వైసీపీ గూటికి వంగవీటి రాధా?
Publish Date:Feb 23, 2026
Advertisement
ఇటీవల ఒక మీటింగ్ లో.. వంగవీటి రాధా, జక్కంపూడి రాజాకు కాపు సామాజిక వర్గం అండగా ఉండాలని సూచించారు. దీంతో రాధా వైసీపీలో చేరిపోతున్నారహో! అంటూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ప్రచారాలు, సంబరాలు మొదలెట్టేశాయి. అయితే రాజా కుటుంబంతో రంగా కుటుంబానికి ఉన్న అనుబంధం కారణంగా.. రాధా ఇలా అనాల్సి వచ్చింది తప్ప.. ఇందులో పార్టీల ప్రమేయం లేదని క్లారిటీ ఇస్తోంది రాధా వర్గం. ఇటీవల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను అవహేళన చేస్తూ మాట్లాడారు. ఆ వెంటనే కాపుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో దిగి వచ్చిన ఆర్పీ క్షమాపణ చెప్పారు కూడా. అలాగని కాపులంతా వైసీపీకి సపోర్ట్ చేయడం అని అర్ధం కాదు కదా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు. ఇది కూడా అంతే.. రాజా కుటుంబంతో ఉన్న అనుబంధం కొద్దీ చేసిన ఈ కామెంట్ ని పట్టుకుని ఇలాంటి వాదన తెరపైకి తీసుకురావడం తగదంటున్నారు. అదలా ఉంటే.. ఇదిలా ఉంటే రాధా కొడాలి నాని, వల్లభనేని వంశీతో గత కొంతకాలంగా ఎంతో స్నేహంగా ఉంటూ వస్తున్నారు. దీంతో తిరిగి వైసీపీలోకి వచ్చేస్తారన్న టాక్ చాలా పెద్ద ఎత్తున వినిపించింది. కానీ అలా జరగలేదు. ఎందుకంటే జగన్ రాధాను అవమానించిన తీరు ఎలాంటిదో.. ఇటీవల నాగబాబు మాటలను బట్టి తెలుస్తోంది. రంగా విగ్రహావిష్కరణలకు వెళ్లొద్దని హుకుం జారీ చేయడం వల్లే ఆయన వైసీపీ నుంచి బయటకొచ్చారు. అలాంటిది తిరిగి వైసీపీలోకి ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నది రంగా- రాధా మిత్ర మండలి.
http://www.teluguone.com/news/content/vangaveeti-radha-to-join-ycp-39-214523.html





