అంతా మద్యం లీల!

Publish Date:Jun 11, 2022

Advertisement

వెయ్యి అంటాం.. అన్నీ చేస్తామా.. అవసరార్ధం ఏదో అంటాం.. అపరాధం శమించుగాక అనీ మళ్లీ అదే మాట వెనక్కి తీసుకుంటాం.. చేయకూడదా.. అర్ధంచేసుకోరూ..!! వెనకటికి ఒక స్వాములారు ఈ ఏడాది కొంప కూలేట్టు వర్షాలు పడతాయన్నారు. తీరా చూస్తే పడలేదు. తర్వాత ఆయనే దేవుడు శపించాడని చెప్పి పారిపోయాడు!ఇలా జరుగుతుంటాయి. 
గతంలో కాదన్నది, ఇప్పుడు అవసరమయింది జగన్‌ ప్రభుత్వానికి. తప్పేముంది అంటే తప్పేమరి! మద్యం మత్తులో అన్యాయాలు జరుగుతున్నాయి. సమాజంలో దారుణాలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావించి మద్యం నిషేధించడానికి దీప ప్రమాణం చేసి కంకణం కట్టుకున్నారు. అప్పుడు అది తప్పనిసరి. అసలు ప్రభుత్వానికి మద్యం అమ్మకాలే కోట్లలో డబ్బు కుమ్మరిస్తుందన్నది తెలిసినదే. కాబోతే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కంటే కోట్లు ప్రధానం కాదనుకున్నవారు నిషేధాన్ని గురించి భారీ ప్రచారాలు చేసేరు.

కొంత సమయం గడిచేక ఒర్నాయనో, అదే మంచి రూటు అనిపించి వుండవచ్చూ. ప్రభుత్వం మద్యం అమ్మకాలను కట్టుదిట్టంగా అమలుచేయడానికి సంకల్పించింది. ఎక్కడపడితే అక్కడ కాకుండా దానికీ ఓ లెక్క వుండాలన్నది. అందుకే దుకాణాల దగ్గర గొడవలు కాకుండా ఒక పద్దతి ప్రకారం అమ్మకాలు జరగాలని కాపాలా దారులను ఏర్పాటు చేసింది. వారిలో దురదృష్టవశాత్తూ కొందరు టీచర్లూ పహారా పనుల్లో వుండడం విపక్షాల కంటపడి ఆ సంగతి రచ్చకెక్కింది. కరోనా కారణంగా అన్ని రంగాలు దాదాపు కుదేలయ్యాయి.

ఆదాయమార్గాలు దాదాపు మూసుకుపోయాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అప్పులతోనే కాపురం కొనసాగించడమూ కష్టమే. ఎన్నాళ్లిలా సాగుతుంది పాలన. అందుకే మద్యానికి మళ్లీ పొర్లే అవకాశం ఇచ్చేరు. వేల కోట్లు వచ్చిపడే వీలున్నదాన్ని కాదు పొమ్మంటే అసలుకే ఎసరు అవుతుంది.

అందుకే ఓకే అనేసేరు. మరి గత ప్రమాణాలు, బోధల మాటేమిటని అడిగినా సమా ధానం చెప్పే స్థితిలో ప్రభుత్వం లేదు. ధనార్జన అవసరం. అందుకోసం గతంలో చెప్పిన మాటలు నీటి మూటలుగానే మారిపోవడం చేసి చూపారు. పరిస్థితులు ఒకేలా వుండాలని లేదు. వుంటాయనుకోవడం, తన మాటను తానే వెనక్కు తీసుకోవాల్సి వస్తుందా అని అనుకోవడమే భ్రమ. ఒక్కోసారి పరిస్థితుల ప్రభావంతో మాటలు చేతలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది మరి! అదే ఇప్పుడు జగన్‌ కూడా చేసేడు. నాలుకను ఎలాగయినా మడతబెట్టవచ్చు!

గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి కార్పోరేషన్‌ బాండ్లు అమ్మి రెండువేల కోట్లు అభివృద్ధి కోసం అప్పు తెచ్చారు. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ బేవరేజ్‌ కార్పొరేషన్‌ బాండ్లు అమ్మి ఎనిమిదివేల కోట్లు అప్పు తెచ్చుకుంది. పరిస్థితులు చేజారిపోతుంటే మరి వొంట్లో వొణుకు వస్తుందిగదా! ప్రగల్భాలకి ఇపుడు ఆస్కారం లేదు. అందుకే మద్యనిషేధానికి బ్రేక వేస్తూ ఇది తాత్కాలికం, పాక్షికం అంటూనే ఏపీ లిక్కర్‌ బాండ్లపై 9.62 శాతం వడ్డీకి 8 వేలకోట్లు అప్పు తెచ్చింది. ఇండియా రేటింగ్స్‌ సంస్థ బేవరేజెస్‌ కార్పోరేషన్‌కు ఏఏ రేటింగ్‌ ఇవ్వడం చిత్రం. ఎందుకంటే మద్యం విధానం మార్చబోమని దీప ప్రమాణం చేసిన తర్వాతనే ఈ రేటింగ్‌ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు ఎవరికి ఎంత ముట్టచెప్పారన్నది తేలాల్సిన ప్రశ్న.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.