Publish Date:May 17, 2022
జగన్ విపరీత మనస్తత్వానికి ఏబీవీ విషయంలో అనుసరిస్తున్న వైఖరే తాజా నిదర్శనం. కక్ష సాధింపు మనస్తత్వం జగన్ ది అని ఏబీవీ విషయంలో ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న తీరే చెబుతుంది. ఏబీవీ సస్పెన్షన్ ముగిసిందనీ, ఆయనక తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీం కోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చినా జగన్ సర్కార్ ఖాతరు చేయడం లేదు. ఆయనకు పోస్టింగ్ విషయంలో కోర్టు ధిక్కరణ నేరాన్ని ఎదుర్కొనేందుకైనా సిద్ధపడుతోందని చెప్పకనే చెబుతోంది.
సుప్రీం కోర్టు ఆదేశాల తరువాత ఇప్పటి వరకూ రెండు సార్లు పోలీసు అధికారుల బదలీలను జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఈ రెండు సార్లూ కూడా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వలేదు.తాజాగా మంగళ వారం దాదాపు పాతిక మంది ఐపీఎస్ లను జగన్ సర్కార్ బదలీ చేసింది. ఏసీబీ డీజీపీ సహా పలువురు అధికారులను బదలీ చేసింది. వారిలో పలువురికి అదనపు బాధ్యతలూ కట్టబెట్టింది. కానీ సుప్రీం ఆదేశించినా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు (ఏబీవీ) విషయం మాత్రం పట్టించుకోలేదు.
సుప్రీం కోర్టు తీర్పు కాపీని తీసుకుని ఏబీవీ ఏపీ సీఎస్ ను కలిసినా ఫలితం లేకపోయింది. అసలు ఏబీవీకి అప్పాయింట్ మెంట్ ఇవ్వడానికే సీఎస్ సుముఖత చూపడం లేదు.గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీవీపై వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పలు ఆరోపణలు చేసింది. కేసులు నమోదు చేసి సస్పెన్షన్ వేటు వేసింది. రెండేళ్లు అయినా ఆయనపై కేసులు తేలకపోవడంతో సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా ముగిసిందని సుప్రీం కోర్టు చెప్పింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయడం లేదు. కోర్టు ధిక్కరణ కేసునైనా ఎదుర్కొంటా కానీ ఏబీవీపిని మాత్రం సర్వీసులోకి తీసుకోం అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
ఇది కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని విశ్లేషిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ధిక్కరణకు జగన్ సర్కార్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొన వలసి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-ready-to-face-contempt-of-court-insted-giving-post-to-abv-25-136040.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.