గుండెల మీద తన్నాడు..!

Publish Date:Oct 30, 2023

Advertisement

రాజన్న ముద్దు బిడ్డ  జగన్‌ని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేందుకు ఆ రాజన్న భార్య  విజయమ్మ, కుమార్తె వైయస్ షర్మిల.. పెద్ద యజ్జమే చేశారు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. జగనన్ను ముఖ్యమంత్రి యోగం పట్టించేందుకు పెద్ద యాగమే చేశారు. అదీ కూడా  ఎంతగా అంటే  జగన్.. అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో ఉంటే.. జగనన్న వదిలిన బాణమంటూ..   సోదరుడి కోసం రాష్ట్రవ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో వారి తల్లి   విజయమ్మ సైతం అడుగు కలిపారు. 

అలాగే ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా  జగన్ సైతం పాదయాత్ర చేశారు. ఆ క్రమంలో వైయస్ జగన్‌కి  షర్మిల, వైయస్ విజయమ్మ అండ.. దండ గా నిలిచారు. అంతేకాదు..  షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల వారితో వరుసగా సభలు, సమావేశాలు నిర్వహించి.. తన బావమరిది, వైసీపీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే.. రాష్ట్ర పరిస్థితులు ఏమో కానీ ముఖ్యంగా మన స్థితిగతులు మారిపోతాయని.. వారికి ఎరేసి మరి చెప్పారు. అలా వారితోపాటు  కాలం కూడా జగన్‌కి కలిసొచ్చింది.  2019 ఎన్నికల పలితాల్లో జగన్ పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది. దీంతో జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేశారు.. దీంతో జగన్ బాబు.. జగన్ బాబు అంటూ పలికే ఆయన కన్నతల్లి  విజయమ్మ, జగనన్న జగనన్న అనే వైయస్ షర్మిల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. 

కానీ వారి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సీఎం జగన్ అనిపించుకొన్న కొద్ది రోజులకే..   విజయమ్మ,  షర్మిల పక్క రాష్ట్రానికి పయనమయ్యారు. ఆ తర్వాత తెలంగాణలో వైఎస్సా టీపీ అంటూ కొత్త పార్టీని  షర్మిల స్థాపించినా.. ఆ పార్టీని..  షర్మిలను జగన్ నిరాదరణకు గురి చేసిశారు. అలాగే   షర్మిల పార్టీని తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా.. ప్రజలు పట్టించుకోకపోవడంతో.. ఆ పాదయాత్రకు వైయస్ షర్మిల   పెట్టేశారు.. 

తాజాగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నగరా మోగడంతో.. ఈ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామంటూ  షర్మిల ప్రకటించిన విషయం విదితమే. దాంతో పార్టీలో నేతలు లేరు, కేడరూ లేదు. అలాంటి పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటూ.. ఆమె కన్న తల్లి  విజయమ్మ ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ప్రముఖ సిద్దాంతి అద్దేపల్లి హనుమంతరావు నివాసానికి చేరుకొని..  షర్మిల రాజయోగంపై ఆరా తీశారు. అనంతరం స్థానిక శాసన సభ్యుడు, సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి   చేరుకొని... యోగ క్షేమాలు  ఆరా తీశారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి   జగన్ అనుసరిస్తున్న వైఖరిపై బాలినేని.. తన కుటుంబ సభ్యుల సమక్షంలో  విజయమ్మకు వివరించే ప్రయత్నం చేశారు. అంతలోనే మాట  అందుకొన్న వైయస్ విజయమ్మ.. తనతో వైయస్ జగన్ సరిగ్గా మాట్లాడడమే లేదని.. తనను,  షర్మిలను అసలు పట్టించుకోవడం లేదంటూ బాలినేని ఫ్యామిలీ ఎదుటే ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  మరోవైపు బాలినేని సైతం తన పట్ల సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరిపై   విజయమ్మకు వివరించడంతో.. ఇద్దరూ తమకు జరుగుతున్న అన్యాయం, అవమానం ఒకరికొకరు ఏకరువు పెట్టుకొన్నట్లు పలు కథనాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయి.. అవుతున్నాయి. 

దీంతో నెటిజనులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జగనన్నను అందలం ఎక్కిస్తే.. ప్రజలకే కాదు మనకు సైతం అందకుండా పోయాడని వారు పేర్కొంటున్నారు. విశ్వసనీయత, మాటతప్పం, మడమ తిప్పం లాంటి సెంటిమెంట్ డైలాగులు వాడే   జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాతివ్రత్యాన్ని నిరూపించుకొన్నారని వారు వ్యంగ్యంగా అంటున్నారు. ముఖ్యమంత్రిగా  జగన్.. సభల్లో, బహిరంగ సభల్లో స్టేజీలెక్కి అక్క చెల్లెమ్మలకు, అవ్వతాతలకు అంటూ షిక్కటి చిరునవ్వుతో చెప్పే మాటలన్నీ వట్టి కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందని అంటున్నారు. 

అయినా జగనన్న కోసం అంతలా పాదయాత్ర చేస్తే.. ఆ తర్వాత సొంత చెల్లినే దూరం పెట్టిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలంటూ నెటిజన్లు.. సోషల్ మీడియాలో పదాలు కోసం వెతుక్కోవడం గమనార్హం. ఆస్తి తగాదాలు, నామినేటేడ్ పోస్టులు వంటి వాటి వల్ల సొంత చెల్లిని దూరం పెట్టాడంటే అనుకోవచ్చు. కానీ కన్నతల్లి వైయస్ విజయమ్మని  సైతం ఈ జగనన్న పట్టించుకోవడం లేదంటే.. మహానేత, తండ్రి  రాజశేఖరరెడ్డి గుండెల మీద సీఎం జగన్ తన్నినట్లే అన్న ఓ ప్రచారం   సోషల్ మీడియలో జోరందుకొంది.  ఇక అధికారం.. అధికారం.. అధికారం.. ఈ అధికారం అనే అందలం ఎక్కగానే.... అప్పటి వరకు సాయం చేసిన వాళ్లని.. సాయపడిన వాళ్లని.. మరిచిపోతారా? అనే సందేహం సైతం నెటిజనులలో వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.