అయినా జగన్ మారలేదు.. 2.0 ఉత్తుత్తి మాటలే!?

Publish Date:Feb 17, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తన తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. తరువాత విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అవుతారు. 
వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. వంశీని జగన్ జైల్లో పరామర్శించడానికి వెళ్లడం పట్ల వైసీపీలోనే ఒకింత అభ్యంతరం వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా  చెలరేగిపోయి, అప్పటి ప్రతిపక్ష నేతపైనా ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీని గత ఏడాది  జరిగిన ఎన్నికలలో జనం తిరస్కరించారు. అంతే కాదు.. వంశీ వంటి నేతలను ప్రోత్సహించిన జగన్ పార్టీకి కూడా గత ఎన్నికలలో జనం దిమ్మతిరిగే షాక్ ఇచ్చి ఘోరంగా ఒడించారు. ఇప్పుడు తాను మారాననీ, ఇక నుంచి పార్టీకీ, పార్టీ క్యాడర్ కు అండగా  నిలుస్తాననీ, జగన్ 2.0ను చూస్తారనీ ఊదరగొడుతున్న జగన్ ఇప్పుడు అట్రాసిటీ కేసులో అరెస్టైన వంశీని  పరామర్శించడానికి  వెళ్లడం చూస్తుంటే ఆయన వైసీపీ కార్యకర్తలకు  కాదు.. పార్టీని జగన్ అండ చూసుకుని భ్రష్టుపట్టించిన వారికే వత్తాసుగా ఉంటారని అర్ధమౌతోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. 

2019 ఎన్నికలకు ముందు ఒక్క‌ చాన్స్ ఇవ్వండి అంటూ జనాలను కోరుకుని.. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించారు. ఇక ప్ర‌తిప‌క్ష నేత‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల వ‌ల్ల చంద్ర‌బాబుతో స‌హా అనేక‌మంది జైళ్ల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు వైసీపీ హ‌యాంలో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. బూతుల‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా విరుచుకుప‌డ్డారు. అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబు కుటుంబాన్ని దారుణంగా అవ‌మానించారు. వారిలో ప్ర‌ధానంగా వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని, రోజా ఉన్నారు. వీరు మీడియా స‌మావేశం పెట్టారంటే ఏపీలోని చాలా ఇళ్ల‌లో టీవీలు బంద్ అయ్యేవి. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కుతోడు వైసీపీ నేత‌ల అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌ల‌ను జీర్ణించుకోలేక‌పోయిన‌ ఏపీ ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ప్ర‌తిప‌క్ష హోదాకూడా వైసీపీకి ఇవ్వ‌లేదు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన నేత‌ల‌పై, ఐదేళ్లు హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల‌పై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కొర‌డా ఝుళిపిస్తున్నారు.  ఈ క్ర‌మంలోనే  జోగి ర‌మేశ్‌, నందిగం సురేశ్‌, పేర్ని నానిల‌పై కేసులు నమోద‌ య్యాయి. జోగి ర‌మేశ్‌, నందిగం సురేశ్ లు జైలుకెళ్లి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇప్పుడు వంశీ జైల్లో ఉన్నారు. అయితే, వంశీని ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  జైలుకు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ జైలుకెళ్లి వంశీని ఎలా స‌మ‌ర్ధిస్తారన్న అంశం ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. వంశీ త‌ప్పు చేసిన‌ట్లు ఆధారాల‌తోస‌హా పోలీసులు నిరూపిస్తున్నారు. గ‌న్న‌వ‌రం తెలుగుదేశం కార్యాల‌యంపై దాడి కేసులో వంశీతోపాటు ప‌లువురు వైసీపీ నేత‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్టు చేసి జైలుకు పంపించ‌గా.. వారిలో కొంద‌రు బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇటీవ‌ల వ‌ల్ల‌భ‌నేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. విజ‌య‌వాడ కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా.. వంశీకి కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. ప్ర‌స్తుతం వంశీ విజ‌య‌వాడ‌లోని జిల్లా జైలులో ఉన్నాడు. అయితే వంశీ అరెస్టైంది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కాదు. ఆ కేసులో ఫిర్యాదు దారు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి ఘ‌ట‌న‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను వంశీ ఆధ్వ‌ర్యంలో ఆయ‌న అనుచ‌రులు కిడ్నాప్ చేశారు. స‌త్య‌వ‌ర్ధ‌న్ ను బెదిరించ‌డంతోపాటు కొట్టారు. దీంతో ఇటీవ‌ల కోర్టులో త‌న‌కు, టీడీపీ కార్యాల‌యంపై దాడి ఘ‌ట‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స‌త్య‌వ‌ర్ధ‌న్ చెప్పాడు. అయితే, కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌గా.. స‌త్య‌వ‌ర్ధ‌న్ ను వంశీ, ఆయ‌న అనుచ‌రులు కిడ్నాప్ చేసి.. బెదిరింపుల‌కు గురిచేసిన‌ట్లు తేలింది. దీంతో వంశీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును న‌మోదు చేసి అరెస్టు చేశారు. వంశీతోపాటు మ‌రో ఇద్ద‌రిని అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం వంశీ జైల్లో ఉన్నాడు. ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకే  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  విజ‌య‌వాడ  జిల్లా జైలుకు వెడుతున్నారు. జ‌గ‌న్ వంశీని ప‌రామ‌ర్శించేందుకు జైలుకెళ్తే వైసీపీ ప‌రిస్థితి ప్ర‌జ‌ల్లో మ‌రింత దిగ‌జారిపోతుంద‌ని ఆ పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  దళితుల పక్షపాతిగా చెప్పుకునే జగన్.. ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టైన వల్లభనేని వంశీని జైలుకు వెళ్లి పరామర్శించడం సరికాదని ఆ  పార్టీ  నేతలే చెబుతున్నారు. 

వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో వంశీ, కొడాలి నాని, రోజాలు చంద్ర‌బాబు, ప‌వ‌న్, లోకేశ్ పైనా, వారి కుటుంబాల‌పై చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌తోనే అధికారాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని,  ఇప్పుడు వంశీ లాంటి నేత‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ జైలుకెళ్ల‌డం స‌రియైన నిర్ణ‌యం కాద‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.    

అన్నిటికీ మించి జగన్ 2.0 అంటూ ఇటీవల కాలంలో తెగ ఊదరగొడుతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే మూడు దశాబ్ధాలు తమదే అధికారం అంటూ   జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో చెబుతున్నారు. ఇన్నాళ్లు ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఆలోచించాన‌ని.. ఇక‌నుంచి జ‌గ‌న్ 2.0గా కార్య‌క‌ర్త‌ల బాగోగులను ప‌ట్టించుకుంటాన‌ని, వారికి అండ‌గా ఉంటాన‌ని జ‌గ‌న్ హామీలు ఇస్తున్నారు. దీంతో జ‌గ‌న్ లో మార్పు వ‌చ్చింద‌ని వైసీపీ క్యాడర్ భావించింది. అయితే, వంశీ లాంటి నేత‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ జైలుకు వెళ్లడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.  ఇక జ‌గ‌న్ మార‌రు.. వైసీపీతో ఉండి ఇబ్బందులు ప‌డ‌టం కంటే పార్టీ వీడడమే మేలని మెజారిటీ వైసీపీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  మొత్తం మీద జగన్ తాను చెబుతున్న జగన్ 2.0 మాటలన్నీ ఉత్తుత్తివేననీ, ఆయనకు కావలసింది నేర పూరిత స్వభావం ఉన్న, ప్రత్యర్థులపై అసభ్య పదజాలంతో దూషించేందుకు వెనుకాడని వల్లభనేని వంశీ వంటి వారే తప్ప జనం, క్యాడర్, పార్టీ కాదని తేటతెల్లమైందని చెబుతున్నారు. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.