ఓట‌మి భ‌యంతో జ‌గ‌న్‌ కొత్త ఎత్తుగ‌డ .. అడ్డుక‌ట్ట వేసేదెవ‌రు?

Publish Date:Apr 14, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. తెలుగుదేశం, జనసేన,  బీజేపీ  కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది.  ప్ర‌ముఖ స‌ర్వేల‌న్నీ కూట‌మి విజ‌యం త‌ధ్య‌మ‌ని తేల్చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి అధికారంలోకి రావాల‌న్న ఆశ‌లు ఆవిరైపోతున్నాయి. దీంతో జ‌గ‌న్ త‌న క్రిమిన‌ల్ మైండ్ కు ప‌నిచెప్పిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. విజ‌య‌వాడ‌లో బ‌స్సుయాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్‌పై జ‌రిగిన గులక రాయి దాడి ఘ‌ట‌న జ‌గ‌న్ క్రిమిన‌ల్ మైండ్‌లో భాగ‌మేన‌ని కూట‌మి పార్టీల నేత‌లు ఆరోపిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సానుభూతి కోసం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌త్యారాజ‌కీయాల‌కు తెర‌లేపుతార‌ని విప‌క్ష పార్టీల నేత‌లు ముందు నుంచి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ట‌నలు ఉదాహ‌రణ‌గా చూపుతున్నారు.  ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఊహించిన‌ట్లుగానే జ‌గ‌న్‌పై రాయి దాడి జ‌ర‌గ‌డం.. అదంతా చంద్ర‌బాబు చేయించార‌ని వైసీపీ విస్తృత ప్ర‌చారం చేయ‌డంతోపాటు.. ఆ పార్టీ నేత‌లు మీడియా ముందు ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇవ్వ‌డం ప్లాన్ ప్ర‌కారం జ‌రిగిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర‌హాలో ప్ర‌జ‌ల్లో సానుభూతి కోస‌మే జ‌గ‌న్ ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌కు మ‌రోసారి తెర‌లేపారని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాగే వ‌రుస ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. కోడిక‌త్తి దాడి, వివేకానంద రెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌లు వైసీపీ కుట్ర‌లో భాగ‌మేన‌ని అప్పట్లోనే విమ‌ర్శ‌లున్నాయి. ఆ తరువాత జరిగిన దర్యాప్తులలో కూడా ఆ ఘటనల వెనుక ఉన్నది వైసీపీయే అని తేలింది.  అప్ప‌ట్లో అధికారంలో తెలుగుదేశం ఉంది. అప్పట్లో మ‌రోసారి టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, కోడిక‌త్తి దాడి, వివేకానంద రెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌ల‌కు చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో వైసీపీ విజ‌య‌వంత‌మైంది. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన కొద్దికాలానికే కోడిక‌త్తి దాడి, వివేకానంద రెడ్డి హ‌త్య‌ ఘ‌ట‌న‌ల్లో తెలుగుదేశం ప్ర‌మేయం లేద‌ని స్ప‌ష్ట‌మైంది. మ‌రోవైపు జ‌గ‌న్ ఐదేళ్ల ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయారు. దీంతో ప్ర‌జ‌లు వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఓటు ద్వారా గ‌ద్దెదింపేందుకు స‌న్న‌ద్ధంగా ఉన్నారు. దీంతో మ‌రోసారి సానుభూతి అస్త్రాన్ని ప్ర‌యోగించేందుకు జ‌గ‌న్ త‌న క్రిమిన‌ల్ మైండ్ కు ప‌నిచెప్పారని, అందులో భాగంగానే జ‌గ‌న్‌పై గులక రాయి దాడి ఘ‌ట‌న అని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. జగన్ రెడ్డిపై గులక రాయితో దాడి చేశారని వైసీపీ ప్రారంభించిన క్షుద్ర రాజకీయం ప్రతిపక్ష నేతలపై ఉద్దేశపూర్వక రాళ్ల దాడులకు దారి తీస్తోంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు అడ్డుకోవాల్సిన ఏపీ పోలీసులు ఏం చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఏపీలో పోలీసులు వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా మారిపోయార‌ని ఏడాది కాలంగా తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల నేత‌లు మొత్తుకుంటున్నారు.. ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చిన త‌రువాత కూడా ఏపీ పోలీసులు వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, జ‌గ‌న్ క్రిమిన‌ల్ మైండ్ కు అనుకూలంగా వారు ప‌నిచేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

జ‌గ‌న్‌పై గులక రాయి దాడి ఘ‌ట‌న త‌రువాత వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై రాళ్ల దాడికి పాల్ప‌డ్డారు. గాజువాక‌లో జ‌రిగిన ప్ర‌జాగ‌ళం స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతున్న స‌మ‌యంలో ఆయ‌న వాహ‌నం వెనుక గుండా వ‌చ్చి దుండ‌గులు రాయి విసిరారు. అనంత‌రం వారు ప‌క్క సందులోకి పారిపోయారు. పోలీసులు వారిని ప‌ట్టుకొనే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే  పోలీసుల‌ను దాటుకొని వ‌చ్చి జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీలో ఉన్న చంద్ర‌బాబుపై దాడికి ప్రయత్నించడం  అంటే  పోలీసుల ప్ర‌మేయం లేకుండానే ఇదంతా జ‌రుగుతుందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎన్నిక‌ల కోడ్ అమలులో ఉన్నప్పటికీ  ప‌లువురు పోలీస్ అధికారులు వైసీపీ కార్య‌క‌ర్త‌లుగానే ప‌నిచేస్తున్నార‌న‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ అని తెలుగుదేశం నేత‌లు ఆరోపిస్తున్నారు. అయితే, రాయి దాడి త‌రువాత చంద్ర‌బాబు మాట్లాడుతూ.. నిన్న చీక‌ట్లో సీఎంపై గుల‌క‌ రాయి ప‌డింది.. ఇప్పుడు క‌రెంట్ ఉన్న‌ప్పుడే నాపై రాయి విసిరారు. క్లెమోర్ మైన్స్ కే భ‌య‌ప‌డ‌లేదు.. ఈ రాళ్ల‌కు భయ‌ప‌డ‌తానా   అన్నారు. జ‌గ‌న్‌పై దాడిని అంద‌రం ఖండించాం.. కానీ  వైసీపీ పేటీఎం బ్యాచ్ కుక్క‌లు ఇష్టానుసారంగా మెరుగుతున్నాయి అంటూ   ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ పై దాడి జ‌రుగుతుంటే పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు.. దాడులు చేస్తే చూస్తూ ఉండ‌టానికే పోలీసులు ఉన్నారా అంటూ ప్ర‌శ్నించారు. అదేవిధంగా తెనాలి ప‌ర్య‌ట‌న‌లో జనసేన అధినేత‌ ప‌వ‌న్ పైనా ఓ వైసీపీ కార్య‌క‌ర్త‌ రాయి దాడికి పాల్ప‌డ్డాడు. ఆ వ్య‌క్తిని ప‌ట్టుకొని పోలీసులకు అప్ప‌గించారు.

 జ‌గ‌న్ పై రాయిదాడి జ‌రిగిన‌ప్పుడు ఆయ‌న ప‌క్క‌న ఉన్న పోలీసులు ఏం చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అయితే, జ‌గ‌న్ ప‌క్క‌నఉన్న‌ పోలీసుల‌ను ఏమైనా అంటే వైసీపీ నేత‌ల‌కు కోపం వ‌స్తుంది. జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌లో పోలీసుల వైఫ‌ల్యం లేద‌ని స‌జ్జ‌ల అన‌డం గ‌మ‌నార్హం. వైసీపీ నేత‌లు పోలీసుల‌ను వెనుకేసుకు రావ‌డానికి కూడా కార‌ణ‌ముంద‌ట‌. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించాల‌ని ఈసీ భావిస్తున్నది. కానీ, ఓట‌మి భ‌యంతో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీసుల‌ను అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో అల‌జ‌డి సృష్టించాల‌ని చూస్తున్నారని, త‌ద్వారా మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారనితె లుగుదేశం, జ‌న‌సేన  నేతలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీలో పోలీస్ వ్య‌వ‌స్థ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చినా పూర్తిగా జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేస్తుంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

పోలీసుల వ్య‌వ‌స్థ జ‌గ‌న్ కు దాసోహం అంటుంటే.. రాష్ట్రంలో మున్ముందు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా అడ్డుక‌ట్ట వేసేదెవ‌ర‌న్న ప్ర‌శ్న ఏపీ ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది. ఈసీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి వైసీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్న పోలీసు అధికారుల‌పై వేటు వేయాల‌ని ప్ర‌జ‌ల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. అలా చేయ‌కుండా జ‌గ‌న్ నియ‌మించుకున్న పోలీసు అధికారుల‌ ద్వారానే ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా నిర్వ‌హించాల‌ని ఈసీ భావిస్తే అదిజ‌రిగే ప‌నికాద‌న్నవిష‌యం తాజా ఘ‌ట‌న‌ల‌తో స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ఈసీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి వైసీపీ అనుకూల పోలీసుల‌పై కొర‌డా ఝుళిపిస్తే త‌ప్ప ఎన్నిక‌ల ప్ర‌శాతంగా జ‌ర‌గ‌వ‌నే అంశంపై ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ  జ‌రుగుతున్నది.

By
en-us Political News

  
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.