త్యాగమయులు జగన్ పార్టీ నేతలు
Publish Date:Dec 31, 2012
Advertisement
పండుగనాడు ఇంటిపెద్ద ఏఆసుపత్రిలోనో, జైల్లోనో ఉంటే ఆ కుటుంబము ఏవిదంగా బాధపడుతుందో, అదేవిదంగా వైయస్సార్ కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. అతని జన్మదినం, క్రిస్మస్, నూతన సంవత్సరం వంటి ముఖ్యమయిన మూడు వేడుకలను చంచల్ గూడా జైల్లోనే జరుకోవలసివస్తున్నతమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితిచూసి తల్లడిల్లిపోతున్న, ఆ పార్టీ నేతలు ఈసారీ తాముకూడా నూతనసంవత్సర వేడుకలు జరుపుకోకుడదని నిర్ణయించుకొన్నారు. తమ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కుట్రపూరితంగా కావాలనే జైల్లో నిర్భందించిన సిబిఐ ఆయనకు ఆరు నెలలయినా కూడా బెయిల్ రాకుండా అడ్డుపడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి శంకర్ రావు ఇదివరకు కోర్టుకు వ్రాసిన లేఖలో జగన్ పేరు అట్టడుగున ఉండగా, సిబీఐ మాత్రం తమ పార్టీ నాయకుడి పేరును మొట్టమొదటి ముద్దాయిగా పేర్కొనడమే సిబిఐ కుట్రకి నిదర్శనమని కూడా వారు ఒక వింత వాదనచేస్తున్నారు. ఒక మాజీమంత్రి కోర్టుకు వ్రాసిన ఒక లేఖని వారు ప్రామాణికమని ప్రజలకి చెప్పబోవడమే విడ్డూరం. మొన్న హైకోర్టు చేత చివాట్లుతిని బయటపడిన శంకర్ రావు లేఖలో జగన్ ముద్దాయి అని వ్రాసినట్లు వారే చెప్పుకోవడం మరో వింత. ఏది ఏమయినప్పటికీ, జగన్ పార్టీవల్ల, తనకు లాభం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావించినప్పుడు మాత్రమే, చంచల్ గూడా జైలు తలుపులు అలనాడు వసుదేవుడు చిన్నారి శ్రీ కృష్ణుడ్ని బుట్టలో పెట్టుకొని వ్రేప్పల్లె బయలుదేరినప్పుడు వాటంతట అవే తెరుచుకున్నట్లు, రేపు ఎన్నికలముందు తెరుచుకొనే అవకాశం ఉంది. లేదంటే, ఇక జగన్మోహన్ రెడ్డికి సిబిఐ, కోర్టుల దయాదాక్షిన్యాలకోసం ఎదురుచూపులు తప్పవు.
http://www.teluguone.com/news/content/jagan-jail-24-20118.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





