Publish Date:May 17, 2025
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని హైదరాబాదులోని వారి నివాసానికి వెళ్లి సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల సుజనా చౌదరి లండన్ లో ఓ ప్రమాదంలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఇంటికెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
Publish Date:May 17, 2025
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలు తదితర అంశాలపై చర్చించారు
Publish Date:May 17, 2025
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిశారు.శనివారం సాయంత్రం నారా లోకేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దేశ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. అనంతరం, ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Publish Date:May 17, 2025
రైతుబజార్‌లో కూరగాయలు కొని ముఖ్యమంత్రి చంద్రబాబు డిజిటల్ పేమెంట్ చేశారు. అనంతరం కూరగాయలు వ్యాపారి అయిన మహిళను ఫోన్ పే చేశాను అమ్మ ఒకసారి చెక్ చేసుకో సీఎం చంద్రబాబు అన్నారు.
Publish Date:May 17, 2025
కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
Publish Date:May 17, 2025
తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో తిరుపతి, తూర్పుగోదావరి, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతల్లో కరెంట్ అంతరాయం ఏర్పడింది. అటు తెలంగాణలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
Publish Date:May 17, 2025
భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Publish Date:May 17, 2025
ఏపీలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గోన్నారు.
Publish Date:May 17, 2025
పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ నేత కపిల్ సిబల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉపా చట్టాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు.
Publish Date:May 17, 2025
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. పఠాన్ కోట్, జమ్ములో పాకిస్థాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో మే 8న ధర్మశాలలో దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. తొమ్మిది రోజుల అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ పునఃప్రారంభం కానుంది.
Publish Date:May 17, 2025
ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. 138 దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలవడంపై సీవీ ఆనంద్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
Publish Date:May 17, 2025
తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదైన కేసును కొట్టిసింది.
Publish Date:May 17, 2025
విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ మీద తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. గన్నవరంలో భారీగా అక్రమ మైనింగ్ కేసుకు పాల్పడ్డారని ఆరోపణల మీద ఒక కేసు, నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో మరో కేసును నమోదు చేశారు.