జగన్‌కి మానసిక చికిత్స.. ప్రభుత్వానిదే బాధ్యత!

Publish Date:Sep 14, 2024

Advertisement

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మానసిక ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నది ఒక ఆరోపణ. జగన్మోహన్‌రెడ్డి ఒక్క ఛాన్స్ అని రిక్వెస్ట్ చేసి అధికారంలోకి వచ్చి, ఐదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నరకం చూపించి వుండవచ్చు... జగన్‌తోపాటు ఆయన పార్టీ నాయకులు లక్షల కోట్ల రూపాయలు గుటకాయస్వాహా చేసి వుండొచ్చు. ఇసుక, మట్టి లాంటి ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుని వుండొచ్చు. తప్పుడు కేసులు పెట్టి ఎంతోమందిని... సాక్షాత్తూ అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించి వుండొచ్చు. రఘురామకృష్ణంరాజు దగ్గర్నుంచి ముంబై హీరోయిన్ వరకు ఎంతోమందిని చిత్రహింసలకు గురిచేసి వుండొచ్చు. జగన్ పరిపాలించిన ఐదేళ్ళకాలంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల చేతిలో ఎన్నో వందల మంది హత్యకు గురై వుండవచ్చు. ఎంతోమంది ప్రతిభావంతులైన అధికారులను కులాన్ని సాకుగా చూపించి వేధింపులకు గురిచేసి వుండొచ్చు. బటన్ నొక్కుతా అంటూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చి వుండవచ్చు. జగన్‌తో సహా వైసీపీ నాయకులు చాలామంది తమ మాటలతో, చేతలతో నీతి నియమాలను, నైతిక విలువలను సర్వనాశనం చేసి వుండవచ్చు... అయినప్పటికీ, ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన భద్రత విషయంలోగానీ, ఆరోగ్యం విషయంలోగానీ ప్రభుత్వం ఎలాంటి లోటు చేయడానికి వీలు లేదు. అలా లోటు చేయడానికి ప్రయత్నించడం కూడా భావ్యం కాదు. 

జగన్‌కి గతంలో 986 మంది సిబ్బంది సెక్యూరిటీగా వుండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సెక్యూరిటీ సిబ్బందిని 58 మందికి తగ్గించారు. అధికారంలో వున్నంతకాలం 986 మంది సిబ్బంది కల్పించిన సెక్యూరిటీతో ఆయన నిశ్చింతగా వుండేవారు. ఆ నిశ్చింతలోనే అద్భుతమైన ఆలోచనలు చేసి బటన్లు నొక్కుతూ వుండేవారు. అలాంటి మనిషికి కేవలం 58 మందితో సెక్యూరిటీ ఇవ్వడం ఎంతవరకు భావ్యమో ప్రభుత్వం ఆలోచించాలి. అదేంటంటే, ప్రభుత్వాధికారులు రూల్స్ ప్రకారమే వ్యవహరించాం అంటారు. గత ఐదేళ్ళుగా ఏ రూల్సూ పాటించని జగనన్నని ఇప్పుడు కొత్తగా రూల్స్ చట్రంలో ఇరికించాలని చూడటం ప్రభుత్వానికి న్యాయమా? కాబట్టి ప్రభుత్వం బాగా ఆలోచించి అంతగా అవసరం అనుకుంటే గతంలో వున్న సెక్యూరిటీ సిబ్బందిలో ఒక్కర్నో, ఇద్దర్నో తగ్గించి 980 ప్లస్ సిబ్బందితో సెక్యూరిటీ అందించాలి. జగన్ తాడేపల్లి ఇంటి దగ్గర అంతకు ముందు వున్న సెక్యూరిటీ ఏర్పాట్లు తగ్గించారు కాబట్టే ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే.

అలాగే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాల్సిన సమయం వచ్చింది. అదేంటంటే, అధికారం పోవడం వల్ల జగన్‌కి మెంటల్ ఎక్కింది అని కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. మెంటల్ ఎక్కడం వల్లే జగన్ పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడని  ఆరోపిస్తున్నారు. నిన్నగాక మొన్న జగన్ పిఠాపురం వెళ్ళి మీడియా ముందు ‘‘ఈ పాపకి పదిహేను వేలు... ఈ బాబుకు పదిహేను వేలు.. ఇలారా.. ఇలారా’’ అంటూ విచిత్రంగా ప్రవర్తించిన సంఘటనను కూడా వాళ్ళు సాకుగా చూపిస్తున్నారు. ఇలా విచిత్రంగా ప్రవర్తించినంత మాత్రానికే ‘అధికారం పోయినందువల్ల జగన్‌కి మెంటలెక్కింది’ అనడం కరెక్ట్ కాదు కదా? జగన్ ఇలా విచిత్రంగా ప్రవర్తించడం అధికారం పోయినందువల్ల కాదు అనే విషయాన్ని ఈ విమర్శలు చేస్తున్నవారు గ్రహించాలి. ఎందుకంటే, జగన్ అధికారంలో వున్నప్పుడు కూడా ఇలా విచిత్రంగా ప్రవర్తించేవారు. అందువల్ల జగన్ ప్రవర్తనకి, అధికారం పోవడానికి సంబంధం లేదన్న విషయాన్ని జగన్‌ని విమర్శిస్తున్నవాళ్ళు తెలుసుకుంటే మంచిది. వరద బాధితులను పరామర్శించడానికి పిఠాపురం వెళ్ళిన జగన్, అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడ్డం జగన్‌కి ఎక్కిన పిచ్చికి పరాకాష్ట అని కూడా పరుష పదాలు వాడుతున్నారు. ఇది ఎంతమాత్రం క్షమించరాని విషయం. ఎలా వుండే మనిషి ఎలా అయిపోయాడని జాలి చూపించాలే తప్ప ‘మెంటల్’ అనడమేంటి? తప్పు కదా?

‘మెంటల్’ లాంటి దారుణమైన మాటలు ఉపయోగించడం కరెక్ట్ కాదు.. అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో అస్సలు కరెక్ట్ కాదు. జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలి ఆయనకు మానసికంగా ఏవో సమస్యలు వున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్న మాట వాస్తవమే. అయితే అది పూర్తిగా సానుభూతితో పరిశీలించాల్సిన అంశం. తనకు మానసిక సమస్యలు వున్నాయని జగన్‌కి కూడా తెలిసే వుంటుందని, అందుకే ఆయన లండన్ మందులు వాడుతున్నారని, ఆ మందుల కోసం, ట్రీట్‌మెంట్ కోసమే జగన్ లండన్ టూర్‌కి వెళ్తూ వుంటారనే అభిప్రాయాలు వున్నాయి. జగన్‌ని ఎంతో అభిమానించే సీమరాజా కూడా ఈ విషయాన్ని చెబుతూ వుంటారు. తనకు మానసిక సమస్యలు వున్నాయని తెలుసుకుని, వాటిని తగ్గించుకోవడానికి అధికారంలో వున్నప్పటి నుంచి ప్రయత్నిస్తున్న జగన్‌ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడ్డం ఎంతవరకు సబబో అధికార పార్టీ నాయకులే ఆలోచించుకోవాలి.

అప్పుడెప్పులో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే జగన్ లండన్ వెళ్ళారు. ఇప్పటికి మూడు నెలలు అయిపోయాయి. పాపం ఆయన మళ్ళీ తన రొటీన్ చెకప్ కోసమో, మందుల కోసమో లండన్ టూర్ పెట్టుకున్నారు. ఆయన దారిన ఆయనని వెళ్లనివ్వకుండా పాస్‌పోర్టు కేసు క్రియేట్ చేసి లండన్ టూర్‌కి బ్రేక్ వేశారు. మందులు అయిపోవడం వల్ల ఆయన పిఠాపురంలోగాని, విజయవాడలోగానీ, జైళ్ళ దగ్గర గానీ విచిత్రంగా ప్రవర్తిస్తే ప్రవర్తించి వుండొచ్చు. ఆ ప్రవర్తనని సానుభూతిలో అర్థం చేసుకోవాలే తప్ప వేరే రకంగా ఆలోచించడం మాత్రం చాలా తప్పు. ఆయన దారిన ఆయన లండన్ వెళ్తుంటే ఆపేదీ మీరే.. ఇప్పుడు ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తుంటే విమర్శించేదీ మీరే... ఇదెక్కడి న్యాయమయ్యా?

నిజానికి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆరోగ్య బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. జగన్ మానసిక ఆరోగ్యం బాగుపడటానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. జగన్ మానసిక చికిత్స అనేది నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే చరిత్ర క్షమించదు. అమ్మ పెట్టదు.. అడుక్కుని తిననివ్వదు అన్నట్టు.. ప్రభుత్వం ట్రీట్‌మెంట్ చేయించదు.. ఆయన దారిన ఆయన లండన్ వెళ్తుంటే అవరోధాలు క్రియేట్ చేస్తుంది. ఇదెక్కడి సంస్కారం? అందువల్ల ఆ లండన్ టూర్ ఖర్చులు, మెడికల్ చెకప్పుల ఖర్చులు, మందుల కొనుగోలు ఖర్చులు... ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా భరించాలి. జగన్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా ఎలా నాశనం చేయాలా? రాజధాని అమరావతిని ఇంకా ఎలా భ్రష్టు పట్టించాలా? పోలవరాన్ని ఇంకా పనికిరాకుండా ఎలా చేయాలా? ఇంకా నేరాలూ ఘోరాలు ఎలా చేయాలా, ప్రకృతిని ఇంకా ఎలా ధ్వంసం చేయాలా అని ఆలోచించీ ఆలోచించి బ్రెయిన్లో ఫిలమెంట్ ఎగిరిపోయి వుండొచ్చు. అధికారంలో వున్నప్పుడే జగన్ బ్రెయిన్ ఫిలమెంట్ ఎగిరిపోయింది కాబట్టి, ఆ ఫిలమెంట్‌ని బాగు చేయాల్సిన బాధ్యత నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వానిదే. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. జగన్ సెక్యూరిటీ విషయంలో, మానసిక ఆరోగ్యం విషయంలో మొండి పట్టుదలకు పోకుండా సానుభూతితో వ్యవహరించాలి. ఒకవేళ లండన్ రేంజ్‌లో ట్రీట్‌మెంట్ చేయించడానికి బడ్జెట్ లేకపోతే, జగన్‌కి ఎంతో ఇష్టమైన, జగన్‌కి మాత్రమే రాజధాని అయిన వైజాగ్‌లో అయినా ట్రీట్‌మెంట్ చేయించాలి. తన బాధ్యతను నిర్వర్తించాలి.

By
en-us Political News

  
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.