దేవినేని అవినాష్ ను బుక్ చేసేసిన జగన్!

Publish Date:Feb 19, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ తానేం చేస్తున్నారో తనకే తెలియని స్థితిలో ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిపోయి.. ఏం మాట్లాడుతున్నారో? ఎక్కడ మాట్లాడుతున్నారో? తెలియని అయోమయస్థితికి చేరుకున్నారా? అంటే వైసీపీ క్యాడర్ నుంచే ఔనన్న సమాధానం వస్తోంది. 

జగన్ మంగళవారం (ఫిబ్రవరి 18) విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వల్లభనేని వంశీతో ములాఖత్ ద్వారా భేటీ అయ్యారు. ఆ తరువాత జైలు బయట విలేకరులతో మాట్లాడారు. కూడా తెచ్చుకున్న స్క్రిప్ట్ ను తడబడుతూ చదివేశారు. పేరుగా మీడియా సమావేశం అంటారు  కానీ, ఆ మీడియా సమావేశానికి జగన్ అనుకూల మీడియా ప్రతినిథులు వినా మరెవరూ రావడానికి వీల్లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. అందుకే జిల్లా జైలు వద్ద జగన్ ను మీడియా అడిగిన ప్రశ్నలన్నీ ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి.

సరే జగన్ నోరు తెరిచారంటే చంద్రబాబు, లోకేష్ లపై ఊకదంపుడు విమర్శలు ఉంటూనే ఉంటాయి. విజయవాడ జిల్లా జైలు వద్ద జగన్ ప్రసంగంలో కూడా అవి అలాగే ఉన్నాయి. అయితే ఈ సారి ఆయన ఆవేశంలోనో, అనాలోచితంగానో సొంత పార్టీకి చెందిన దేవినేని అవినాష్ ను ఇరికించేశారు. ఇహనో ఇప్పుడో అవినాష్ అరెస్టు కాక తప్పని పరిస్థితిని స్వయంగా క్రియేట్ చేశారు. జగన్ హయాంలో ఇష్టారీతిగా రెచ్చిపోయి దాడులకు పాల్పడిన కేసుల్లో అవినాష్ కూడా నిందితుడిగా ఉన్నారు.  అయితే ఆ కేసులకు సంబంధించి అవినాష్ అరెస్టు ఇప్పుడప్పేడే ఉండదని అంతా భావిస్తున్నారు. వల్లభనేని వంశీ వంతు అయిపోయింది. తరువాతి వంతు కొడాలి నానిది అని వైసీపీ వర్గాలే భావిస్తున్నాయి. స్వయంగా కొడాలి నాని కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. లోన వణికి పోతున్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అరెస్టులంటే భయం లేదని చెబుతున్నారు.

కానీ దేవినేని అవినాష్ మాత్రం ఎక్కడా నోరెత్తడం లేదు. పార్టీ కార్యక్రమాలలోనూ క్రియాశీలంగా పాల్గొనడం లేదు. చాలా చాలా లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తూ పోలీసుల దృష్టిలో పడకుండా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నక్కినక్కి అన్నట్లుగా రోజులు వెళ్లదీస్తున్నారు. అయితే పార్టీ అధినేత జగన్ వచ్చారు కనుక తప్పదన్నట్లు గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత విజయవాడ జిల్లా జైలు వద్దకూ వెళ్లి జగన్ పక్కన నిలబడ్డారు. అంత మాత్రం దానికే జగన్ త్వరలో అరెస్టు కాబోయే వాళ్లలో దేవినేని అవినాష్ కూడా ఉన్నారని ప్రకటించేశారు. ఇంతకీ ఆయనను ఎందుకు అరెస్టు చేస్తారంటూ ఆయన అందంగా ఉన్నాడు కనక, ఆయనకు ప్రజలలో గ్లామర్ ఉంది కనుక అంతే కాకుండా ఆయన రాజకీయంగా ఎదుగుతున్నారు కనుక అని జగన్ చెప్పారు. అందం, గ్లామర్, రాజకీయంగా ఎదుగుదల విషయాలెలా ఉన్నా.. ఆయనపై కేసులు ఉన్నాయన్న విషయాన్ని జగన్ చాటారు. తద్వారా అరెస్టు చేసే దమ్ముందా? అని పోలీసులకు సవాల్ విసిరారు.  అరెస్టు చేస్తే తాను మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత లెక్క తేలుస్తానని హెచ్చరించారు.  తద్వారా పోలీసులకు ఇక అవినాష్ కేసులపై దృష్టి సారించక తప్పని పరిస్థితి కల్పించారు. జగన్ పక్కనే నిలబడి ఆయన ప్రసంగం విన్న అవినాష్ కచ్చితంగా తలపట్టుకునే ఉంటారు. గుట్టుగా గడుపుతున్న తనను రోడ్డుకు లాగి, అరెస్టయ్యే పరిస్థితికి తీసుకువచ్చినందుకు ఆయన మనసులో జగన్ ను తిట్టుకునే ఉంటారు.   

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.