పాపం జగన్.. పట్టించుకునే వారే లేరా?

Publish Date:Oct 12, 2015

Advertisement


కక్కలేక మింగలేక అన్నట్టు ఉంది ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద తాను నిరాహార దీక్ష చేపట్టారు. అయితే జగన్ చేపట్టిన దీక్షకు ఎంతో మంది పార్టీ నేతలు.. ప్రజాసంఘాలు మద్దతు తెలిపినప్పటికీ  అసలు పట్టించుకోవాల్సిన వాళ్లు మాత్రం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని సంగ్ధిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ దీక్ష చేపట్టి ఇప్పటికి ఆరు రోజులు అయిపోయింది. అయితే జగన్ కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు జగన్ పరిస్థితి బాలేదని.. జగన్ రోజు రోజుకూ నీరసిస్తున్నారని తెలుపుతున్నారు. మరోవైపు జగన్ పరిస్థితి చూసి పార్టీ నేతల్లో ఆందోళన మొదలైనట్టు చెపుతున్నారు. ఇంతవరకూ ఒకకోణం.

అయితే జగన్ దీక్ష ప్రారంభించిన మొదటి రెండు రోజులు మాత్రం టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆతరువాత ఏమైందో ఏమో కాని కొంచెం సైలెంట్ గానే ఉండి జగన్ దీక్షకు సంబంధించిన  వివరాలు మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చారు. ఆ తరువాత వారి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు అయితే అసలు రాష్ట్రంలో దీక్ష అనేది ఒకటి జరుగుతుందా అని అనుమానం వచ్చేంతలా అసలు ఏమాత్రం ఆవంక కన్ను కూడా ఎత్తి చూడకుండా ఏపీ నూతన రాజధాని శంకుస్థాపన పనులలో నిమగ్నమైపోయారు. అంతేకాదు పొట్టిశ్రీరాములు అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం కోసం యాభై రోజులు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు.. జగన్ ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం అని అనుకుంటున్నారుట.

ఈనేపథ్యంలో జగన్ దీక్ష చేస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో దీక్ష కొనసాగించాలా లేక విరమించాలా అని పార్టీనేతలు అనుకుంటున్నారట. అసలు గత శనివారం రాత్రే జగన్ తో దీక్ష విరమింపజేయాలని చూసినా ఎందుకో ఆగిపోయి దీక్షను కొనసాగించారు. మరోవైపు జగన్ దీక్షపై టీవీ ఛానళ్లు కూడా అంతా శ్రద్ద వహిస్తున్నట్టు ఏం కనిపించడం లేదు. మరోవైపు విమర్శలు.. మొన్నటి వరకూ షుగర్ లెవల్స్ పడిపోయాయని చెప్పిన వైద్యులు మళ్లీ నిన్న షుగర్ లెవల్స్ పెరిగాయని చెప్పడంతో మళ్లీ టీడీపీ శ్రేణులు గళం విప్పారు. అంత సడెన్ గా షుగర్ లెవల్స్ ఎలా పెరుగుతాయి.. తాను రెండుగంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటున్నారు అని అంటున్నారు. దీనికి తోడు దీక్ష చేస్తున్నప్పుడు కవర్ చేయని మీడియా జగన్ షుగర్ లెవల్స్ పెరిగాయి అన్న వార్తను మాత్రం బాగా ప్రసారం చేసింది. దీంతో జగన్ దీక్షపై ఎంతోకొంత సానుభూతి చూపించే వాళ్లకు కూడా డౌట్ వచ్చేలా చేశారు.

ఇదిలా ఉండగా పార్టీ నేతలు జగన్ తో దీక్ష విరమింపజేయాలని ప్రముఖులను, పోలీసులను కోరుతున్నట్టు.. వారు ప్రభుత్వాధికారులే ఏం పట్టించుకోవడం లేదు మేము మాత్రం ఏం చేయగలం అని చెపుతున్నట్టు రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. అంతేకాక ఈ దీక్ష ఏదో ఢిల్లీలో చేస్తే బావుంటుంది ఇక్కడ గల్లీలో చేస్తే ఏం లాభం ఉంటుంది అని అనుకున్న వారుకూడా లేకపోలేదు. అటు కేంద్రం నుండి.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాపం జగన్ కు ఏం చేయాలో తెలియడం లేదట. ఈ నేపథ్యంలో జగన్ దీక్ష కొనసాగిస్తారా? లేక విరమిస్తారా? వేచి చూడాలి.

By
en-us Political News

  
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.