వివేకా హత్య కేసు.. సోద‌రి సునీతకు పులివెందుల ఎర.. జగన్ కొత్త ఎత్తుగడ?

Publish Date:Jul 27, 2022

Advertisement

ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డిన సంఘ‌ట‌న జ‌రిగితే దానికి దారి తీసిన ప‌రిస్థితులు, అందుకు కార‌కుల‌ను ప‌ట్టుకోవ డం, శిక్షించడం అన్నీ క్షణాల్లో జ‌రిగిపోతుండటం చూస్తుంటా. వాస్తవంలో కాదు.. సినిమాల్లో మాత్రమే. వాస్తవంలో అదేమీ జరగదు, పైగా రాజ‌కీయ‌కోణం ఉన్న హ‌త్య కేసులైతే దోషులను నిర్ధారించడం, పట్టుకోవడం చాలా చాలా ఆలస్యం అవుతుంది. కానీ. వై.ఎస్‌.వివేకా నందరెడ్డి కేసులో మాత్రం ఆ జాప్యానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది.  మ‌రో వంక  ఈ కేసు విషయంలో దోషులను ఎలగైనా పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్న వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీతా రెడ్డిని ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చి, కేసు గురించి మరిచిపోయేలా చేసి త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నానికి ఉప‌యోగించుకోవాల‌న్న కొత్త ఎత్తుగ‌డ ఒకటి జగన్ వేస్తున్నార‌ని తెలుస్తోంది.  

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి మూడున్నరేళ్లు గడుస్తోంది. సరిగ్గా 2019 ఎన్నికల హడావుడిలో ఉండ గా మార్చిలో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇప్ప‌టికీ ఆ కేసు తేల‌లేదు. ప్ర‌తిప‌క్షాలో, వివే కానంద కుమార్తె సునీతో, మ‌రెవ‌ర‌యినానో  ఢిల్లీ వెళ్ల‌డ‌మో, ప్ర‌శ్నించ‌డ‌మోచేస్తేనే  కేసు మ‌ళ్లీ చ‌ర్చ‌కు వ‌స్తోం ది. అంతే త‌ప్ప విచార‌ణలో అడుగు ముందుప‌డ‌టం లేదు.  వివేకానంద రెడ్డి స్వ‌యాన ముఖ్యమంత్రి జ‌గ‌న్‌రెడ్డికి  బాబాయి అయిన‌ప్ప‌టికీ ఈ కేసు నత్త‌న‌డ‌కన సాగడం పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో  అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారే ఈ  ఘాతుకానికి  పాల్పడిందంటూ  జగన్, ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం ఊరూ వాడా ప్రచారం చేశారు. ప్ర‌భుత్వం ఈ కేసు విచార‌ణ విష‌యంలో ఆస క్తి చూప‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. పైగా వివేకానంద హ‌త్య, విచార‌ణ‌లో జాప్యం  అప్ప‌టి రాజ కీ య ప‌రిణామాలు జ‌గ‌న్‌కి బాగా క‌లిసివ‌చ్చాయి. ఈ కార‌ణంగానే   చంద్ర‌బాబుకు ఎంతో న‌ష్టం జ‌రిగింది. సానుభూతి ఓటుతో జ‌గ‌న్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాగానే ముందుగా ఈ కేసు సంగ‌తి తేల్చే స్తార‌ని ఆయ‌న కుటుంబం కూడా భావించింది. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఆయ‌న వ్య‌వహ‌రించారు.  

అప్ప‌టివ‌ర‌కూ ఈ కేసుపై సిబిఐ విచార‌ణ‌కు జ‌గ‌న్ డిమాండ్ చేశారు. కానీ  అధికారంలో కి వ‌చ్చాక  దాన్ని మ‌రింత వేగిరం చేయాల్సింది బోయి అస‌లు సీబీఐ ద‌ర్యాప్తే అన‌వ‌సరం  అని తేల్చేరు.  కానీ వివేకా కుమార్తె వదల్లేదు కోర్టును ఆశ్రయించి మరీ వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టేలా చేయగలిగారు.  వివేకానంద రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీతా రెడ్డి  ఈ కేసు విచార‌ణ‌ను వేగి రం చేయాల‌ని, హ‌త్య‌కు పాల్ప‌డిన‌వారిని ప‌ట్టుకోవాల‌ని సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. అంతేగాక సోద రుడు జ‌గ‌న్ హ‌యాంలో విచార‌ణ‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని ఆమె అన్నారు. ఈమేర‌కు సుప్రీం కోర్టు  ఈ కేసును సీబీఐ చేత విచార‌ణ జ‌రిపించాల‌ని ఆదేశించింది. ఇక జగన్ అక్కడ నుంచి సీబీఐ దర్యాప్తునకు అడుగడుగునా అడ్డు తగిలే విధంగానే వ్యవహరించారు.  

సీబీఐ అధికా రుల వాహ‌నాల మీద కడపలో దాడి జ‌రిగినా ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. ఈ పరి ణామాలు జ‌గ‌న్ మీద‌నే అనుమా నాలు క‌లిగేలా చేశాయి. ఎందుకంటే సీబీఐ దర్యాప్తు ఈ కేసులో జగన్ సంబంధీకుల వైపే వేలెత్తి చూపేదిగా ఉంది. జగన్ సమీప బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ సహా పలువురు జగన్ అస్మదీయులకు ఈ కేసులో సంబంధం ఉందన్నఅనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా క్రమంగా వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కూడా నత్తతో పోటీపడి నడుస్తుండటంతో  సోద‌రుడు సీఎం అయినా ఈ కేసు విష‌యంలో అడ్డంకులు సృష్టించి దర్యాప్తు ముందుకు సాగకుండా చేస్తున్నారని సునీత ఆరోపిస్తున్నారు.  అస‌లే ఈడీ తో ఇబ్బందులు, రాష్ట్రంలో త‌లెత్తిన రాజ‌కీయ అస్థిర‌త‌తో తలమునకలౌతున్న జ‌గ‌న్    ఈ పరిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు జ‌గ‌న్ కొత్త ఎత్తుగ‌డ‌ వేశారని పరిశీలకులు అంటున్నారు.  వివేకా కుమార్తె, తన సోద‌రి సునీత‌ను శాంత‌ప‌ర‌చ‌డం ద్వారా దీని నుంచి బయటపడాలని ఆయన భావిస్తున్నారు.  అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పులి వెందుల సీటు సునీతకు ఆఫర్ చేశారు. ప్రతిగా వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకు ఇక ప్రయత్నాలు చేయకూడదన్న షరతు విధించారని అంటున్నారు. అందుకు ఆమె అంగీకరిస్తే పులివెందుల టికెట్ ఆమెకు ఇచ్చి తాను జమ్మల మడుగు నుంచి రంగంలోకి దిగడానికి సిద్ధపడ్డారంటున్నారు.    అయితే, త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మిని పార్టీ గౌర‌వ అధ్య‌క్ష‌ప‌ద‌వి నుంచి దించేసి చెల్లి ష‌ర్మిల వ‌ద్ద‌కు పంపిన జ‌గ‌న్ అవ‌స‌రం తీరాక తననూ అలాగే  క‌రివేపాకులా తీసిపడేసే అవకాశం ఉందని డాక్టర్ సునీత భావిస్తుండటంతో జగన్ ప్రతిపాదనకు ఆమె ఓకే చెప్పలేదని పులివెందులలో ఓ స్థాయిలో చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.