‘కమీషన్ల’ వరకే నామినేటేడ్ పరిమితం ?
Publish Date:Dec 31, 2012
Advertisement
ఎంతో కాలం నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురు చూస్తున్న నామినేటేడ్ పదవుల భర్తీ ఇప్పట్లో జరగక పోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి వీటిని జనవరి మొదటి వారంలో భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే, ఇంతలో తెలంగాణాఫై అఖిల పక్ష సమావేశం జరగడం, ఈ విషయంపై నెల రోజుల్లో తమ నిర్ణయాన్ని తెలియచేస్తామని కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటించడంతో ఈ పదవులను ఆశిస్తున్న నాయకుల ఆశలఫై నీళ్ళు చల్లినట్లయింది. కేంద్రం ఈ విషయంలో నిర్ణయాన్ని ప్రకటించేంతవరకూ ఈ భర్తీ చేపట్టకూడదని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీటిని భర్తీ చేస్తే, కొత్త సమస్యలు వస్తాయని కిరణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అయితే, కీలకమైన ఎస్సీ, ఎస్టీ కమీషన్, మహిళా కమీషన్ల లోని చైర్ పర్సన్, సభ్యుల పదవులను మాత్రం ప్రస్తుతానికి భర్తీ చేయాలని ముఖ్య మంత్రి ఆలోచనగా తెలుస్తోంది.
వీటిలో ఎస్సీ, ఎస్టీ కమీషన్ లోని పదవి కోసం 140 మంది పార్టీ నాయకులు, పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే, మహిళా కమీషన్ చైర్ పర్సన్ కు కూడా పోటీ అంతే స్థాయిలో ఉందని సమాచారం. దీని కోసం 38 మంది కాంగ్రెస్ నేతలతో పాటు, మొత్తం 120 మంది పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కమీషన్ల లోని పదవులను మాత్రమే భర్తీ చేయాలని, మిగిలిన వాటిని తెలంగాణాఫై నిర్ణయం వెలువడిన తర్వాతే భర్తీ చేయాలనేది ముఖ్య మంత్రి ఆలోచనగా సమాచారం.
http://www.teluguone.com/news/content/congress-24-20114.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





