Publish Date:Feb 24, 2025
జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. తనతో పాటు తన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలనూ వెంటపెట్టుకుని మరీ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోకి నాలుగో గేటులోంచి కారులో రావడం నుంచి లోపలకు వచ్చిన తరువాత నినాదాల వరకూ అంతా ఆ పార్టీ ముందుగానే నిర్ణయించుకు వచ్చిన డ్రామాగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కేవలం అనర్హతా వేటు నుంచి తప్పించుకోవడానికే జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరౌతున్నారన్న పరిశీలకుల విశ్లేషణలు, తెలుగుదేశం, జనసేన నేతలు, క్యాడర్ విమర్శలను అక్షరసత్యాలు అన్న విషయాన్ని రుజువు చేసే విధంగానే జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేల తీరు ఉంది. వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులు ఉన్నారు.
సోమవారం సభకు హాజరైన వైసీపీ సభ్యులు సరిగ్గా 11 నిముషాలు మాత్రమే సభలో ఉన్నారు. ఉన్న ఆ కొద్ది సమయం కూడా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారి ఆందోళనను, నినాదాలను సభలో కూటమి సభ్యలు ఎవరూ పట్టించుకోలేదు. సభా నాయకుడు చంద్రబాబు కూడా వారి చిరునవ్వులు చిందిస్తూ.. ఈ డ్రామాలన్నీ మాకు అర్ధమౌతున్నాయన్నట్లు కూర్చున్నారు. దీంతో చేసేదేం లేక జగన్ తన సభ్యులతో సహా అసెంబ్లీని బాయ్ కాట్ చేసి గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేశారు.
జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతున్నట్లు ఆ పార్టీ ప్రకటించిన మరుక్షణం నుంచీ, సర్వత్రా జగన్ హాజరు కేవలం తన శాసనసభా సభ్యత్వాన్ని కాపాడుకోవడానేనన్న భావన వ్యక్తమైంది. జగన్ తరహా అంతా అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్న తరహాలోనే ఉంటుందంటూ రాజకీయవర్గాలలో గట్టిగా వినిపించింది. ఒక రోజు భాగ్యానికే తప్ప జగన్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనే అవకాశాలు లేవన్న విశ్లేషణలు వినిపించాయి. వాటికి అనుగుణంగానే అనర్హతా వేటు నుంచి తప్పించుకోవడం కోసమే వైసీపీ సభ్యలు సోమవారం (ఫిబ్రవరి 24) అసెంబ్లీకి వచ్చినట్లే వచ్చి వాకౌట్ చేశారు. మళ్లీ అరవై రోజుల వరకూ వారు అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. అనర్హతా వేటు పడి.. ఉప ఎన్నికలు వస్తే ప్రస్తుతం ఉన్న 11 స్థానాలూ కూడా కోల్పోతామన్న భయంతోనే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని సభకు వచ్చారని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-attend-assembly-only-for-attendence-39-193324.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.