అప్పుడే కేసు ముగించొద్దంటున్న జగన్ లాయర్లు?

Publish Date:Feb 27, 2013

Advertisement

 

జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ ఉద్దేశ్యపూర్వకంగానే దర్యాప్తు పూర్తిచేయకుండా సాగదీస్తోందని, కనీసం ఇంతవరకు ఒక్క చార్జ్ షీటు కూడా కోర్టులో దాఖలు చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం, సిబిఐ రెండూ కలిసి కుట్రపన్ని జగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో ఇరికించారని, ఇంకెంత కాలం దర్యాప్తు చేస్తారని ప్రశ్నిస్తూ వచ్చిన జగన్ తరపు న్యాయవాదులు, ఈ రోజు జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టులో అభియోగం నమోదు చేయడానికి సిబిఐ సంసిద్దత తెలిపినప్పుడు, వారు దానిని తీవ్రంగా వ్యతిరేఖించడం విశేషం.

 

కేసు దర్యాప్తు జరుగుతున్నఈ తరుణంలో అభియోగాలు నమోదు చేస్తే నష్టం కలుగుతుందని మాత్రం చెప్పారు. అది ఏవిధంగా నష్టమో మాత్రం వారు చెప్పలేదు. అందువల్ల, కోర్టు జగన్ కేసును వచ్చే నెల 13వ తేదికి వాయిదావేసింది.

 

బహుశః జగన్ కేసులో ఇప్పుడ సిబిఐ కోర్టులో అభియోగాలు నమోదు చేసినట్లయితే, కేసు విచారణ మొదలయి, జగన్ పై మోపబడిన అనేక అభియోగాలలో ఏ ఒక్కటి నిరూపింపబడినా కూడా జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ కొత్తగా శిక్షలు ఎదుర్కోవలసి ఉంటుందని వారి ఆలోచన (భయం) కావచ్చును.

 

అయితే, ఈ రోజు కాకపొతే రేపయినా కోర్టులో అభియోగాల నమోదు తప్పదన్నపుడు మరి జగన్ తరపున వాదిస్తున్నన్యాయవాదులు ఎందుకు వద్దంటున్నారు? సిబిఐ ఉద్దేశ్యపూర్వకంగానే దర్యాప్తు పూర్తిచేయకుండా సాగదీస్తోందని ఆరోపిస్తున్న వారు, ఇప్పుడు సిబిఐని దర్యాప్తు పూర్తిచేయమని (కొనసాగించమని) కోరడంలో అంతర్యం ఏమిటి? ఈ ప్రశ్నకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు న్యాయ నిపుణులు  మాత్రమే సరయిన జవాబు ఈయగలరు.

By
en-us Political News

  
వైకాపా సోషల్ మీడియా మాజీ కన్వీనర్  సజ్జల భార్గవ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ స్వీకరించేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. 
సుప్రీంకోర్టు ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్టు ఆవరణలో ఈ ప్రమాదం సంభవించింది. కోర్ట్ 11, 12 మధ్య ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.  . అగ్ని మాపక సిబ్బంది మంటలను వెంటనే ఆర్పి వేశారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలను  పెద్ద పులి వణికిస్తోంది. గత రెండు రోజులుగా  ఎపిలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి , సంతబొమ్మాళి మండలాల్లో బెంగాల్ టైగర్ సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పొడుగుపాడు సమీపంలో రోడ్డు దాటుతుండగా పులిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఫెంగల్ తుఫాను బలహీనపడింది. అయినప్పటికీ దీని  ప్రభావం కొనసాగుతోంది. తుఫాను ప్రభావంతో ఎపిలోని  నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
 కులాంతర  వివాహం ఓ మహిళా కానిస్టేబుల్ హత్యకు దారితీసింది. స్వంత తమ్ముడే హత్యకు పాల్పడటం సంచలనమైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది.
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ మరింత ముందుకు వెళుతుంది.ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 28 పారామెడికల్‌ కాలేజీలు, 16 నర్సింగ్‌ కాలేజీలు, 32 ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌లను సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభిస్తారని వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇస్లాం అరబ్బీ నేర్చుకోవడం కంపల్సరీ అని జాపర్ భాయ్ తన మనవళ్లకు చెబుతున్నాడు. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి మౌలానా దగ్గరికి వచ్చాడు.  జాఫర్ భాయ్: సలాం వాలేకూం మౌలానా సాబ్ 
ఇక నుంచీ ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి వాసులకు తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 3న తిరుమల వాసులకు ఉచిత దర్శనం లభించనుంది.
అమెరికాలో పెచ్చరిల్లుతున్న గన్ కల్చర్ కారణంగా అమాయకులు అసువులు బాస్తున్నారు. తాజాగా అమెరికాలో కాల్పుల ఘటనలో తెలంగాణ యువకుడు మరణించాడు. ఎమ్ ఎస్ చదవడానికి నాలుగు నెలల కిందట అమెరికా వెళ్లిన ఖమ్మానికి చెందిన సాయి తేజ ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో కన్నుమూశాడు.
తెలంగాణలో అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నడూ తలవనైనా తలవని దీక్షా దివస్ కు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చింది. పదేళ్ల అధికారంలో ఉన్నా తెలంగాణ సాధన కోసం సావు నోట్లో కేసీఆర్ తలపెట్టిన రోజును మాత్రం ఎన్నడూ పెద్దగా స్మరించుకోలేదు.
వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో తిరుమల కొండపై జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. రాజకీయ ప్రసంగాల నుంచి, రాజకీయ ప్రదర్శనలు, స్టిక్కర్ల ప్రదర్శనలకు తిరుమల వేదికగా మారింది. తిరుమల కొండపై అన్యమత ప్రచారం కూడా యథేచ్చగా సాగింది. తిరుపతిలో అలిపిరి వెళ్లే దారిలో ఉండే గోడలపై ఉన్న దేవుడి బొమ్మలను చెరిపేసి వైసీపీ రంగులతో నింపేశారు.
  తెలంగాణలో  పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి  ఈ రోజు(నవంబర్ 30) తో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది.   ఏడాది పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మార్పుకోసం పోలింగ్ బూత్ కు వెళ్లి  అరక కట్టాల్సిన రైతు ఓటేశాడు, ఆ ఓటే అభయ హస్తమై రైతన్న చరిత్రను తిరగ రాసింది.  ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తీసుకొచ్చామన్నారు. 
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషణ్ చైర్మన్ గా  సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి బుర్రావెంకటేశం నియామకమయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.