జగన్ సమైక్యగానం ఓట్లు సీట్లకోసమేనా?

Publish Date:Nov 30, 2013

Advertisement

 

 

ఊహించినట్లే వైకాపా నేతల సమిష్టి కృషివల్ల శనివారం సాయంత్రం కుప్పంలో జరిగిన జగన్ సమైక్య సభకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఈ సభలో అతని సమైక్యాంధ్ర ఉద్యమం యొక్క అసలు ఉద్దేశ్యాలు కూడా అతనే మరోసారి స్వయంగా బయట పెట్టుకొన్నాడు.

 

ప్రస్తుతం డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ చకచక జరిగిపోతూ, వచ్చే ఎన్నికలలోగానే రాష్ట్ర విభజన చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంటే, అతను రాబోయే ఎన్నికలలో తనకి 30 యంపీ సీట్లు ఇస్తే రాష్ట్రాన్నివిడగొట్టకుండా ఆపుతానని హామీలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

ఎన్నికల వరకు రాష్ట్ర విభజన జరుగకపోతే అతను చెపుతున్న మాటలకి అర్ధం ఉంటుంది. కానీ ఒకవేళ ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగిపోయి, అధికారికంగా రెండు రాష్ట్రాలు ఏర్పడిపోయిన తరువాత, అతనిని గెలిపిస్తే విడిపోయిన రెండు రాష్ట్రాలను ఏవిధంగా సమైక్యపరచగలరో కూడా అతను వివరించి ఉంటే బాగుండేది.

 

తను కోరుకొన్న విధంగా 30 యంపీ సీట్లు ఇచ్చి ప్రజలు తన పార్టీని గెలిపిస్తే, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పార్టీకే మద్దతు ఇచ్చి, మనకు నచ్చిన వ్యక్తినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదామని అతను ప్రజలకు చెప్పడం అతని అహంభావానికి నిదర్శనం. ఇంకా ఇది సమైక్య రాష్ట్రమే గనుక, తెలంగాణాను కూడా వదులుకొన్న వైకాపా ఇప్పుడు కనీసం ప్రాంతీయ పార్టీ కూడా కాదు. ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకు పోయింది. అటువంటి పార్టీకి అధ్యక్షుడయిన అతను కేంద్రంలో ప్రధానిగా ఎవరుండాలో, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలో తనే స్వయంగా నిర్ణయిస్తానని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం.

 

ఇక నేడు కూడా అతను మళ్ళీ 30 యంపీ సీట్లు గురించే మాట్లాడటం గమనిస్తే, అతను చేసేది సమైక్యవాదన, కానీ ఆలోచనలు మాత్రం ఓట్లు, సీట్ల గురించేనని అర్ధం అవుతుంది. అంటే సమైక్యవాదం ముసుగులో సీమాంధ్రలో తన పార్టీని బలపరచుకొని రానున్న ఎన్నికలలో అన్ని యంపీ, యం.యల్యే. సీట్లు గెలిచేసి రాష్ట్రంలో, కేంద్రంలో తానే చక్రం తిప్పేయాలని ఆత్రం అతని ప్రతీ మాటలో వ్యక్తం అవుతోంది.

 

మరో ఆసక్తికరమయిన సంగతి ఏమిటంటే సీమాంధ్రలో ఉన్నవి కేవలం 26యంపీ సీట్లు మాత్రమే, కానీ అతను 30 సీట్లు గెలుస్తామని చెపుతున్నారు. మరి మిగిలిన ఆ 4 యంపీ సీట్లు ఎక్కడివి? అంటే బహుశః సీమాంధ్ర ప్రజలు అధికంగా నివసిస్తున్న హైదరాబాద్ జంటనగరాలలో ఉన్న 3 సీట్లు, ఖమ్మంలో ఉన్న ఒక్కసీటు తామే గెలుస్తామని అతను భావిస్తున్నారేమో?

 

ఒక రాజకీయ పార్టీ అధినేతగా జగన్ తన పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పులేదు. అయితే అందుకు అతను ఎంచుకొన్నవిధానమే చాలా తప్పు. ఒకప్పుడు తెరాస తెలంగాణా ఉద్యమాలతో ఏవిధంగా రాజకీయంగా బలీయమయిన శక్తిగా ఎదిగిందో, తెలంగాణా సెంటిమెంటుని వాడుకొని ఏవిధంగా ఎన్నికలలో లబ్ది పొందిందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా ప్రజలలో బలంగా ఉన్నసమైక్యభావనలను వారి బలహీనతగా భావిస్తూ సమైక్యవాదం పేరుతో ఎన్నికలలో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. అది కూడా రాష్ట్ర విభజన జరిగిపోతున్న ఈ తరుణంలోనేకాక, విడిపోయిన తరువాత కూడా సమైక్య సెంటిమెంటుతో ఓట్లు పిండుకోవాలని అనుకోవడం చాలా హేయమయిన రాజకీయం.

 

నిజం చెప్పాలంటే సీమాంధ్రలో కాంగ్రెస్, తెదేపాలకు ఎటువంటి బలమయిన క్యాడర్ ఉందో, అదేవిధంగా కారణాలేవయినప్పటికీ జగన్ని అభిమానించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అటువంటప్పుడు అతను చెప్పుకొంటున్న నీతి, నిజాయితీలతో కూడిన రాజకీయాలు చేసుకొంటే, వారే కాదు ఇతరులు కూడా అతని వైపు ఆకర్షితులయ్యే వారేమో! కానీ అతని ఆలోచనా విధానము, వ్యవహార శైలి ఎప్పుడూ విచిత్రమే, అనుమానాస్పదమే. నేటి సభలో అతను పలికిన మాటలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

 

నిజానికి అతను సమైక్యాంధ్ర కోసం ఈ సభ నిర్వహించి ఉంటే, రేపటి నుండి మళ్ళీ పెద్ద ఎత్తున ప్రజాఉద్యమాలు మొదలుపెడదామని ప్రజలకు పిలుపు ఇచ్చి ఉండాలి. కానీ, 30 యంపీ సీట్ల గురించి, డిల్లీలో చక్రం తిప్పడం గురించి మాట్లాడారు.

 

ఎన్నికలలో తన పార్టీ గెలిచేందుకు అతను ఈవిధంగా సమైక్యసభలో, ఓదార్పు సభలో నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నించే బదులు, ముందుగా తన పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసుకొని, ఆ తరువాత ప్రజలవద్దకు వెళ్లి ఈ డొంక తిరుగుడు మానుకొని, నేరుగా తనకే ఓటేసి గెలిపించమని, తన పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేయాలనుకొంటున్నారో చెప్పుకొంటే అతను పోగొట్టుకొన్న ‘విశ్వసనీయత’ మళ్ళీ పెరిగి, రానున్న ఎన్నికలలో విజయం సాధించవచ్చునేమో! కానీ, ఈవిధంగా ప్రజల బలహీనతమీద ఆడుకొని అడ్డు దారిలో విజయం సాధించాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

By
en-us Political News

  
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.