ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ విషయపరిజ్ణానం..డీఎస్సీ, ఏపీపీఎస్సీ ఒకటేనట.!
Publish Date:Aug 20, 2026
Advertisement
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరో సారి తన అజ్ణానాన్ని బయటపెట్టుకుని ట్రోలింగ్ కు కేంద్ర బిందువయ్యారు. పాపం జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు అంటూ నెటిజనులు ఆటపట్టిస్తున్నారు. గురువారం (ఆగస్టు 20) మీడియాతో మాట్లాడిన జగన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)కి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్( ఏపీపీఎస్సీ) రెండూ ఒకటేనని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈయనా ఏపీ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు వెలగబెట్టారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మెగా డీఎస్సీపై విమర్శలు గుప్పించే క్రమంలో ఆయన తన అజ్ణానాన్ని బయటపెట్టుకున్నారు. ఓ వైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పారదర్శనంగా నిర్వహించామని చెబుతూ.. పక్కా ఆధారాలు చూపుతున్నా.. డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ వేసిన పిటిషన్లను కోర్టులు డిస్మిస్ చేసినా.. జగన్ మాత్రం తన మీడియా సమావేశంలో మెడా డీఎస్సీలోఅక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ఐటీ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంత వరకూ అయితే ఓకే.. కానీ ఆయన ఆ క్రమంలో అసలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీచర్ రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ రెండూ ఒకటేనన్నారు. తన హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ, తెలుగుదేశం హయాంలో నిర్వహించిన డీఎస్సీ ఒకటేనన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు పని చేసిన జగన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరిజ్ణానం కూడా లేకపోవడమే ఆయన హయాంలో పాలన ఎంత ‘దివ్యం’గా సాగిందో తేటతెల్లం చేస్తోందంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. ఒక మాజీ సీఎం అయ్యి ఉండి కూడా ఏపీపీఎస్సీ, డీఎస్సీలకు మధ్య ఉన్న వ్యత్యాసం తెలియపోవడమేంటని నిరుద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పైగా జగన్ తన అజ్నానాన్ని, విషయపరిజ్ణానం లేని తనాన్ని బయటపెట్టుకుంటూ డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండూ ఒకటేనని చెబుతున్న సమయంలో ఆయనను కరెక్ట్ చేయడానికి పక్కనే ఉన్నవారు ఎంత ప్రయత్నించినా జగన్ మాత్రం రెండూ ఒకటే కదా అంటూ వారిని నోరుమూయించారు. నెటిజనుల ట్రోలింగ్, నిరుద్యోగల విమర్శలు పక్కన పెడితే.. జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్.. ప్రెస్ మీట్ క్లిప్పింగ్ లను షేర్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు. పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఏల్ల తరబడా గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతుంటే, మాజీ సీఎం, పైగా ప్రతిపక్ష హోదా కావాలంటూ మంకుపట్టు పడుతున్న జగన్ కు ఏపీపీఎస్సీ, డీఎస్సీల మధ్య ఉన్న తేడా తెలియకపోవడం విస్మయం గొలుపుతోందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం జగన్ చేసిన ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటే అన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారడమే కాదు.. జగన్ ప్రతిష్టను దిగజార్చాయి. Jagan APPSC DSC comments, Nara Lokesh trolls Jagan, AP Mega DSC news, Jagan press conference, Andhra Pradesh, TeluguOne
http://www.teluguone.com/news/content/jagan-appsc-dsc-comments-25-229407.html





