తగ్గింది ఆదాయం కాదు, ఆర్థిక క్రమశిక్షణ.. జగనన్న వల్ల కావట్లేదా?

Publish Date:Jan 21, 2022

Advertisement

అదేమీ రహస్యం కాదు. ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అద్వాన్నంగా వుంది. ఖజానా నిండుకుంది. శివాలయాన్ని తలపిస్తోంది. ఇందులో, ఇంకెవరికీ, ఇంకో అభిప్రాయం లేదు. ఎటొచ్చి, ఈ నిజాన్ని, అప్పులతో కప్పెట్టి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన గారి 40 మంది సలహాదారులు చేశారు.   అయినా, అదేమీ దాగలేదు. బొక్కలు ఎప్పుడోనే బయట పడ్డాయి. ఆర్థిక మంత్రి బుగ్గన అప్పుల వేటలో క్షణం తీరిక లేకుండా ఎక్కే గడపా దిగే గడపా అన్నట్లుగా ‘యాత్రలు’ చేస్తూనే ఉన్నారు.  ఈ మూడేళ్ల కాలంలో మూడొంతుల సమయం అప్పుల వేటలో గడిపేశారు. ఎక్కే.అసలు ఆదాయ వనరులు పెంచుకునే ఆలోచనే లేకుండా, పన్నులు, అప్పులు ఈ రెండే ఆదాయ మార్గాలుగా ఆర్థిక వ్యవస్థను అద్వాన్న స్థితికి చేర్చారు. 

అయితే, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు మీడియా ముందుకు వచ్చి ఆదాయం ఎంత దారుణంగా పడిపోయిందో వివరించేందుకు,పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రూ.98వేల కోట్ట్లు ఉండవలసిన రాష్ట్ర ఆదాయం కేవలం రూ.62 వేల కోట్ల దగ్గరే ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. అంతే కాదు, ఈ దౌర్భాగ్య  పరిస్థితికి తమ బాధ్యత లేదని, నేరం మాది కాదు, కరోనాది’ అంటూ తప్పు మొత్తాన్ని కరోనా మీద నెట్టేసి, చేతులు ‘సానిటైజర్’తో కడిగేసుకున్నారు. 

అయితే కరోనా కారణంగా ఆర్థిక  వ్యవస్థ దెబ్బ తిన్న మాట కొంత వాస్తవమే అయినా, అదొక్కటే కారణం కాదు. నిజానికి అసలు కారణం అది కానే కాదు, అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. వైసీపీ  ప్రభుత్వం ఏ క్షణాన అధికారంలోకి వచ్చిందో, ఆ క్షణం నుంచే ఆర్థిక క్రమ శిక్షణ పట్టాలు తప్పింది. ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ప్రదేశ్’గా దిగాజారదానికి, దే సాలు కారణం అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అంతకు ముందు ఐదేళ్లలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర  విభజన ఆటుపోట్లను తట్టుకుని, ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెస్తే జగన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే అన్ని వ్యవస్థలతో పాటుగా ఆర్థిక వ్యవస్థను కూల్చి వేశారు.  

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసింది మొదలు, ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడం ఎలా అనే, ఆలోచన చేశారే తప్ప, మరో ఆలోచన చేయలేదు.ఓటు బ్యాంకును పదిలి పరుచుకునేందుకు, ఖాజానాలో పడిన ప్రతి పైసాను సంక్షేమం పేరున  పంచుకుంటూ పోయారు. అయితే, నిజంగా సొమ్ములన్నీ సంక్షేమానికే ఖర్చు చేశారా, అంటే అదీ లేదు.పేదలకు పంచినదాని కంటే, ఆ పేరున, ఇతరత్రా పెద్దలు బొక్కిందే ఎక్కువని లెక్కలు చెపుతున్నాయని అంటున్నారు, అందుకే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని తెలుగు దేశం పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. 

అదలా ఉంటే, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ జీతాల కోతకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్న మాటలు, చూపుతున్న లెక్కలు తప్పని ఆర్థిక శాఖ వర్గాలే అంటున్నాయి. నిజానికి, సమీర్ శర్మ చెపుతున్నది, తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ మేతకు అన్నట్లుగా ఉందని అదే అధికారులు అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉన్నది ఎంత నిజమో, అందుకు కొవిడ్ కారణంగా ఆదాయం పడిపోవడం కారణం కాదనేది కూడా అంతే నిజం అంటున్నారు. కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రకారం గడచిన రెండు సంవత్సరాలలో రాష్ట్ర ఆదాయం తగ్గలేదు. పెరిగింది. అవును, గడచిన రెండేళ్లలో రాష్ట్ర ఆదాయం ఏకంగా 39శాతం పెరిగిందని కాగ్ స్పష్టం చేసింది. అంటే ఇంత కాలం ప్రభుత్వం తనను తాను మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేస్తూ వచ్చిందనే  విషయం ఇప్పుడు తేట తెల్లంగా తెలిసి పోయింది. అయితే ఎంత మోసానికి మారు పేరు అయిన జగన్మోహన్ రెడ్డి అయినా, అందరినీ అన్ని కాలాలలో మోసం చేయ లేరు. అందుకే, రెండున్నరేళ్ళు నిండకుండానే, రోజులు లెక్కపెట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. చేకున్నవారికి చేసుకునంత.

By
en-us Political News

  
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.