బాబుకి బహిరంగ లేఖ, సినీ స్టైల్లో జగన్ డైలాగ్ లు

Publish Date:Oct 15, 2015

Advertisement

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించవద్దని, ఆహ్వానించినా తాను రాలేనంటూ వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.... బహిరంగ లేఖ రాశారు, రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, కార్పొరేట్ శక్తులకు వేలాది ఎకరాల భూములను కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అందుకే రాజధాని శంకుస్థాపనకు రావడం లేదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను లెక్క చేయకుండా వ్యవహరించడం, పేదల భూములను బలవంతంగా లాక్కోవడం, అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ ను చులకనగా చూడడం వంటి కారణాల రీత్యా ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాను శంకుస్థాపనకు రాలేనని జగన్ తెలిపారు. పైగా రాజధాని శంకుస్థాపన పేరుతో 400 కోట్ల రూపాయలను దుబారా చేయడాన్ని జగన్ తప్పుబట్టారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ను, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ను తానే స్వయంగా ఆహ్వానిస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో జగన్ ఈ లేఖ రాశారు, అయితే లేఖలో జగన్ ప్రస్తావించినా అంశాలు పరమ రొటీన్ గానూ, సినిమా డైలాగ్స్ లా ఉన్నాయి, రాష్ట్ర విభజన కారణంగా కట్టుబట్టలతో నడిరోడ్డున పడ్డ ఆంధ్రప్రదేశ్ ను పునాదుల నుంచి నిర్మించడమంటే మాటలు కాదు, అలాగే నవ్యాంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి ఆయువుపట్టు అయిన అంతర్జాతీయ రాజధానిని కట్టడమంటే అది ఒక యుద్ధం లాంటిదే, మరి యుద్ధం అన్నాక...కష్టనష్టాలు కచ్చితంగా ఉంటాయ్, త్యాగాలు ఇబ్బందులుంటాయ్, రిస్క్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి ప్రాణనష్టం ఉంటుంది. నవ్యాంధ్ర పునర్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మహాయ‌జ్ఞమే చేస్తున్నారు, సాధ్యమైనంతవరకూ ఎవరికీ ఎలాంటి నష్టం జరగకుండా సరికొత్త విధానాలతో ముందుకెళ్తూ ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు, రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసమీకరణ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి రైతుల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండా దాదాపు 35వేల ఎకరాలను ఆయన సమీకరించగలిగారు, ఇక్కడ రైతుల త్యాగం ఎంతో గొప్పదైనా, వారిని ఒప్పించడంతో బాబు సక్సెస్ అయ్యారు, అలాగే అంతర్జాతీయస్థాయి నగరాన్ని నిర్మించాలంటే లక్షలకోట్ల రూపాయలు కావాలి, అంత డబ్బు ఎక్కడ్నుంచి తేవాలి? అందుకే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు, దాన్లో భాగంగానే సింగపూర్, జపాన్ లాంటి దేశాలకు... కేపిటల్ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించారు.

ఇలా నవ్యాంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కు చంద్రబాబు బాటలు వేస్తుంటే, సహకరించాల్సిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... అడ్డుబండలు వేయడం సరికాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహాయ‌జ్ఞం చేస్తుంటే... కొన్ని కష్టనష్టాలు తప్పకుండా ఉంటాయనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని, ప్రతిదానికీ కోడిగుడ్డ మీద ఈకలు పీకకుండా, మంచి పనులను ప్రోత్సహించాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.

By
en-us Political News

  
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.