175కు 175.. ఓటమి భయానికి జగన్ కవరింగ్!
Publish Date:Apr 28, 2022
Advertisement
జగన్ సర్కార్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదన్నది వాస్తవం కాగా అందుకు భిన్నంగా జగన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కు 175 స్థానాల్లో ఎందుకు గెలవకూడదు అంటూ ధీమా వ్యక్తం చేయడం మేకపోతు గాంభీర్యం కాక మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు. సర్వేలలో తనకు తప్ప ఎమ్మెల్యేలెవరికీ కనీసం పాస్ మార్కులు రాలేదని స్వయంగా ప్రకటించిన జగన్... వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలూ గెలిచేస్తామనడం..వాస్తవ పరిస్థితిని ఇక రైతుల పరిస్థితి తీసుకుంటే పండించిన పంట కొనుగోళ్లకు సర్కార్ ముందుకు రాకపోవడం, రైతు భరోసా కేంద్రాలు భరోసా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విద్యుత్ చార్జీల పెరుగుదల అన్ని వర్గాల వారికీ షాక్ కొట్టేలా ఉంది. దేశంలో మిగిలిన ఏ రాష్ట్రం కంటే కూడా రాష్ట్రంలో పెట్రోలు ధరలు అధికంగా ఉన్నాయి. ఇక ఉద్యోగులు మూడేళ్ల కిందటి వరకూ అంటే జగన్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ ప్రతి నెలా మొదటి తారీకున జీతాలు అందేవి. ఇప్పుడవి ఎప్పుడు అందుతాయన్న విషయం స్పష్టంగా చెప్పగల నాథుడే లేని పరిస్థితి ఏర్పడింది. ఇక పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ తీరు కారణంగా మోసపోయామన్న అసంతృప్తి ఉద్యోగులలో కొనసాగుతూనే ఉంది.
ఒక వైపు పార్టీలో అసంతృప్తి...మరో వైపు ఇంత కాలం ప్రభుత్వానికి ఏదో మేర సానుకూలత తెచ్చిపెట్టిన ఉచితాలు కొనసాగించలేని ఆర్థిక దుస్థితి వెరసి మొత్తంగా జగన్ ను ఢిఫెన్స్ లో పడేశాయి. ఎన్నికలలో పార్టీని గట్టెక్కించడమెలా అన్న మథనంలో పడేశాయి.
అందుకే వాస్తవ పరిస్థితిని కప్పి పుచ్చి జనంలో వైసీపీ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని చెప్పుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నమే వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో మొత్తం సీట్లు గెలిచేస్తామంటూ డాంబిక ప్రకటనలన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
2019 ఎన్నికలకు ముందు, పాదయాత్ర సందర్భంగానూ ప్రజలను ఆకర్షించడానికి ఎడాపెడా హామీలు ఇచ్చేసిన జగన్ పై అప్పటికి ప్రజలలో ఎటువంటి అంచనాలూ లేవు, ఒక్క చాన్స్ ఇచ్చి చూద్దామన్న ఉద్దేశంతో ఓట్లేశారు. కానీ మూడేళ్ల పాలనలో హామీల అమలు నుంచి పాలనా వైఫల్యాల వరకూ జగన్ పాలనా సామర్ధ్యంపై జనంలో భ్రమలు తొలగిపోయాయి. ఇప్పుడు జగన్ మూడేళ్ల పాలనను గత చంద్రబాబు పాలనతో పోల్చి చూస్తున్నారు. ఏ వర్గమూ జగన్ పాలనపై సంతృప్తిని కానీ, సానుకూలతను కానీ ప్రదర్శించడం లేదు. సొంత పార్టీలోనే అసమ్మతి జ్వాలలు భగ్గు మంటున్నాయి. జగన్ ఉచిత పథకాల లబ్ధిదారుల్లోనే...ధరల బాదుడుపై అసహనం వ్యక్త మౌతున్నది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో అంతకు రెండింతలు లాగేసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. రైతులు, ఉద్యోగులు, కార్మికులు, చివరికి బ్యూరోక్రాట్లు సైతం జగన్ తీరుకు విసిగిపోయారు. అన్ని వర్గాలలో అసంతృప్తి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ స్థితిలో వాస్తవ పరిస్థితిని కప్పి పుచ్చుకోవడానికే వచ్చే ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో విజయం అంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలలో సంతుష్ట సూచీని పెంచడానికి నాడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటే...సంతుష్టి సూచీ దిగజారడానికి జగన్ పాలన శతథా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తతం ఏపీలో ఏ వర్గమూ సంతోషంగా ఉన్నట్లు కనిపించదు. పాలనా తీరు కారణంగా సామాన్య జనం, బ్యూరోక్రాట్లు, రైతులు, ఉద్యోగులు ఇలా ఒకటేమిటి అన్ని వర్గాల వారూ అసంతృత్తితో ఉన్నారు. అసహనంతో రగిలిపోతున్నారు. ధరల బాదుడు ఉద్యోగులూ, సమాన్య ప్రజానీకం నెత్తిన గుదిబండగా మారితే...సీఎస్ స్థాయి అధికారి కూడా ముందస్తు అనుమతి లేకుండా సీఎం జగన్ ను కలిసే అవకాశం లేని పరిస్థితి బ్యూరోక్రాట్లలో అసంతృప్తి పేరుకుపోవడానికి కారణమౌతున్నది.
వీటికి తోడు జగన్ మానస పుత్రికగా చెప్పుకునే వలంటీర్ వ్యవస్థ ప్రజలపై పెత్తనం చేసే మరో అధికార కేంద్రంగా తయారైంది. గ్రామ స్థాయిలో వారు చేసే దాష్టీకం ప్రభుత్వంపై అసంతృప్తి స్థాయిని పెంచేల ఉంది.
ఇక జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఉచిత పథకాలు అందుకుంటున్న వారు కూడా సంతోషంగా లేరు. ఒక వైపు ఖాతాలలో సొమ్ములు పడుతున్నా....నిత్యావసరాల ధరలన్నీ కొండెక్కిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నదన్న భావన వారిలో కూడా అసంతృప్తి గూడు కట్టుకోవడానికి కారణమౌతోంది.
ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రహసనం పార్టీలో అసమ్మతి ఎంతటి స్థాయిలో ఉందో తేటతెల్లం చేసేసింది.
ఇలా అన్ని వైపులా రాష్ట్రంలో అసహనం, అసంతృప్తి ఉన్న పరిస్థితిలో విపక్షాలు క్రియాశీలం అయితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే విపక్షాలు ఆ దిశగా దృష్టి పెడుతున్నట్లుగా కనిపించదు.
http://www.teluguone.com/news/content/jagan-covering-defeat-fear-by-saying--will-win-175-out-of-175-39-135118.html





