా తగ్గించారు. పైగా ఎక్కువ సమయం తమిళనాడు రాజధాని చెన్నైకే పరమితమౌతూ వస్తున్నారు. ఒక సందర్భంలో ఆమె టీవీకేలో చేరేందుకు తెగ ప్రయత్నించారన్న వార్తలు కూడా వచ్చాయి. సరే కేసుల భయతోనే రోజా రాజకీయంగా దూకుడు తగ్గించారని పరిశీలకులు విశ్లేషణనలు కూడా చేశారు.  గత కొంత కాలంగా చెన్నైకే పరిమితమైన రోజా.. నగరి నియోజకవర్గానికి వచ్చిన రెండు రోజులలోనే పోలీసులు ఆమె ఇంటికి వచ్చి మరీ నోటీసులు అందించారు.   కాగా రోజాకు పోలీసులు అందజేసిన నోటీసులలో  ఆడుదాం ఆంధ్ర అవకతవకలతో పాటుగా, అప్పట్లో రోజా మంత్రిగా వ్యవహరించిన  పర్యాటక  శాఖ ఆధ్వర్యంలో జరిగిన పలు కాంట్రాక్టులు, నిర్వహణ నిధుల వ్యయంలో జరిగిన కేటాయింపులపై కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆడుదాం ఆంధ్ర పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ గతంలోనే దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా విచారణ అధికారులు కీలక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. క్రీడా సామాగ్రి కొనుగోలు టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ప్రాథమిక నివేదికల ఆధారంగానే ఇప్పుడు రోజాకు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
యాక్టర్ సత్యదేవ్, డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్లో తెరకెక్కిన సైకలాజికల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం 'రావు బహదూర్'. థియేటర్లలో విభిన్నమైన కథాంశంతో ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.  సూపర్ స్టార్ మహేష్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ+ఎస్ మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ జూలై 3న థియేటర్లలో విడుదలైన 'రావు బహదూర్', ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది. ఇప్పుడు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డిజిటల్ వేదికపై సందడి చేయడానికి రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 'రావు బహాదుర్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా, జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో స్ట్రీమింగ్ కానుంది. Also Read: రావు బహదూర్ మూవీ రివ్యూ  "అనుమానం పెనుభూతం" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో వచ్చిన ఈ సినిమా, ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. థియేటర్‌లో ఈ వినూత్న ప్రయోగాన్ని మిస్ అయిన ఫిల్మ్ లవర్స్, సైకలాజికల్ థ్రిల్లర్ ఫ్యాన్స్, జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'రావు బహదూర్' చూసి ఎంజాయ్ చేయవచ్చు.   కథ ఏంటంటే.. రాజ కుటుంబానికి చెందిన రామప్ప(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ తో బాధపడుతుంటాడు. భ్రమలు, భయాలతో తన గదినే ప్రపంచంగా బ్రతుకుతున్న రామప్పకు వింతైన మానసిక సమస్య కూడా ఉంటుంది. లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న అతను.. మరెన్నో రోజులు బ్రతకడని డాక్టర్లు చెబుతారు. కానీ, సీనియర్ డాక్టర్ల అంచనాలను కూడా తలకిందులు చేస్తూ.. రామప్ప ఎక్కువరోజులు బతుకుతుంటాడు. దానికి కారణం అనుమానం అనే పెనుభూతం. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తన రెండో కొడుకు తనకి పుట్టినవాడు కాదని అనుమాన పడుతుంటాడు. ఆ అనుమానం తీరే వరకు ప్రాణాలతోనే ఉంటానంటూ, చావుకే సవాల్ విసురుతాడు. అసలు రామప్పకు ఆ మానసిక సమస్య ఎలా వచ్చింది? కొడుకు పుట్టుకపై అనుమానం కలగడానికి కారణమేంటి? అసలు ఆ అనుమానం నిజామా కాదా? చివరికి రామప్పకు తెలిసిన నిజమేంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.     Rao Bahadur, OTT Release, Netflix, Satyadev, Venkatesh Maha  
  రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).. తెలుగు సినిమా, ప్రేక్షకులు మూస పద్దతిలో సినిమా చేసుకొని, చూసుకుంటూ ఉండే  వాళ్ళని అప్ డేట్ అవ్వరా అంటూ డిఫరెంట్ సబ్జెట్స్, టేకింగ్ తో  పరిశ్రమ గతినే మార్చివేసాడు. ఇప్పుడేమో తనే అప్ డేట్ అవ్వకుండా మూస పద్దతిలో సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకు కారణాలు తెలియదు కానీ రీసెంట్ గా వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఎక్స్ వేదికగా 'విద్యార్థులు ఎదుర్కొంటున్న అసలు ముప్పు నీట్ పరీక్షల లీకేజీలు కాదు. మన కళ్లముందే వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నీట్ లీకులు, పరీక్షల రద్దు వల్ల వ్యవస్థ గాయపడుతుందేమో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం ప్రస్తుత విద్యా వ్యవస్థ పీకని కోసేస్తుంది. ప్రస్తుత విద్యావిధానాన్ని వెంటనే రద్దు చేసి, 'ఎడ్యుకేషన్‌ ని  చంపేయాలి' (EDUCATION SHOULD BE KILLED).  ఇప్పటివరకు సమాజం అనుసరిస్తున్న బట్టీ చదువుల విధానం పూర్తిగా కాలం చెల్లిపోయిం ది. పుస్తకాలు చదవడం, బట్టీ పట్టడం, పరీక్షలు రాయడం, డిగ్రీలు పొందడం, ఉద్యోగాలు సాధించడం అనే పాతకాలపు ఫార్ములాని  ఇకపై చింపి పారేయాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా ఒక వైద్య విద్యార్థి 5 సంవత్సరాలు ఎంబీబీఎస్, మరొక 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆపై 2 లేదా 3 సంవత్సరాలు స్పెషలైజేషన్ కోసం కేటాయిస్తూ, మొత్తంగా 10 సంవత్సరాల సుదీర్ఘకాలాన్ని కేవలం సమాచారాన్ని నేర్చుకోవడానికే వెచ్చిస్తున్నాడు.   అయితే, ఒక విద్యార్థి తన 10 ఏళ్ల జీవితాన్ని ధారపోసి నేర్చుకునే సమాచారం మొత్తాన్ని, నేడు అతని జేబులో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్షణాల్లో అందిస్తోంది. Also read: రామ్ చరణ్ క్షేమం కోసం ఉపాసన కీలక నిర్ణయం.. పిక్స్ వైరల్  ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు మూలకర్తగా భావించే ప్రసిద్ధ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ సయితం రాబోయే రోజుల్లో ఏఐ ప్రతి పనినీ మనుషుల కంటే అత్యంత మెరుగ్గా చేయగలదని గొంతు ఎత్తి హెచ్చరిస్తున్నారు. వైద్యులు ప్రస్తుతం చేసే రోగ నిర్ధారణ, డేటా విశ్లేషణ, చికిత్సా సూచనలు వంటి బాధ్యతలని  కేవలం 1 నుండి 2 సంవత్సరాల వ్యవధిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోబోతోందని నిపుణులు ఏకోపPhysicianగా అంగీకరిస్తున్నారని వర్మ తెలిపారు. Ram Gopal Varma, Neet
మలయాళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కథానాయకుడు బాసిల్ జోసెఫ్. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, సహజసిద్ధమైన కామెడీ మరియు హృదయానికి హత్తుకునే నటనతో దక్షిణాది ప్రేక్షకులను అలరించడంలో ఆయన శైలి ప్రత్యేకం. బాసిల్ జోసెఫ్ నటించిన అనేక చిత్రాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన ప్రజాదరణ పొందుతుంటాయి. ఈ క్రమంలోనే సంగీత్ పీ రాజన్ దర్శకత్వంలో భవన స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన 'పాల్తు జాన్వర్' అనే గ్రామీణ డ్రామా చిత్రం, 2022 సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలై మలయాళంలో మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ రూపంలో జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చి, డిజిటల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినీ సమీక్షకుల నుంచి ఈ చిత్రానికి 5 కి గానూ 3.00 రేటింగ్ లభించడం విశేషం. ఈ కథ అంతా ప్రసూన్ అనే ఒక సగటు యువకుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రసూన్ తన సొంత యానిమేషన్ కంపెనీని స్థాపించి, వ్యాపారంలో తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటాడు. సరిగ్గా అదే సమయంలో అతని తండ్రి అకస్మాత్తుగా మరణిస్తాడు. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న తండ్రి మరణించడంతో, ఆ ఉద్యోగం కారుణ్య నియామకం కింద ప్రసూన్‌కు వస్తుంది. పట్టణ వాతావరణంలో పెరిగిన ప్రసూన్‌కు పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల జీవనశైలి, పశువుల సంరక్షణకు సంబంధించిన విషయాలు ఏమాత్రం తెలియవు. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడితో, ఏమాత్రం ఇష్టం లేకపోయినా పశువైద్యశాలలో 'లైవ్ స్టాక్ ఇన్‌స్పెక్టర్' ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. పల్లెటూరి వాతావరణంలో తగిన శిక్షణ, అనుభవం లేని ప్రసూన్ ఆస్పత్రిలో అడుగుపెట్టిన క్షణం నుంచే రకరకాల ఇబ్బందులను ఎదుర్కోవడం ప్రారంభిస్తాడు. ఆ పశువైద్యశాలలో పనిచేసే మిగతా సిబ్బంది తీరు ప్రసూన్ పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తుంది. అక్కడ పనిచేసే డాక్టర్ సునీల్ (షమ్మీ తిలకన్) కి తన వృత్తిపై ఏమాత్రం దృష్టి ఉండదు. ఆయన ఎప్పుడూ తన సొంత వ్యాపారాల్లోనే మునిగితేలుతుంటాడు. ఇక అటెండర్ మాథ్యూస్ ఏ విషయాన్ని కూడా సీరియస్‌గా తీసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాడు. స్థానిక చర్చి ఫాదర్‌తో కలిసి గ్రామసభలు నిర్వహిస్తూ హడావుడి చేసే జార్జ్ (ఇంద్రన్స్), మరోవైపు పంచాయతీ అధికారులపై ఆగ్రహంతో ఉండే డేవిస్ (జాన్ ఆంటోని) పాత్రలు గ్రామీణ వాతావరణాన్ని చాలా తత్వంతో ప్రతిబింబిస్తాయి. ఇష్టం లేని ఉద్యోగం కావడం, తోటి ఉద్యోగుల నుంచి సహకారం లేకపోవడంతో ప్రసూన్ తీవ్ర అసంతృప్తితో కాలం వెళ్లదీస్తుంటాడు. ఈ క్రమంలోనే ఒక సంఘటనలో అతని నిర్లక్ష్యం వల్ల పోలీస్ డాగ్ చనిపోవడంతో సమస్యలు మరింత సంచలనంగా మారతాయి. సమాజంలో చాలామంది తాము చేసే పని తమ స్థాయికి తగినది కాదనే భావనతో, పూర్తి అసంతృప్తితో రోజులు నెట్టుకొస్తుంటారు. తమ స్థాయికి తగిన ఉద్యోగం కాదనుకున్నప్పుడు ఆ పనిపై శ్రద్ధ పెట్టలేరు, నైపుణ్యాలను పెంపొందించుకోలేరు. కథానాయకుడు ప్రసూన్ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే. అయితే పల్లెటూర్లలో ప్రజలు పశువులను కేవలం మూగజీవాలుగా కాకుండా, తమ ఇంట్లోని కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారని ప్రసూన్‌కు ఆలస్యంగా అర్థమవుతుంది. "నా కూతురు కడుపుతో ఉంది, నా ఆవు కూడా కడుపుతో ఉంది.. రెండింటినీ నేను ఒకేలా చూసుకుంటాను" అని ఒక విలేజర్ చెప్పే సంభాషణ పశువుల పట్ల వారికి ఉన్న ప్రేమానురాగాలకు అద్దం పడుతుంది. ఓ ఆవు ప్రసవం చుట్టూ తిరిగే సన్నివేశాలు, గ్రామస్తుల మూఢనమ్మకాలపై వచ్చే సున్నితమైన హాస్యం ప్రేక్షకుల మనసులను దోచుకుంటాయి. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా, అంకితభావంతో చేసినప్పుడే నిజమైన ఆత్మసంతృప్తి లభిస్తుందనే ఒక గొప్ప సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది. ప్రతి పాత్రలోనూ నటులు జీవించేశారని, ఇది నటులను చూస్తున్నట్లు కాకుండా మన పక్కింటి మనుషులను చూస్తున్న భావన కలిగిస్తుందని రివ్యూవర్లు కొనియాడారు. జస్టిన్ వర్గీస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సహజసిద్ధమైన ఛాయాగ్రహణం, పదునైన ఎడిటింగ్ ఈ ఫీల్ గుడ్ డ్రామాను మరింతగా నిలబెట్టాయి. పల్లెటూరి నేపథ్యం, మానవీయ సంబంధాలు, సున్నితమైన హాస్యంతో సాగే చిత్రాలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు జియో హాట్‌స్టార్‌లో లభిస్తున్న 'పాల్తు జాన్వర్' ఒక మస్ట్ వాచ్ మూవీగా నిలుస్తుంది.     Plathu Janwar Movie Review, Basil Joseph Plathu Janwar Telugu, JioHotstar Malayalam OTT releases
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు జయం రవి తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక ఒత్తిడికి సంబంధించి చెన్నై ఫ్యామిలీ కోర్టులో ఒక అత్యంత కీలకమైన, ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా జయం రవి, ఆయన భార్య ఆర్తి మధ్య కొనసాగుతున్న విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలోనే కాకుండా యావత్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రమై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, భరణం చెల్లింపు, పిల్లల సంరక్షణకు సంబంధించిన పిటిషన్లపై చెన్నై ఫ్యామిలీ కోర్టు ఇటీవల విచారణ జరిపి సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు జయం రవికి ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చలనచిత్ర విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా జయం రవి భార్య ఆర్తి కోర్టు ముందు పెట్టిన డిమాండ్ తీవ్ర కలకలం రేపింది. తన నెలవారీ వ్యక్తిగత, జీవనశైలి ఖర్చుల కోసం నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని ఆమె న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. నెలకు రూ.40 లక్షలు అంటే కేవలం ఒక్క ఏడాదికే ఈ మొత్తం రూ.4.8 కోట్లకు చేరుకుంటుంది. ఈ స్థాయిలో భారీ భరణాన్ని డిమాండ్ చేయడంపై న్యాయమూర్తి సుదీర్ఘంగా విచారణ జరిపారు. జయం రవి ఆదాయ మార్గాలు, ఆయన ఆర్థిక స్థితిగతులు, సినిమా రంగంలో ఉండే అస్థిరతలను సమగ్రంగా పరిశీలించిన చెన్నై ఫ్యామిలీ కోర్టు, ఆర్తి చేసిన ఈ రూ.40 లక్షల నెలవారీ డిమాండ్‌ను ఏమాత్రం సమర్థనీయం కాదని భావిస్తూ పూర్తిగా తోసిపుచ్చింది. భారీ భరణం డిమాండ్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఈ కేసు తుది విచారణ పూర్తయ్యేంత వరకు తాత్కాలిక భరణం కింద ప్రతి నెలా రూ.3 లక్షలు మాత్రమే చెల్లించాలని జయం రవిని ఆదేశించింది. ఆర్తి కోరిన రూ.40 లక్షలతో పోలిస్తే కోర్టు నిర్ణయించిన రూ.3 లక్షల తాత్కాలిక భరణం జయం రవికి ఊహించని పెద్ద ఆర్థిక సడలింపుగా మారింది. సాధారణంగా కోలీవుడ్‌లో ఒక సినిమా పూర్తి కావడానికి జయం రవికి కనీసం ఏడాదికి పైగా సమయం పడుతుంది. ప్రతీ నెలా రూ.40 లక్షల చొప్పున ఏడాదికి రూ.4.8 కోట్లు చెల్లించాల్సి వస్తే, ఆయన సంపాదించే రెమ్యునరేషన్ అంతా భరణానికే సరిపోతుందని, ఇది నటుడిని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆ పీడకల తొలిగిపోయిందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం భరణం విషయంలోనే కాకుండా పిల్లల సంరక్షణ, కలుసుకునే హక్కుల విషయంలో కూడా జయం రవికి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువడింది. గతంలో తన పిల్లలను కలుసుకునేందుకు ఆర్తి అడ్డుపడుతోందని, పిల్లలకు తండ్రి ప్రేమను దూరం చేస్తోందని జయం రవి ఆవేదన వ్యక్తం చేసిన వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన న్యాయస్థానం, తండ్రిగా తన పిల్లలతో గడిపే హక్కు జయం రవికి ఉందని స్పష్టం చేస్తూ, నిర్దిష్టమైన షరతులతో పిల్లలను కలుసుకునేందుకు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో తన పిల్లలను మళ్లీ చూడగలననే నమ్మకం జయం రవిలో మానసిక ధైర్యాన్ని నింపింది. విడాకుల ప్రకటన వెలువడినప్పటి నుంచి జయం రవిపై అనేక రకాల పుకార్లు, వ్యక్తిగత ఆరోపణలు వ్యాప్తి చెందాయి. ఒక ప్రముఖ గాయనితో ఆయనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు ఇరు వర్గాల నుంచి పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో ఈ వివాదం చాలా సంక్లిష్టంగా మారింది. ఇటువంటి క్లిష్ట సమయంలో చెన్నై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఈ తాజా ఆదేశాలు జయం రవికి నిజమైన న్యాయం జరిగిందనే భావనను కలిగించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఆయన తన సినిమా కెరీర్‌పై దృష్టి సారించడానికి మంచి మానసిక ప్రశాంతతను అందించాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.   Jayam Ravi divorce case, Aarti Ravi alimony demand, Jayam Ravi 40 lakh alimony
Jayam Ravi and his estranged wife Aarti have been locked in a bitter legal battle ever since the actor announced their separation after 15 years of marriage. What began as a divorce petition soon turned into a public war of words, with both sides making serious allegations against each other. While Ravi accused Aarti and her family of financial control and personal harassment, Aarti claimed that a third person was responsible for the breakdown of their marriage. Their dispute has since played out both in court and on social media. One of the biggest talking points in the case came when Aarti approached the court seeking ₹40 lakh per month as interim maintenance for herself and their children until the divorce proceedings were concluded. The demand sparked widespread debate, especially after reports suggested Ravi had been facing financial difficulties and had accused his former in-laws of controlling his earnings. Now, the Chennai Family Court has delivered a significant order in the case. According to the latest reports, the court has rejected Aarti's request for ₹40 lakh per month. Instead, it has directed Jayam Ravi to pay ₹3 lakh per month as interim maintenance until the divorce proceedings are completed. The ruling comes as a major relief for the actor, who had opposed the amount sought by Aarti. The divorce case, however, is far from over. The legal battle between the former couple will continue, with the court yet to decide on the dissolution of their marriage and other pending issues. But for now, the latest order marks an important victory for Jayam Ravi in what has become one of the Tamil film industry's most closely followed legal disputes. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కుడి చేతి మణికట్టుకి  (రైట్ రిస్ట్) కోయంబత్తూరులోని  గంగా హాస్పిటల్‌లో జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. దీంతో మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. చరణ్ ఆసుపత్రిలో ఉన్నంత సేపు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా అక్కడే ఉన్నారు శస్త్రచికిత్స ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావడంతో ఉపాసన   సోమవారం తెల్లవారుజామునే  పలు ప్రాచీన ఆలయాలని  దర్శించుకుని గణపతి, హనుమాన్ స్వామి వార్లకి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో తాను చేసిన పూజల ఫోటోలని  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, భర్త సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వేడుకున్నట్లు తెలిపారు. ఉపాసన(Upasana) చేసిన ఈ ఆధ్యాత్మిక ప్రార్థనలు మరియు మెగా అభిమానుల అపారమైన ప్రేమ, ఆశీస్సులు చరణ్‌ను త్వరగా కోలుకునేలా చేస్తున్నాయని కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. Also read: Shah Rukh Khan: సినిమా వేలంపాటలో పాల్గొన్న షారుఖ్.. దటీజ్ సినిమా  శస్త్రచికిత్స అనంతరం వైద్యులు రామ్ చరణ్‌కు కనీసం 8 నుంచి 10 వారాల పాటు  ఫిజియోథెరపీ తీసుకోవడంతో పాటు ఎక్కువగా విశ్రాంతిని తీసుకోవాలని సూచించారు . ప్రస్తుతం ఆయన కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ చేరుకుని వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విశ్రాంతి సమయం పూర్తయి, వైద్యుల నుంచి పూర్తి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించిన తర్వాతే సుకుమార్ మూవీని స్టార్ట్ చేస్తాడు. పెద్ది సినిమా చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తీవ్రమైన గాయానికి గురయ్యారు. సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాల్లో దాదాపు 25 నుంచి 30 రోజుల పాటు నిజమైన రెజ్లర్లతో (పహిల్వాన్లు) కుస్తీ పోటీల షూటింగ్ నిర్వహించారు. ఆ సమరంలో రియల్ పహిల్వాన్లు గట్టిగా పట్టుకోవడంతో చరణ్ కుడి చేతి మణికట్టులోని మృదులాస్థి  తీవ్రంగా దెబ్బతింది. ప్రారంభంలో ఒక్క చోట మాత్రమే కార్టిలేజ్ టియర్ (Cartilage Tear) ఏర్పడినప్పటికీ, సినిమా చిత్రీకరణను ఆపకుండా అలాగే 20 రోజుల పాటు ఆ నొప్పితోనే షూటింగ్ కొనసాగించారు. దానివల్ల ఆ ఒక్క టియర్ కాస్తా ఏడు చోట్లకు విస్తరించి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అయినప్పటికీ సినిమా పట్ల ఉన్న అంకితభావంతో చరణ్ ప్రమోషన్స్ పూర్తయ్యే వరకు చికిత్సని  వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కోయంబత్తూర్ లో ఆపరేషన్ చేయించుకున్నాడు. Ram Charan, Upasana, Chiranjeevi  
టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు ఉన్న ప్రత్యేక క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ కుటుంబ కథా చిత్రం నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను విడుదల చేశారు.  ఇప్పటికే చిట్టిబాబుగా వెంకటేష్ పాత్రను పరిచయం చేసిన మూవీ టీమ్.. ఇప్పుడు 'స్వర్ణ'గా హీరోయిన్  శ్రీనిధి శెట్టి పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక ప్రోమోను రిలీజ్ చేశారు.  ఈ గ్లింప్స్‌లో వెంకటేష్ మార్క్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీడియో ప్రారంభంలో వెంకటేష్ "ఈ ఆడవాళ్ళకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు బుజ్జిగారు" అంటూ నటుడు రఘుబాబుతో చెప్పే వినోదాత్మక డైలాగ్ ఆకట్టుకుంటుంది.  ఆ తర్వాత బాల్కనీలో ఎంతో అందంగా నవ్వుతూ కనిపిస్తున్న నివేదా పేతురాజ్ ని చూపిస్తూ "అదండి ఆడదంటే.. కనపడగానే పువ్వులాగా ఎలా నవ్వుతుందో చూడండి. నా పెళ్ళాం ఉంది ఎందుకు, ఎప్పుడో పెళ్లి ఫోటోలో స్మైల్ ప్లీజ్ అంటే అప్పుడు నవ్వింది, మళ్ళీ ఇప్పటిదాకా నవ్వలేదు, ఎప్పుడూ మొహం ఉమ్మని పెట్టుకుంటుంది" అంటూ వెంకీ తనదైన శైలిలో ఫస్ట్రేషన్ వ్యక్తం చేయడం వినోదాన్ని పండించింది. ఈ గ్లింప్స్‌లో వెంకటేష్ భార్యగా శారీలో ఎంతో పద్ధతిగా కనిపించిన శ్రీనిధి శెట్టి "ఊరుకో నాన్న" అంటూ సిగ్గుపడిపోవడం అభిమానులను అలరిస్తోంది. కమెడియన్ సత్య కూడా ''ఆదర్శ కుటుంబం" అంటూ గ్లింప్స్‌లో మెరవడం విశేషం. ఇప్పటికే విడుదలైన వెంకటేష్, శ్రీనిధి శెట్టి పాత్రల పరిచయ వీడియోలు ప్రేక్షకుల్లో విశేష ఆసక్తిని రేకెత్తించగా, త్వరలోనే యువినా పార్థవిను ‘సంపూర్ణ’గా, రాజా ప్రజ్వల్ ను ‘సర్వ’గా చిత్ర బృందం పరిచయం చేయనుంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. అక్టోబర్ 2న థియేటర్లలో అడుగు పెట్టనుంది.      Aadarsha Kutumbam, Venkatesh, Srinidhi Shetty, Trivikram  
With Venkatesh as Chittibabu receiving a terrific response, the makers of director Trivikram Srinivas’ Aadarsha Kutumbam House No: 47 – #AK47 now present the next member of this family.  Srinidhi Shetty steps into the role of Swarna, Chittibabu’s wife, a cheerful middle-class homemaker whose lively bond with him adds to the film’s warmth and fun. Nivetha Pethuraj and comedian Satya also make brief appearances, adding to the entertaining vibe of the teaser. With the character introductions creating good excitement, the makers will next unveil Yuvina Parthavi as Sampoorna and Raja Prajwal as Sarwa. The movie is written & directed by Trivikram and produced by S. Radha Krishna (Chinababu) under Haarika & Hassine Creations.  Music is composed by cinematography by Ravi K. Chandran, editing by Sreekar Prasad, the film is all set for a grand worldwide theatrical release on October 2, 2026. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Marvel and Sony's Spider-Man: Brand New Day is on the verge of creating box office history even before its theatrical release. Starring Tom Holland, the highly anticipated superhero film is now tracking for a staggering $800-825 million worldwide opening weekend, which would make it the second-biggest global debut of all time, behind only Avengers: Endgame, which opened to an unprecedented $1.223 billion globally in 2019. The film's advance bookings have exploded across several international markets, with India emerging as one of its strongest territories. Trade reports indicate that the film's advance sales in India have already crossed ₹60 crore, putting it on course to challenge Avengers: Endgame's long-standing opening records in the country. Earlier estimates had pegged the opening day collection in the ₹50-60 crore range, but the extraordinary pace of ticket sales suggests even higher numbers are possible. The buzz surrounding Brand New Day has been phenomenal ever since its marketing campaign began. Tom Holland returns as Peter Parker in what is expected to be a fresh chapter for the beloved superhero following the events of Spider-Man: No Way Home. Massive fan anticipation, strong word-of-mouth around the trailers, premium format demand, and blockbuster advance bookings have combined to create one of the year's biggest theatrical events. Adding to the excitement for Indian audiences, reports suggest that the first theatrical trailer of Avengers: Doomsday will be attached to Spider-Man: Brand New Day screenings, making the theatrical experience even more special for MCU fans. If the current momentum continues, the film could rewrite several opening weekend records worldwide while delivering one of the biggest Hollywood openings ever seen in India. The movie is releasing on 30th July, worldwide.  Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    కొంతమంది హీరోలు ఇమేజ్ కి దూరంగా అన్ని రకాల క్యారెక్టర్స్ పోషిస్తారు. కానీ స్టార్ స్టేటస్ మాత్రం 'నువ్వు ఎన్ని క్యారెక్టర్స్ అయినా చేసుకో, నేను మాత్రం నిన్ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అంటుంటుంది. స్టార్ హీరో ధనుష్(Dhanush)నే అందుకు ఉదాహరణ. ఈ రోజు ధనుష్ పుట్టిన రోజు. దీంతో అభిమానుల సందడి మాములుగా లేదు.   అయితే ఈ సారి ధనుష్ తన పుట్టినరోజు సందర్భంగా రాజకీయాల్లోకి వస్తుట్టుగా ప్రకటన చేస్తాడట అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని నెలలుగా తమిళనాడు రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. ముఖ్యంగా ఇళయదళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం' అనే పొలిటికల్ పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో  మరికొందరు యువ కథానాయకులు కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే ధనుష్ పేరు కొన్ని రోజుల నుంచి వినిపిస్తోంది. ధనుష్ కుటుంబానికి, ముఖ్యంగా ఆయన మాజీ మామ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న రాజకీయ నేపథ్యం అందరికీ తెలిసిందే. రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా, ఆయన పొలిటికల్ ఇమేజ్ ధనుష్‌పై కూడా ప్రభావం చూపిందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడులో దాదాపు 35 శాతం కంటే ఎక్కువ మంది యువత ఓటర్లు ఉన్నారు. ఈ యువతను ఆకర్షించేందుకు ధనుష్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడికి ఎంతో అనుకూలమైన అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ధనుష్ నటించిన గత 5 సినిమాలు బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి ప్రజాదరణని  తెచ్చిపెట్టాయి. తమిళనాడులోని ప్రతి గ్రామంలోనూ బలమైన అభిమాన సంఘాలని కలిగి ఉన్నాడు. ముఖ్యంగా ధనుష్ చేసే సామాజిక సేవా కార్యక్రమాలు, ఆయన ఫ్యాన్ క్లబ్స్ ద్వారా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలు  మంచి పేరు తెచ్చి పెడుతున్నాయి.తమిళనాడు వ్యాప్తంగా సుమారు 10,000 కంటే ఎక్కువ నమోదైన అభిమాన సంఘాలు ధనుష్ సొంతం. ఈ బలమైన నెట్‌వర్క్ రాజకీయాల్లోకి రాకముందే ఆయనకు పెద్ద సైన్యంగా మారింది. ధనుష్ కేవలం రీల్ హీరోగానే కాకుండా, రియల్ లైఫ్‌లోనూ యువతకు స్పూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తే తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలవుతాయని భావిస్తున్నారు. Also read: బాబాయ్, అబ్బాయ్ లకే గాయాలెందుకు.. దిష్టి ఏమైనా తగిలిందంటారా! అయితే ఈ వార్తలలో నిజమెంత అనేది ఇంకా అధికారికంగా స్పష్టం కాలేదు. పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ ప్రకటన చేస్తాడనేది ఒక రూమర్ మాత్రమే. ప్రస్తుతం అమరన్ ఫేమ్   రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో 'ఓం' అనే మూవీ చేస్తున్నాడు. ధనుష్ కి 77 వ చిత్రం. ధనుష్ తండ్రి కస్తూరి రాజా, సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకులుగా తమిళ చిత్ర  పరిశ్రమతో,ప్రేక్షకులతో సుదీర్ఘ సంబంధ బావ్యాలు ఉన్నాయి.  Dhanush, Om, Vijay
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు. అయితే ఎంత శుభ్రం చేసినా చాలా ఇళ్లలో సాలీడు పురుగులు చాలా మళ్లీ మళ్లీ వచ్చి చేరుతుంటాయి.  బూజు కూడా చాలా తొందరగా ఏర్పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? వీటికి కారణాలు ఏంటి? వీటిని పరిష్కరించుకోవడానికి ఏం  చేయాలి? పూర్తీగా తెలుసుకుంటే.. సాలీడు గూళ్లు కట్టడానికి కారణాలుయ.. ఇల్లు శుభ్రం చేసిన కొద్ది రోజులకే మూలల్లో, సీలింగ్‌పై, లేదా ఫర్నిచర్ వెనుక సాలీ గూళ్లు మళ్లీ కనిపిస్తుంటే ఇల్లు సరిగా శుభ్రం చేయలేదని అర్థం కాదు.. పదేపదే గూళ్లు ఏర్పడటానికి చాలా కారణాలు ఉండవచ్చు. వాస్తవానికి, సాలీలు తమకు సురక్షితమైన ప్రదేశం , తినడానికి చిన్న కీటకాలు సులభంగా దొరికే చోట మాత్రమే తమ గూళ్లను అల్లుతాయి. స్టోర్‌రూమ్‌లు, అటకలు, మెట్ల దారులు, కిటికీల అంచులు లేదా బరువైన ఫర్నిచర్ వెనుక.. ఇలా ఇంట్లో ఎక్కువ కాలం శుభ్రం చేయకుండా ఉండే ప్రదేశాలు సాలీడులకు ఇష్టమైన స్థలాలుగా మారతాయి. ఈ ప్రదేశాలు నిశ్శబ్దంగా ఉండి, మనుషుల సంచారం తక్కువగా ఉండటం వల్ల, అవి గూళ్లు అల్లడానికి సులభంగా ఉంటాయి. సాలీడులు పదే పదే ఇంట్లోకి ఎందుకు వస్తాయంటే.. సాలీడులు పదేపదే గూళ్లు కట్టడానికి ఒక ప్రధాన కారణం ఇంట్లో చిన్న కీటకాలు ఉండటమే. సాలీడులు ఈ కీటకాలను తిని బ్రతుకుతాయి. ఇంట్లో దోమలు, ఈగలు లేదా ఇతర చిన్న కీటకాలు ఎక్కువగా ఉంటే, సాలీడులు కూడా తరచుగా అక్కడికి వచ్చి గూళ్లు కడతాయి. వర్షాకాలం , శీతాకాలంలో , సాలీడులు బయట కంటే ఇళ్లలోని సురక్షిత ప్రదేశాలను వెతుకుతాయి.  దీని వల్ల వర్షాకాలంలో ఇళ్లలో సాలీడుల నివాసం,  సాలీడు గూడులు పెట్టడం వంటివి ఎక్కువ అవుతాయి. సాలీడుగూళ్లు  ఎలా తొలగించాలి?  ఇంట్లో సాలెగూళ్లు ఏర్పడితే, వాటిని వీలైనంత త్వరగా తొలగించాలి. వాక్యూమ్ క్లీనర్‌తో పైకప్పులు, మూలల్లోని సాలెగూళ్లను సులభంగా శుభ్రం చేయవచ్చు. వాక్యూమ్ చేరలేని ప్రదేశాల కోసం పొడవాటి పిడి ఉన్న చీపురు లేదా డస్టర్‌ను ఉపయోగించవచ్చు. భారతీయులు వాడే బూజు కర్రతో బాగా శుభ్రం చేయవచ్చు. శుభ్రం చేసిన తర్వాత, మిగిలిపోయిన దుమ్ము, సాలెగూళ్లను పూర్తిగా తొలగించడానికి ఆ ప్రదేశాన్ని తడి గుడ్డతో తుడవడం  మంచిది. సాలెగూళ్లు మళ్లీ ఏర్పడకుండా ఉండాలంటే..  ఇంట్లో సాలెపురుగులు మళ్లీ గూళ్లు కట్టకుండా నిరోధించాలంటే, ముందుగా  ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ముఖ్యంగా మూలలు, పైకప్పులు, ఫర్నిచర్ వెనుక , స్టోర్‌రూమ్‌ల వంటి ప్రదేశాలను నిర్లక్ష్యం చేయకూడదు. కిటికీలు, తలుపులు , గోడలలోని పగుళ్లు లేదా చిన్న రంధ్రాలను మూసివేయాలి. ఎందుకంటే సాలెపురుగులు వీటి ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి.  ఇంట్లో చిన్న కీటకాల తిరగడం, దోమలు, ఈగలు వంటివి ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సాలెపురుగులకు ఆహారం దొరకనప్పుడు, అవి అక్కడ ఎక్కువసేపు ఉండవు. ముఖ్యంగా తలుపులు , కిటికీల చుట్టూ  పుదీనా నూనెను కలిపిన నీటిని చల్లడం కూడా సాలెపురుగులను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.                                   *రూపశ్రీ.
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని, అది పెద్దదైనా లేదా చిన్నదైనా, పంచుకోవడం ఎల్లప్పుడూ సరైనది కాదు. కొన్నిసార్లు, తెలివిగా ఉండటం,  కొన్ని విషయాలు షేర్ చేసుకోకుండా ఉండటం కూడా మంచిదని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.  కేవలం ఇవి మాత్రమే కాదు.. బంధాల మధ్య ఆరోగ్యకరమైన వాతావారణం ఉండాలన్నా,  బంధం ఏ చీకు చింతలు లేకుండా సంతోషంగా ఉండాలన్నా కొన్ని విషయాలు దాచిపెట్టడమే మంచిది అంటున్నారు.  బంధాలు బాగుండాలంటే ఎలాంటి విషయాలను చెప్పకుండా ఉండటం మంచిది? తెలుసుకుంటే.. మాజీ ప్రేమికుల గురించి..  భాగస్వామికి  గతం గురించి చెప్పడంలో తప్పు లేదు, కానీ ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా  మాజీ భాగస్వామి గురించి చర్చించడం, వారిని గొప్పగా పొగడటం లేదా వారితో  గడిపిన సన్నిహిత క్షణాలను చెప్పడం వల్ల  ప్రస్తుత భాగస్వామిలో అనవసరమైన అసూయ మరియు పోలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది బంధంలో అభద్రతాభావం, అసౌకర్యం, అపార్ఠాలు ఏర్పడేలా చేస్తుంది.  అందుకే  ఒక కొత్త బంధం మొదలుపెట్టాక   గతాన్ని గురించి వదిలిపెట్టడం చాలా మంచిది.  దాని గురించి గుర్తుచేసుకోకపోవడం మంచిది. సొంత వ్యక్తుల చెడుగుణం..  భాగస్వామి స్నేహితుల్లో  లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా  మీకు నచ్చకపోవచ్చు. వారు మీతో సరిగా ఉండకపోవచ్చు. కానీ  బిగ్గరగా అరవాల్సిన అవసరం లేదు. "మీ అమ్మ చాలా చెడ్డగా  ఉంటుంది" లేదా "మీ స్నేహితుడు  పద్దతిగా ఉండటం లేదు" అని మీరు చెబితే భాగస్వామి బాధపడే అవకాశం ఉంది.  సమస్య పెద్దది కాకపోతే ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల రహస్యాలు..  ప్రాణ స్నేహితుడు లేదా స్నేహితురాలు ఇలా ఎవరైనా సరే..   మీతో రహస్యంగా మాట్లాడి ఏదైనా రహస్యం చెప్పినట్లయితే, దానిని భాగస్వామితో పంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది "మేము భార్యాభర్తలం, లేదా జంట, మా మధ్య ఎటువంటి రహస్యాలు లేవు, లేదా ఉండకూడదు" అని అనుకుంటారు, కానీ ఇది ఆ మూడవ పక్షం నమ్మకాన్ని దెబ్బతీసినట్లే. భాగస్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, స్నేహం లేదా ఇతర కుటుంబ సభ్యులు, పుట్టింటి వారికి అంతే ప్రాధాన్యత  ఉంటుంది. కాబట్టి  స్నేహితుల గోప్యతను గౌరవించాలి.   వారి రహస్యాలను భాగస్వామి ముందు గాసిప్ లాగా చర్చించకూడదు. ఇష్టాలు, అయిష్టాలు.. భాగస్వామి ప్రేమతో మీకు బహుమతి కొన్నప్పుడు, అది మీకు అస్సలు నచ్చకపోతే  నిజాయితీతో అది నచ్చలేదు అని చెప్పడం మంచిది కాదు. నాకు ఈ రంగు అస్సలు నచ్చలేదు లేదా ఇది క్వాలిటీగా లేదు  అని చెప్పడం వారి మనసును బాధపెట్టినట్టే..   ఇక్కడ అబద్ధం చెప్పడం మంచిది. వారి భావాలను గౌరవించాలి,  చిరునవ్వుతో బహుమతిని తీసుకోవాలి. కొన్నిసార్లు, నిజం చెప్పడం కంటే అబద్దం చెప్పడం వల్ల భాగస్వామిని సంతోషపెట్టవచ్చు. సోషల్ మీడియా పాస్వర్డ్ లు.. నేటి డిజిటల్ యుగంలో ఇది ఒక పెద్ద సమస్య. చాలా మంది భార్యాభర్తలు ఒకరి పాస్‌వర్డ్‌లు ఒకరు తెలుసుకోవడం ప్రేమకు సంకేతం అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరం.  ఫోన్ లేదా సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను చెప్పకపోవడం నేరం కాదు. ఏ తప్పు చేయనంత వరకు, తనకంటూ కొంత పర్సనల్ ఉంచుకోవడం తప్పే కాదు. సంబంధాలు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడం ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుతుంది. కొన్ని విషయాలను దాచడం మోసం కాదు, అనవసరమైన గొడవలు, అపార్థాలు కలగకుండా బంధాన్ని రక్షించుకునే మార్గమది.                                *రూపశ్రీ
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..  కొన్నిసార్లు తరాల మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఆలోచనా విధానాలలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు విభేదాలకు దారితీయవచ్చు. దీని వల్ల ప్రతి కోడలికి తన మనసులో ఒక ప్రశ్న ఉండిపోతుంది. అత్తగారు చెప్పే ప్రతి విషయాన్ని కోడలు వినాలా? అత్త చెప్పిన ప్రతి విషయాన్ని కోడలు అంగీకరించాల్సిందేనా?  అని.  అయితే దీనికి సమాధానం అంత సులభమైనది కూడా కాదు.  దీని గురించి లైఫ్ స్టైల్ నిపుణులు వివరణ ఇస్తున్నారు.  ప్రతి కోడలు తెలుసుకోవలసిన ఈ విషయం గురించి తెలుసుకుంటే.. సెల్ఫ్ రెస్పెక్ట్.. ప్రవర్తన.. కొందరు అత్తలు చాలా దురుసుగా ఉంటారు.   దుర్భాషలాడటం, ఎగతాళి చేసి మాట్లాడటం, అందరి ముందు కోడలిని  అవమానించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఎప్పుడూ  ఎదుర్కొంటున్నట్లయితే కోడలు  మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మొదట  ప్రశాంతంగా మాట్లాడి, సరిగ్గా మాట్లాడమని, సరిగ్గా ప్రవర్తించమని అడగడం మంచిది. అత్తాకోడళ్ల బంధం బాగుండాలంటే.. రెండు వైపులా గౌరవం చాలా ముఖ్యం. ఆరోగ్య సంబంధ విషయాలు..  అత్తల తరానికి,  ఇప్పటి కోడళ్ల తరానికి చాలా తేడాలు ఉన్నాయి.  వారి జీవనశైలి,  ఆహారం వంటి విషయాలు ఇప్పట్లో లేవు.  ఈ కారణంగా ఇప్పటి అమ్మాయిలలో అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది.  ఏదైనా అనారోగ్యానికి చికిత్స, మందులు, విశ్రాంతి తీసుకోవడం, గర్భం దాల్చడం, మానసిక ఆరోగ్యం లేదా మరే ఇతర వైద్య సలహాలలో అయినా అత్తలు ఎప్పుడూ కోడళ్లను నిర్ల7్యంగా మాట్లాడకూడదు.  మేము ఇంత పని చేసుకునేవాళ్లం, మాకేమీ సమస్య ఉండేది కాదు అనడం,  పని తప్పించుకోవడానికి అనారోగ్యం అని చెబుతున్నావని నిందించడం చాలా మంది అత్తగార్లు చేస్తారు. కోడళ్లు  అత్తగారి మాటల కంటే డాక్టర్ సలహాకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్య నిర్ణయాలు కేవలం కుటుంబ ఒత్తిడి మీద కాకుండా, వాస్తవాలు , నిపుణుల సలహా ఆధారంగా తీసుకోవాలి. విద్య, ఉద్యోగం.. నేటికాలంలో అమ్మాయిలు అబ్బాయిలకేమీ తీసిపోకుండా బాగా చదువుతున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు.  ఉద్యోగం , ఆర్థిక స్వాతంత్య్రానికి  సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతి కోడలికి ఉంటుంది.  కుటుంబ అంచనాలకు,  వృత్తిపరమైన లక్ష్యాలకు మధ్య పొంతన కుదరకపోతే ఓపెన్ గా ఇంట్లో డిస్కస్ చేసి  అందరికి నచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతేకానీ అత్తగారు చేప్పారు అని ఉద్యోగాలు వదిలేయడం, ఇంటికే పరిమితం కావడం వంటివి చేయాల్సిన అవసరం లేదు.  ఏకపక్ష ఒత్తిడితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో మనస్పర్థలకు దారితీయవచ్చు.అంతేకాదు.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు. వ్యక్తిగత హద్దులు.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సమయం, వ్యక్తిగత స్వేచ్ఛ , వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది.  వ్యక్తిగత హద్దులను పదేపదే ఉల్లంఘించినా లేదా ప్రతి నిర్ణయంలో అనవసరమైన జోక్యం ఉన్నా,  హద్దులను మర్యాదగా తెలియజేయడం మంచిది. ఇది అపార్థాలు, గొడవలు ఎక్కువ దూరం వెళ్లకుండా చేస్తుంది.  కొందరు అత్తలు కోడళ్లకు ఎలాంటి పర్సనల్ స్పేస్ ఉండకూడదని, వారికి పర్సనల్ అంటూ ఏమీ అవసరం లేదని వాదిస్తారు.  కానీ కోడళ్లకు పర్సనల్ స్పేట్ ఉండటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతుంది.   ప్రొటెక్షన్,  లీగల్ రైట్స్.. ఆడపిల్ల  భద్రతకు, చట్టపరమైన హక్కులకు, లేదా నైతిక విలువలకు భంగం కలిగించే పని చేయమని అత్తగారు కోడలిని అడిగితే, దానికి తలొగ్గడం మంచిది కాదు. అలాంటి పరిస్థితిలో జీవిత భాగస్వామిని, నమ్మకమైన కుటుంబ సభ్యుడిని, లేదా అవసరమైతే చట్టపరమైన సహాయాన్ని తీసుకోవడం మంచిది.                                       *రూపశ్రీ.  
IBS (Irritable Bowel Syndrome) సమస్యకు సహజమైన మరియు ఆయుర్వేద పరిష్కారాలు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, తరచుగా విరేచనాలు వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ లక్షణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి Irritable Bowel Syndrome (IBS). ఈ TeluguOne Health వీడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు IBS అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? IBS లక్షణాలు ఏమిటి? అనే విషయాలను వివరంగా తెలియజేస్తున్నారు. అలాగే IBS సమస్యను నియంత్రించడానికి సహాయపడే సహజమైన జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు, ఆయుర్వేద పద్ధతులు మరియు ఇంట్లో పాటించగల కొన్ని చిట్కాలను ఈ వీడియోలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: • Irritable Bowel Syndrome (IBS) అంటే ఏమిటి? • IBS రావడానికి కారణాలు ఏమిటి? • IBS ప్రధాన లక్షణాలు • గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గించే మార్గాలు • IBS కోసం పాటించాల్సిన ఆహార నియమాలు • సహజమైన మరియు ఆయుర్వేద పద్ధతులు • ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు IBS అనేది దీర్ఘకాలిక జీర్ణ సంబంధ సమస్య కావచ్చు. సరైన ఆహారం, జీవనశైలి మార్పులు మరియు నిపుణుల సూచనలతో దీనిని నియంత్రించుకోవచ్చు. IBS సమస్యతో బాధపడుతున్న వారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం ఉపయోగకరమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా షేర్ చేయండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యకు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె,  ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు.  ఆవనూనె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే విదేశీయులు,  ఆరోగ్య స్పృహ ఎక్కువ కలిగిన ధనవంతులు వంటల్లో ఆలివ్ నూనెను కూడా ఉపయోగిస్తారు. పైగా  ఆలివ్ నూనె గుండెకు మంచిదని అంటారు. ఆవ నూనె వందల సంవత్సరాల నుండి భారతీయ వంటకాలలో వాడుతున్నారు. కేవలం వంటకాలలోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఆవనూనెను ఉపయోగిస్తుంటారు.  మధ్యధరా ప్రాంతంలో ఆలివ్ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆలివ్ నూనె గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే గుండె ఆరోగ్యానికి ఆవనూనె లేదా ఆలివ్ నూనె రెండింటో ఏది మంచిది? ఆహార నిపుణులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే.. సరైన నూనె ఎంపిక ఎందుకు ముఖ్యం? ఒకప్పుడు నూనెలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయని,  ఈ కారణంగా కొవ్వు ఎక్కువ వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం పోషకాహార నిపుణులు చెబుతున్న విషయం వేరు.. కొవ్వులో రెండు రకాలు ఉన్నాయని,  వీటిలో ఆరోగ్యానికి మంచి చేసే కొవ్వులు కూడా ఉంటాయి.  పదేపదే వేడి చేసిన నూనెలు, ట్రాన్స్ ఫ్యాట్స్ , అధిక సంతృప్త కొవ్వులు గుండెకు హానికరం అని చెబుతారు. అయితే, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ , ఒమేగా-3 వంటి అసంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి , రక్తనాళాలలో వాపును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే గుండె ఆరోగ్యం గురించి చర్చించేటప్పుడు ఆవ నూనె , ఆలివ్ నూనె రెండింటినీ పరిగణలోకి తీసుకుంటారు. గుండె జబ్బులు ఉన్నవారికి ఆలివ్ నూనె లేదా ఆవనూనె? గుండె జబ్బుల రోగులకు ఆలివ్ నూనెతో వంట చేయడం మేలు చేస్తుందని చెబుతారు. ముఖ్యంగా మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు , ఒలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె. ఇందులో పాలీఫెనాల్స్ అనే సహజ యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిని , వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండూ ధమనులకు నష్టం కలిగించడంతో పాటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె  మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరచడంలో , చెడు కొలేస్ట్రాల్  ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతారు.  చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి కారణం అవుతుందని చెబుతారు. అధికంగా ఆలివ్ నూనె తీసుకునే వ్యక్తులకు గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆలివ్ నూనె అన్ని రకాల వంటలకు మంచిదా? ఆలివ్ నూనె వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ భారతీయ వంటకాలు చాలా ప్రత్యేకం. భారతీయులు  ఆహారాన్ని  నూనెలో బాగా వేయిస్తారు, పోపు  వేస్తారు, లేదా ఎక్కువ సేపు అధిక వేడి మీద వండుతారు. ఇలాంటి పరిస్థితులలో, అధిక వేడి కారణంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనెలో ఉండే హెల్తీ ఫ్యాట్స్, పోషకాలు తగ్గిపోతాయి. శుద్ధి చేసిన ఆలివ్ నూనె అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగినప్పటికీ, దాని యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలు తగ్గిపోతాయి. ఆవనూనె ఎందుకు ప్రత్యేకం.. ఆవ నూనె చాలా కాలంగా భారతీయ వంటకాలలో ఒక భాగంగా ఉంది. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో పాటు, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) అనే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. ఒమేగా-3 కొవ్వులు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి, అందువల్ల ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.  ఆవ నూనె వల్ల గుండెకు కలిగే సంభావ్య ప్రయోజనాలపై భారతీయ పరిశోధనలు కూడా జరిగాయి. సాంప్రదాయ ఆవ నూనెలో ఎరుసిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అయితే ఆవ నూనెను మితంగా వాడాలి.                                    *రూపశ్రీ.  
మూత్రంలో మంటా? UTIని నిర్లక్ష్యం చేయొద్దు..! మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) లక్షణాలు కావచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్‌ఫెక్షన్ మూత్రాశయం నుంచి కిడ్నీల వరకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ నవులూరు ఉపేంద్ర కుమార్ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభమైన భాషలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: ✅ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) అంటే ఏమిటి? ✅ UTI రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ✅ మహిళల్లో UTI ఎక్కువగా ఎందుకు వస్తుంది? ✅ పురుషుల్లో UTI వచ్చే కారణాలు ఏమిటి? ✅ UTI లక్షణాలు ఎలా గుర్తించాలి? ✅ ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? ✅ ఏ పరీక్షల ద్వారా UTIని నిర్ధారిస్తారు? ✅ UTIకి అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? ✅ యాంటీబయాటిక్స్‌ను ఎలా వాడాలి? ✅ UTI మళ్లీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ✅ రోజువారీ అలవాట్లలో చేయాల్సిన మార్పులు మూత్ర సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, గర్భిణీలు మరియు మధుమేహం ఉన్నవారు UTI లక్షణాలపై మరింత అప్రమత్తంగా ఉండాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ గురించి పూర్తి అవగాహన పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. పూర్తి వీడియోను వీక్షించి, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోండి. మరిన్ని ఆరోగ్య సంబంధిత ఉపయోగకరమైన వీడియోలు, నిపుణుల సూచనల కోసం TeluguOne Health‌ను ఫాలో అవ్వండి.