మళ్లీ తెరపైకి జగన్మాయ.. లేపాక్షి నాలెడ్జ్ భూముల స్వాహాకు క్విడ్ ప్రొకొ

Publish Date:Aug 23, 2022

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తండి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే భారీ అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జగన్ సీఎం అయిన  తరువాత మరింత రెచ్చిపోయారనడానికి ఇప్పుడు వెల్లువెత్తుతున్న ఆరోపణలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇసుక, మద్యం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న జగన్ ఒన్లీ క్యాష్ లావాదేవీలను కొనసాగించడమే ఆయన అవినీతి తిమింగలంలా మారారనడానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ మద్యం విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ మంతా ఆన్ లైన్ లావాదేవీల వెంట పరుగులెడుతుంటే.. ఆఖరికి ఏపీ సర్కార్ బటన్ ద్వారా లబ్ధిదారులకు అందజేసే నగదు కూడా ఆన్ లైన్ ద్వారానే వెళుతుంటే ఒక్క మద్యం అమ్మకాలు మాత్రం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో నిర్వహించడమే ఆ విధానంలో అవినీతి ఏరులై పారుతోందనడానికి నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ ఒకెత్తు అయితే అనంతపురం లేపాక్షి భూముల విషయంలో వెల్లువెత్తుతున్న ఆరోపణలు మరొక ఎత్తు అని విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేర ఇందూ ప్రాజెక్ట్స్ కు ఎకరం 50 వేల రూపాయల చొప్పున వేల ఎకరాల కేటాయింపు జరిగింది. అయితే వాటిలో పరిశ్రమలు, ప్రాజెక్టుల ఏర్పాటు మాటే ఏత్తని ఇందూ ప్రాజెక్టులు ఆ భూములను తాకట్టు పెట్టి వేళ కోట్ల రూపాయల రుణాలను దండుకుంది. అలా దండుకున్న సొమ్ములో కొంత భాగం జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా మరలాయని సీబీఐ అప్పట్లో నమోదు చేసిన కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.

ఈడీ కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. దీంతో ఇందూ ప్రాజెక్ట్ చేతులెత్తేసింది. దీంతో బ్యాంకులు ఆ ప్రాజెక్టు దివాళా తీసిందని ప్రకటించేశాయి. దాంతో ఐదువందల కోట్ల రూపాయలకు ఇందు ఆస్తులను ఓ కంపెనీకి దారాదత్తం చేసేయడానికి బ్యాంకులు అంగీకరించేశాయి. అసలు బ్యాంకులు అందుకు ఎలా అంగీకరించాయో ఆర్థిక నిపుణులకు కూడా అర్ధం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఆ భూ కేటాయింపులను రద్దు చేసేసి చాలా కాలమైంది. ఆ భూములు ఇప్పుడు ఈడీ అధీనంలో ఉన్నాయి. అటువంటప్పుడు బ్యాంకులు ఆ భూములు తమ తనఖాలో ఉన్నాయంటూ.. ఏదో ఒక కంపెనీకి ఐదొందల కోట్ల రూపాయలకు అప్పనంగా అప్పగించేయడాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలి. కేటాయింపులు రద్దు చేశామని నోటీసులు పెట్టాలి.  అలా చేయడం లేదు.  

ఇందు ప్రాజెక్ట్స్ భూములపై రూ. ఐదు వేల కోట్ల వరకూ అప్పులిచ్చిన బ్యాంకులు… దివాలా ప్రక్రియలో రూ. ఐదు వందల కోట్లిస్తే చాలని అంగీకరించడం వెనుక మతలబు ఏమిటి?  అలా కాకుండా ఆ భూములను వేలం వేస్తే ఇంకా ఎక్కువ సొమ్ము వస్తుంది కదా?  కానీ   బ్యాంకులు వేలం వేయకుండా.. రూ. ఐదువందల కోట్లిస్తామని వచ్చిన కంపెనీకే కట్టబెట్టడానికి సిద్ధమైపోవడం వెనుక ఉన్న జగన్మాయ ఏమిటి? ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ భూములను కొనుగోలు చేస్తున్న సంస్థలో జగన్ మేనమామ.. రవీంధ్రనాథ్ రెడ్డి కుమారుడు ఒక డైరక్టర్‌. ఈ కంపెనీకి డబ్బులు సమకూరుస్తోంది ఏపీలో పోర్టులు..సెజ్‌లు దక్కించుకున్న అరబిందో సంస్థ.  

సో భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు ఎక్కడెక్కడ స్కామ్ లూ తిరిగి తిరిగి జగన్ అక్రమాస్తుల కుంభకోణం దగ్గరకే చేరుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ ఇందు ప్రాజెక్టు ఆస్తులను 500 కోట్ల రూపాయల అతి చౌక ధరకు అప్పనంగా తీసేసుకుంటున్న సంస్థ పేరు ఎర్తిన్ ప్రాజెక్టు. ఆ సంస్థ డైరెక్టర్ జగన్ మేనమామ కుమారుడు. ఎర్తిన్ కు నిధులు సమకూరుస్తున్నది ఏపీలో పోర్టులు సెజ్ లను దక్కించుకున్న అరబిందో సంస్థ. దీంతో  ఈ డీల్ మొత్తం క్విడ్ ప్రొకొ అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.