ఎదురుదాడి ఒక్కటే జగన్ ఎజెండా?

Publish Date:Dec 20, 2023

Advertisement

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించడమే కాదు 2020లో అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్టున్నట్లు అసెంబ్లీ సాక్షిగా చట్టం కూడా చేశారు. అయితే న్యాయస్థానాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడంతో చివరికి  జగన్ సర్కార్ స్వయంగా  ఆ చట్టాన్ని వెనక్కు తీసుకుంది.

అయితే ఇప్పటికీ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే జగన్, ఆయన పార్టీ నేతలూ చెబుతూ వస్తున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. ఇక మరో మూడు నెలలలో ఎన్నికలు కూడా వస్తున్న తరుణంలో మూడు రాజధానుల మాట ఉత్తి ముచ్చటే అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.  ప్రస్తుతం   మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండగా.. అక్కడ తీర్పు వచ్చే వరకూ ఈ అంశంపై  ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఇసుమంతైనా లేదు. దీంతో రాజధాని అనే మాట లేకుండా సీఎం జగన్ విశాఖ నుండి పరిపాలన  అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అందు కోసం నిబంధనలను తుంగలోకి తొక్కి రుషికొండకు బోడిగుండు కొట్టి మరీ నిర్మాణాలు చేపట్టారు. అంతే అంతకు మించి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేకపోయారు.  

కనీసం సీఎం క్యాంప్ ఆఫీసు కూడా విశాఖకు మార్చ లేకపోయారు. సీఎం మకాం మార్చేస్తున్నారని ఇదిగో అదిగో అంటూ ముహుర్తాలైతే మారుతున్నాయి  కానీ.. జగన్ తాడేపల్లి ప్యాలెస్ గడప మాత్రం దాటలేదు. పైగా రుషికొండపై కట్టడాలకు కూడా అనుమతులను ఉల్లంఘించి, పరిధి మించి నిర్మించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ లూ కూడా తాము విశాఖకు మకాం మార్చేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఇక రుషికొండ కట్టడాల వివాదం కోర్టుకు చేరింది. జగన్ విశాఖ కాపురం అయ్యేదీ పెట్టేదీ లేదని తేటతెల్లమైపోయింది. అసలు మొత్తంగా జగన్ ఇంత కాలం చెబుతున్న మూడు రాజధానుల ముచ్చట, విశాఖ నుండి  పాలన అన్నది జరిగే పని కాదని విస్పష్టంగా తేలిపోయింది.     

నిజానికి జగన్ కు, ఆయన సర్కార్ కు మూడు రాజధానుల వ్యవహారంపై  స్పష్టత లేదు. చేసిన చట్టంలోనూ, వెనక్కు తీసుకున్న చట్టంలో నూ కూడా మూడు రాజధానులు అనే మాటే లేదు. అమరావతి, విశాఖ, కర్నూలులో రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినా.. అలా చెప్పిన స్వల్ప వ్యవధిలోనే జగన్ సర్కార్ కర్నూలు ఊసెత్తడం మానేసింది. న్యాయరాజధాని అన్నది తమ ఎజెండాలోనే లేదని కోర్టుకు విన్నవించింది.  ఇక జగన్ కేబినెట్ లోని కొందరు మంత్రులైతే..   అసలు మూడు రాజధానుల ప్రతిపాదన, ప్రస్తావనే ప్రభుత్వం చేయలేదనీ, ఉండేది ఒకే ఒక్క రాజధాని అది విశాఖ అంటూ బాహాటంగా చెప్పారు. బహిరంగ ప్రకటనలు చేశారు.  దీంతో ఏపీ రాజధాని అనేది అమరావతి  వర్సెస్ విశాఖ అనేలా మారిపోయింది. ప్రభుత్వం విశాఖను రాజధాని చేయాలని చూసినా అది చట్ట ప్రకారం వీలు కాదని తేలిపోయింది.  ఈ విషయం జగన్ కు ముందే తెలిసినా, కేవలం అమరావతిని పాడుబెట్టడం కోసం, అమరావతిపై విషం చిమ్మడం కోసం మాత్రమే విశాఖను తెరపైకి తెచ్చినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కాగా, ఇప్పుడు మొత్తానికి వైసీపీ మూడు రాజధానుల నాటకానికి తెరదించే సమయం ఆసన్నమైంది. నెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సర్కార్ మూడు రాజధానులు అన్న మాట ఎత్తే ధైర్యం చేయదు. అలాగే విశాఖకు జగన్ అన్న మాట కూడా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నికలలోపు ఇది జరిగే అవకాశం లేదని స్వయంగా జగన్ సర్కారే కోర్టుకు చెప్పింది.  దీంతో ఇక ఇప్పుడు జగన్ సర్కార్ కు, ఆయన పార్టీకి మిగిలిన ఆప్షన్ ఎదురుదాడి మాత్రమే.  తామేదో ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తే.. ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అడ్డుకున్నాయని వైసీపీ నేతలు అటాక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మనసంతా విశాఖ మీదనే ఉందని.. విశాఖ నుండి పరిపాలన సాగించి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్నదే ఆయన అభిమతమని చెప్పుకుంటున్నారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సమాంతరంగా అభివృద్ధి చేసి అందరికీ న్యాయం చేయాలని జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే..   ప్రతిపక్షాలు రూపంలో దుష్టశక్తులుఅడ్డుకున్నాయనే ఎదురుదాడి ఎజెండాతో వైసీపీ రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే, అంగ బలం, అర్ధ బలం, ఆర్ధిక బలం, అధికారం అన్నీ చేతిలో ఉన్నా చేయలేకపోయామని వైసీపీ నేతలు చెప్పే మాటలు ప్రజలు ఎంత వరకు నమ్ముతారన్నది చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.