175కు 175.. ఓటమి భయానికి జగన్ కవరింగ్!

Publish Date:Apr 28, 2022

Advertisement

జగన్ సర్కార్ మూడేళ్ల పాలనలో  రాష్ట్రంలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదన్నది వాస్తవం కాగా అందుకు భిన్నంగా జగన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కు 175 స్థానాల్లో ఎందుకు గెలవకూడదు అంటూ ధీమా వ్యక్తం చేయడం మేకపోతు గాంభీర్యం కాక మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు. సర్వేలలో తనకు తప్ప ఎమ్మెల్యేలెవరికీ కనీసం పాస్ మార్కులు రాలేదని స్వయంగా ప్రకటించిన జగన్... వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలూ గెలిచేస్తామనడం..వాస్తవ పరిస్థితిని 
ఒక వైపు పార్టీలో అసంతృప్తి...మరో వైపు ఇంత కాలం ప్రభుత్వానికి ఏదో మేర సానుకూలత తెచ్చిపెట్టిన ఉచితాలు కొనసాగించలేని ఆర్థిక దుస్థితి వెరసి మొత్తంగా జగన్ ను ఢిఫెన్స్ లో పడేశాయి. ఎన్నికలలో పార్టీని గట్టెక్కించడమెలా అన్న మథనంలో పడేశాయి. 
 అందుకే వాస్తవ పరిస్థితిని కప్పి పుచ్చి జనంలో వైసీపీ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని చెప్పుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నమే వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో మొత్తం సీట్లు గెలిచేస్తామంటూ డాంబిక ప్రకటనలన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. 
 2019 ఎన్నికలకు ముందు, పాదయాత్ర సందర్భంగానూ ప్రజలను ఆకర్షించడానికి ఎడాపెడా హామీలు ఇచ్చేసిన జగన్ పై అప్పటికి ప్రజలలో ఎటువంటి అంచనాలూ లేవు, ఒక్క చాన్స్ ఇచ్చి చూద్దామన్న ఉద్దేశంతో ఓట్లేశారు. కానీ మూడేళ్ల పాలనలో హామీల అమలు  నుంచి పాలనా వైఫల్యాల వరకూ జగన్ పాలనా సామర్ధ్యంపై జనంలో భ్రమలు తొలగిపోయాయి. ఇప్పుడు జగన్ మూడేళ్ల పాలనను గత చంద్రబాబు పాలనతో పోల్చి చూస్తున్నారు.  ఏ వర్గమూ జగన్ పాలనపై సంతృప్తిని కానీ, సానుకూలతను కానీ ప్రదర్శించడం లేదు. సొంత పార్టీలోనే అసమ్మతి జ్వాలలు భగ్గు మంటున్నాయి.  జగన్ ఉచిత పథకాల  లబ్ధిదారుల్లోనే...ధరల బాదుడుపై అసహనం వ్యక్త మౌతున్నది.  ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో అంతకు రెండింతలు లాగేసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. రైతులు, ఉద్యోగులు, కార్మికులు, చివరికి బ్యూరోక్రాట్లు సైతం జగన్ తీరుకు విసిగిపోయారు. అన్ని వర్గాలలో అసంతృప్తి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  ఈ స్థితిలో వాస్తవ పరిస్థితిని కప్పి పుచ్చుకోవడానికే వచ్చే ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో  విజయం అంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని   రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
 
 నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలలో సంతుష్ట సూచీని పెంచడానికి నాడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటే...సంతుష్టి సూచీ దిగజారడానికి జగన్ పాలన శతథా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తతం ఏపీలో ఏ వర్గమూ సంతోషంగా ఉన్నట్లు కనిపించదు. పాలనా తీరు కారణంగా సామాన్య జనం, బ్యూరోక్రాట్లు, రైతులు, ఉద్యోగులు ఇలా ఒకటేమిటి అన్ని వర్గాల వారూ అసంతృత్తితో ఉన్నారు. అసహనంతో రగిలిపోతున్నారు. ధరల బాదుడు ఉద్యోగులూ, సమాన్య ప్రజానీకం నెత్తిన గుదిబండగా మారితే...సీఎస్ స్థాయి అధికారి కూడా ముందస్తు అనుమతి లేకుండా సీఎం జగన్ ను కలిసే అవకాశం లేని పరిస్థితి బ్యూరోక్రాట్లలో అసంతృప్తి పేరుకుపోవడానికి కారణమౌతున్నది. 

ఇక రైతుల పరిస్థితి తీసుకుంటే పండించిన పంట కొనుగోళ్లకు సర్కార్ ముందుకు రాకపోవడం, రైతు భరోసా కేంద్రాలు భరోసా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విద్యుత్ చార్జీల పెరుగుదల అన్ని వర్గాల వారికీ షాక్ కొట్టేలా ఉంది. దేశంలో మిగిలిన ఏ రాష్ట్రం కంటే కూడా రాష్ట్రంలో పెట్రోలు ధరలు అధికంగా ఉన్నాయి. ఇక ఉద్యోగులు మూడేళ్ల కిందటి వరకూ అంటే జగన్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ ప్రతి నెలా మొదటి తారీకున జీతాలు అందేవి. ఇప్పుడవి ఎప్పుడు అందుతాయన్న విషయం స్పష్టంగా చెప్పగల నాథుడే లేని పరిస్థితి ఏర్పడింది. ఇక పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ తీరు కారణంగా మోసపోయామన్న అసంతృప్తి ఉద్యోగులలో కొనసాగుతూనే ఉంది.
వీటికి తోడు జగన్ మానస పుత్రికగా చెప్పుకునే వలంటీర్ వ్యవస్థ ప్రజలపై పెత్తనం చేసే మరో అధికార కేంద్రంగా తయారైంది. గ్రామ స్థాయిలో వారు చేసే దాష్టీకం ప్రభుత్వంపై అసంతృప్తి స్థాయిని పెంచేల ఉంది. 
ఇక జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఉచిత పథకాలు అందుకుంటున్న వారు కూడా సంతోషంగా లేరు. ఒక వైపు  ఖాతాలలో సొమ్ములు పడుతున్నా....నిత్యావసరాల ధరలన్నీ కొండెక్కిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నదన్న భావన వారిలో కూడా అసంతృప్తి గూడు కట్టుకోవడానికి కారణమౌతోంది. 
ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రహసనం పార్టీలో అసమ్మతి ఎంతటి స్థాయిలో ఉందో తేటతెల్లం చేసేసింది.  
ఇలా అన్ని వైపులా రాష్ట్రంలో అసహనం, అసంతృప్తి ఉన్న పరిస్థితిలో విపక్షాలు క్రియాశీలం అయితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే విపక్షాలు ఆ దిశగా దృష్టి పెడుతున్నట్లుగా కనిపించదు.  

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.