కాంగ్రెస్ తో పొత్తుపై జగన్... మౌనం అంగీకారమేనా?.. రగిలిపోతున్న కమలం

Publish Date:Apr 25, 2022

Advertisement

మామూలుగా మౌనం అర్ధాంగీకారం.. అయితే కాంగ్రెస్ తో పొత్తు విషయంలో వైసీపీ  అధినేత  జగన్ మౌనంపై మాత్రం బీజేపీ రగిలిపోతోంది. ఆ మౌనం సంపూర్ణాంగీకారమే అని చిర్రుబుర్రులాడుతోంది. రాష్ట్రంలో బలమైన పార్టీని కాదనుకుని 2019 ఎన్నికలలో బీజేపీ పొత్తు లేకపోయినా అన్నిందాలా మద్దతు ఇచ్చిన  సంగతిని గుర్తు చేసుకుని రగిలిపోతున్నది. అంతే కాకుండా అధికారంలో ఉన్న ఈ మూడేళ్లు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన ఆర్థిక అవకతవకలను సమర్ధిస్తూనో, లేదా చూసీ చూడనట్లు వదిలేసో సహకరించిన కమల నాథులకు ఇప్పుడు వైకాపా రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్త పెట్టుకోవడం మింగుడుపడటం  లేదు. ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనలపై వైసీపీ నుంచి ఎటుంటి సానుకూల స్పందనా ఇప్పటి వరకూ రాకపోయినా, ఎలాంటి వ్యతిరేక ప్రకటన కూడా చేయకుండా జగన్ పాటిస్తున్న వ్యూహాత్మక మౌనంపై బీజేపీ గుర్రుగా ఉంది.

ఆ కారణంగానే ఇప్పటి వరకూ ఈ మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలపై ఓ కన్నేసుంచాలని నిర్ణయించుకుంది. అంతే కాకుండా నిబంధనలను కాదని ఒక్కరూపాయి కూడా అప్పు పట్టకుండా చక్రబంధంలో బిగించేసింది. బీజేపీలోని ఒక వర్గం కథనం ప్రకారం జగన్ కు రాజకీయ ప్రయోజనలంటూ ఏమీ ఉండవనీ, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి మద్దతుగా ఉంటూ తన కేసుల నుంచి తప్పించుకోవడమే ప్రధాన లక్ష్యం. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికలలో అధికారం చేపట్టనున్నది కాంగ్రెస్ అని నమ్మబలుకుతుండటంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని బీజేపీ భావిస్తున్నది.

ఇంత కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అంటకాగి, ఇప్పడు కాంగ్రెస్ తో పొత్తు విషయంలో వ్యూహాత్మక మౌనం పాటించడమంటే.. కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ సర్కార్ అన్న సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వడమేనని బీజేపీ భావిస్తున్నది. జగన్ కు ఇంత కాలం అండగా నిలిచిన కమలం.. అందుకు ప్రతిఫలంగా రాష్ట్రంలో ఏదో ఒక మేర బలోపేతం కావాలని భావిస్తున్నది. మరో సారి కేంద్రంలో మోడీ సర్కార్ అధికార పగ్గాలు చేపడుతుందన్న నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలలో కలిగించగలిగితేనే అది సాధ్యమౌతుంది. ఇంత కాలం అనధికార మిత్ర పక్షంగా ఉన్న వైసీపీ పక్క చూపులు చూస్తే జనం కేంద్రంలో బీజేపీ పనై పోయిందనీ, అందుకే జగన్ పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తోందన్న నిర్ధారణకు వచ్చేస్తారు. అంతే కాదు ఈ ప్రభావం దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాలపై పడే అవకాశం ఉంది. ఎందు కంటే జగన్ కు రాజకీయాలు, అధికారం తనపై ఉన్న కేసుల భయం లేకుండా ఒక కవచంలా వాడుకునేందుకేనని తెలియని వారెవరూ లేరు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి మద్దతుగా నిలవకుంటే ఇబ్బందులు తప్పవని తెలిసిన స్థిత ప్రజ్ణత జగన్ ఉంది కనుకే ఆయన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదని తెలసినా బీజేపీకి మద్దతుగా నిలబడ్డారు. రైతులలో వ్యతిరేకత పెల్లుబుకుతుందని తెలసీ...వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు కేంద్రం కోరడమే తరువాయ ఆమోదం తెలిపేశారు. రైతు లోకం అంతా వ్యతిరేకిస్తోందని తెలిసీ వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికారు. అటువంటి జగన్ ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు అన్న ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనను వ్యతిరేకించకుండా మౌనంగా ఉండటం, విజయసాయి వంటి నాయకులు పొత్తుకు జగన్ సానుకూలం అనే అర్ధం వచ్చేలా మాట్లాడటం చూస్తుంటే.. కాంగ్రెస్ తో పొత్తు విషయంలో జగన్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు అవగతమౌతుంది. అదే ఇప్పుడు బీజేపీ గుర్రుకు కారణం అని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఇక ముందు కేంద్రంలోని మోడీ సర్కార్ జగన్ సర్కర్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.