తాడేపల్లి ప్యాలెస్ లో జగన్.. జిల్లా పర్యటనల ఊసేదీ?

Publish Date:Feb 4, 2025

Advertisement

రెండు వారాల విదేశీ పర్యటన అనంతరం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్ కు రాలేదు. బెంగళూరు ప్యాలెస్ లో రెండు రోజులు విశ్రాంతి తీసుకుని సోమవారం(ఫిబ్రవరి 3) ఏపీలో ఎంటరయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత ఆయన తాపీగా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నారు. అక్కడ కూడా కొద్ది సేపు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.  

ఆయన ఏపీలో అడుగు పెట్టిన తరువాత ఇక పార్టీ కార్యక్రమాలు జోరందుకుంటాయనీ, తమ అధినేత ప్రజలలోకి వస్తారనీ ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ అసలు పార్టీ వ్యవహారాల ఊసే లేకపోవడం చూస్తుంటే.. ఆయన ఏపీ పర్యటన తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అన్నట్లుగా ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ముందుగా నిర్ణయించిన మేరకు ఆయన జిల్లాల పర్యటన చేపట్టాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు ఆశగా ఎదురు చూశాయి. అయితే జగన్ ఆ ఊసే ఎత్తలేదు. ఇక ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఫీజు పోరు నిరసన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో గడపడం వినా ఎటువంటి కార్యక్రమాలనూ చేపట్టరన్నది రూఢీ అయిపోయింది.  

గత ఏడాది ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇది జరిగి ఎనిమిది నెలలు గడిచిపోయింది. ఈ ఎనిమిది నెలల కాలంలో వైసీపీ అధినేతగా జగన్ ఓటమిపై సమీక్ష నిర్వహించడం కానీ, ఓటమితో నిరాశ చెందిన నేతలు, క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి చేసిన ప్రయత్నం కానీ లేదు. అసలు ఆయన ఈ ఎనిమిది నెలల కాలంలో ఏపీలో ఉన్నదే తక్కువ. ఆ ఉన్న తక్కువ సమయంలో కూడా అత్యధిక సమయం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు.  రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించ లేదు.  

అసలు వైసీపీ ఓటమి తరువాత ఒక రాజకీయ పార్టీలా వ్యవహరించిన సందర్భమే లేదు. 2014లో వైసీపీ పరాజయం పాలై ప్రతిపక్షానికే పరిమితమైన సమయంలో జగన్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసి కనిపించింది. దాంతో ఆయన నిత్యం ప్రజల మధ్యలో ఉండి, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ఆయన సుందరముదనష్ట పాలనను జనం చూశారు. సో ఇప్పుడు ఆయన మాటలను విశ్వసించడానికి కానీ, వినడానికి కానీ వారు సిద్ధంగా లేరు. ఆ కారణంగానే జగన్  జిల్లాల పర్యటనకు పార్టీ నేతలే ఉత్సాహం చూపలేదు. ఏర్పాట్లు చేయలేమనీ, జనాలను తరలించలేమనీ చేతులెత్తేశారు. దీంతో జనంలోకి వెళ్లి భంగపడటం కంటే.. ప్రెస్ మీట్లకు పరిమితమై నిరసన వ్యక్తం చేయడమే మేలన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.