కంచుకోటలోనూ.. భద్రతా వలయం మధ్యనే జగన్.. అంత భయమెందుకంటే.. ?

Publish Date:Jul 8, 2022

Advertisement

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే కాకుండా తనకు, తన కుటుంబానికి కంచుకోట అనుకునే పులివెందులలో, వేంపల్లెలో తిరగాలంటేనే సీఎం జగన్ కు భద్రతా పరమైన భయం పట్టుకున్నట్లుంది. అందుకేనేమో గతంలో ఏనాడూ లేని విధంగా గురువారం ఉదయం నుంచీ పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలు పెట్టారు. జగన్ పర్యటించే ప్రాంతాల్లో, మార్గాల్లో అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. అడుగడుగునా బారికేడ్లు పెట్టడమే కాకుండా పోలీసులు, వాలంటీర్ల వలయం మధ్యనే జగన్ తిరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు.  వేంపల్లెలోని ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ ఉదయం నుంచీ మూసేశారు. చివరికి వైఎస్ఆర్ పార్క్ చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ కోసం ఆయన కంచుకోటలోనే ఇంతటి విస్తృతస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడాన్ని చూసిన  జనం అవాక్కయ్యారు.

నిజానికి పులివెందుల, వేంపల్లె వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా పెట్టని కోటలు. అయితే.. వేంపల్లెలో వైఎస్ఆర్ పార్కును ప్రారంభించేందుకు జగన్ వస్తున్న నేపథ్యంలో ఇంతటి పకడ్బందీ భద్రత ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, తమను ఇంతలా ఇబ్బంది పెట్టాల్సిన అగత్యం ఏమి వచ్చిందంటూ స్థానికులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా బారికేడ్లు పెట్టడం ఏమిటి? వేలాది మంది పోలీసులను మోహరించడం దేనికని వారు గుస్సా అవుతున్నారు. జగన్ భద్రతకు   వచ్చిన ముప్పు ఏముందని ఇంతలా ఆర్భాటం చేశారని వారు దుయ్యబడుతున్నారు.

ఒక్కసారి ఛాన్స్ అంటూ ఏపీ సీఎం అయిన జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని, ఎక్కడికి వెళ్లినా తనకు ప్రజల నుంచి వ్యతిరేకత, నిరసనలు, చీదరింపులు ఎదురవుతుండడం వల్లే ఇలా అతి జాగ్రత్తలు తీసుకున్నారని జనం అంటున్నారు. పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ ప్రాంతానికి వచ్చిన సీఎం జగన్ ను కలిసి, సమస్యలపై మొరపెట్టుకునేందుకు కూడా అవకాశం లేకుండా ఈ బందోబస్తు ఏమిటని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనాలోచిత నిర్ణయాలు,పాలనతో యావత్ రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేసిన జగన్ పట్ల జనంలో అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే వైసీపీ ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదంటున్నారు.

మరో పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘బాదుడే.. బాదుడు’ కార్యక్రమం చేపట్టినా.. జిల్లాల యాత్రలు చేస్తున్నా అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనకు అఖండ స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడ సభ నిర్వహించినా తండోపతండాలుగా జనం వస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాలకు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో పక్కన జగన్ కానీ, వైసీపీ కానీ ఏ కార్యక్రమం పెట్టినా ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి. జనం కనిపించడం లేదు. రోజు రోజుకూ చంద్రబాబు ప్రభ వెలిగిపోతోంటే.. అంతకంతకూ జగన్ ప్రభావం కొడిగట్టేస్తోందని జనం చెప్పుకుంటున్నారు. 

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ప్రతి ఏటా జులై 8న సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. పులివెందుల వచ్చిన ప్రతిసారీ ఆయన స్థానికులను ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కలుసుకుంటారు. కానీ ఈ సారి మాత్రం పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. కానీ.. వారికి పోలీసులు జగన్ కలుసుకునే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం గమనార్హం. తన సమస్య చెప్పుకోడానికి సిద్ధవటం నుంచి వచ్చిన ఓ వృద్దురాలిని కూడా జగన్ ను కలుసుకోనివ్వకుండా అడ్డుకోవడంతో ఆయనకు అంత భయం ఎందుకు పట్టుకుందన్న విమర్శలు స్థానికుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.

వృద్ధురాలి నుంచి కూడా జగన్ కు ముప్పు ఉందని భావిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. చేయాల్సిన తప్పులన్నీ చేసేసి, ఇప్పుడు క్షణక్షణం భయంతో, భద్రతాపరంగా వణికిపోతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. జగన్ లో ఎంత భయం గూడుకట్టుకుందో ఏమో గానీ చివరికి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించపోవడంలోని ఔచిత్యాన్ని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ పులివెందుల, వేంపల్లె పర్యటన ప్రజలకు దూరంగా, కేవలం తమ పార్టీ నేతలను మాత్రమే కలుసుకోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భారీ పోలీసు భద్రత, వలంటీర్ల వలయం, పరదాల చాటున జగన్ తిరగాల్సిన పరిస్థితి రావడం ఆయన జనానికి దూరం అయ్యారనడానికి నిదర్శనంగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి..

By
en-us Political News

  
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.