చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిస్తే వార్ వ‌న్‌సైడ్.. ర‌ఘురామ‌కృష్ణంరాజు

Publish Date:Aug 23, 2022

Advertisement

రాజ్యాధికారం చేజిక్కించుకోవ‌డానికి చాలాకాలం త‌ర్వాత పెద్ద చ‌ద‌రంగం ముందు కూచుని  ఇద్ద‌రు నాయ‌కులు ర‌ణ‌రంగం ఎలా న‌డ‌పాల‌న్న‌ది ఆలోచించారు. మ‌ర్నాడు ఇరువ‌ర్గాల సేన‌లు మ‌నం మ‌నం బ్ర‌ద‌ర్స్ మ‌న శ‌త్రువు మ‌న బాస్‌లు చెప్పేరుగా ఇక క‌త్తులు, క‌టార్లు సిద్ధం చేసుకోవ‌డ‌మే మ‌న ప‌ని అని యుద్ధానికి స‌మాయ‌త్త‌మ‌య్యారు. ఇది చాలా పాత‌కాలం యుద్ధ తంత్రంలో భాగంగా ఉండేది. ఇద్ద‌రి ఆలో చన‌లు క‌ల‌వాలేగాని అవ‌త‌లివాడు అధికారంలో ఉన్న పీఠం మీంచి అమాంతం కింద‌కు లాగేయ వ‌చ్చు. అందునా ప్ర‌జామోదం లేనివాడు, ప్రజాక‌ర్ష‌ణ కోల్పోయిన‌వాడ‌యితే మ‌రీ వీజీ. ఇపుడు ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప‌రిస్థితి దాదాపు ఇదే సీన్‌. రానున్న ఎన్నిక‌ల‌కు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సార‌ధ్యం లోని టీడీపీ, జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతులు క‌లిపే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని విశ్లేష‌కుల మాట‌. ఒక‌వేళ అదే జ‌రిగితే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ్యాను కి విద్యుత్ అంద‌క నిలిచిపోయే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌నే  అంటున్నారు. ఎన్నిక‌ల్లో వీరి క‌ల‌యిక ప్ర‌భావం అమితంగా ఉండే అవ‌కాశాలే ఉన్నాయ‌ని వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు అనడం గ‌మ‌నార్హం. 

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తే వార్ వన్  సైడేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తాను విస్తృత స్థాయి శాం పిల్స్ తో శాస్త్రీయంగా  జూన్, జులై మొదటి వారం వరకు నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి 93 స్థా నాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తేలిందన్నారు. ఇక నువ్వా నేనా అన్నట్టు ఉన్న స్థానాల లో సగం స్థానాలో విజయం సాధించిన, ఆ పార్టీకి 127 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వైయస్సా ర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గెలిచే స్థానాలు కేవలం 7 నుంచి 8 కాగా, మరో మూడు నుంచి నాలుగు స్థానా లలో విజయ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక నువ్వా నేనా అన్నట్లు ఉన్న 65 స్థానాలలో తమ పార్టీ ఒకవేళ 90% స్థానాలలో విజయం సాధించిన 73 సీట్లకే  పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.  

టైమ్స్ నౌ, ఇండియా టీవీ, ఇండియా టుడే వంటి ఇంగ్లీష్ చానల్ నిర్వహించిన సర్వేను చూసి తొడలు చర్చుకుంటూ ఇలాగే ప్రవర్తిస్తే, పరిస్థితి మరింత అద్వానంగా దిగజారే ప్రమాదం ఉన్నదని హెచ్చరిం చారు . సోమవారం(ఆగ‌ష్టు 23) రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు  మీడియాతో మాట్లాడుతూ,  జిల్లాల వారీగా సర్వే పరిశీలిస్తే ప్రకాశం జిల్లాలో పోటాపోటీగా తెలుగుదేశం,  వైఎస్సార్  కాం గ్రెస్ పార్టీలు తలపడే అవకాశం ఉన్నదన్నారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ  స్థానా ల్లో ఏక పక్ష విజయం సాధించనున్నదని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం అధికంగా ఉన్న దన్న ఆయన, గుంటూరులోనూ విజయ అవకాశాలను పవన్ కళ్యాణ్ ప్రభావితం చేయగలరని  చె ప్పారు. టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే నువ్వా నేనా అన్నట్లు పోటీ  ఉన్న స్థానాలలో  ఆ రెండు  పార్టీల అభ్యర్థులు అవలీలగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు.   

ఇటీవల టైమ్స్ నౌ, ఇండియా టీవీ, ఇండియా టుడే వంటి ఇంగ్లీష్ ఛానళ్ళు బుల్లి,  బుల్లి శాంపిల్స్ తో సర్వే నిర్వహించి తమ పార్టీకి 18 నుంచి 23 లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడం తో, తమ పార్టీ నేతలు 175 కు 175 అసెంబ్లీ స్థానాలలో గెలుస్తామని భావించి ఇంకా ఎక్కువ దారుణాలు చేయడం, సర్వే ఫలితాలను చూసి పనిచేయడం మానేస్తే పరిస్థితి మరింత అద్వానంగా ఉంటుందని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.

ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ముఖచిత్రం బాగాలేదని తెలి సిందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ప్రధానితో భేటీలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బకాయి నిధులు చెల్లించాలని కోరినట్లుగా, అలాగే 10 వేల కోట్ల రూపాయల అడ్వాన్స్ చెల్లిం చా లని అడిగినట్లుగా వివరించారని తెలిసిందన్నారు. కానీ ఏ మాత్రం క్రెడిబిలిటీ లేని వారికి పదివేల కోట్ల రూపాయలు అడ్వాన్సుగా ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక మెడికల్ కాలేజీల నిర్మాణానికి సహ కరించాలని ప్రధానిని  కోరినట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఎందుకంటే ఇప్పటికే శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీల నిర్మాణం పునాదుల దశలోనే ఉన్నాయని  గుర్తు చేశారు. 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తమ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ ఇంటిని ప్రభుత్వం అకారణంగా కూల్చివేస్తే పరామర్శించడానికి వెళ్తుండగా అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు పరామర్శకు వెళ్తుంటే... ప్రభుత్వం ఎందుకని అంత దడదడలాడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో పరామర్శల పేరిట ఊరూరు తిరిగిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు లోకేష్ తమ పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులను పెట్టి అడ్డగించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఏపీ పోలీసులు ఐపీసీ ని ఫాలో కాకుండా, వైసీపీని ఫాలో అవుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయని రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు. 

లోకేష్ ను మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, ఏక వచనంతో సంబోధించడం,  మీడియాతో మాట్లాడుతుంటే అడ్డుకోవడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు వ్యతిరేకం కాదా? అం టూ రఘురామకృష్ణంరాజు నిలదీశారు. విశాఖలో చోటు చేసుకున్న సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని  ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న వారి అందరి విశ్వా సాలను కోల్పోయే విధంగా తమ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే, ఎన్నో అబ ద్ధాలు చెప్పి, తటస్థ ఓటర్లను మనం  ప్రభావితం చేయగలిగి ఉండేవారమా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నిం చారు. 

మనస్సాక్షి లేని సాక్షి దినపత్రిక కోర్టులో జరిగిన వాదనలపై ఏమి రాస్తుందో చూడాలని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. తాను దాఖలు చేసిన పిటీషన్ కొట్టేసినట్లు గతంలో యాక్ ..ఛీ దినపత్రిక, అదే పేరు ఉన్న ఛానల్ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ స్థానానికి  అదనపు సమాచారాన్ని అందించేందుకు అవకాశం ఇవ్వాలని తాము కోరగా, కోర్టు అంగీక రిం చిందని, తాము వీడియో ఆధారాలతో కూడిన అదనపు సమాచారాన్ని అందజేశామని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.