టాబ్లెట్ పట్టు.. కరోనా పట్..
Publish Date:May 11, 2021
Advertisement
ఒకటి కాదు, రెండు కాదు. దాదాపు సంవత్సరం పైగా అందరినోట ఒకటే మాట, అదే కరోనా మాట. ఏ ఇంట చూసిన ఒక్కటే చావు, అదే కరోనా చావు. కరోనా వల్ల దేశం అతలాకుతం అవుతుంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ మాయదారి కరోనా వల్ల. ఇప్పటికి దేశవ్యాపితంగా వేలమంది మృతి చెందుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ వ్యాపితంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా విలయం వల్ల ప్రజల్లో భయాందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక కరోనా కి చెక్ పెడుతామంటున్నారు శాస్త్రవేత్తలు. అదెలా అనుకుంటున్నారా.. అదే ఐవర్‌మెక్టిన్. ఐవర్‌మెక్టిన్ అంటే ఏంటని అనుకుంటున్నారా..? మీరే చూడండి. ఐవర్‌మెక్టిన్ అంటే నోటి ద్వారా తీసుకునే ఔషధంతో కరోనా దరిచేరకుండా చూసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. వివిధ పరాన్న జీవులతో సంక్రమించే ఇన్ఫెక్షన్లను నయం చేసేందుకు ఉపయోగించే దీనితో కొవిడ్‌కు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన ‘ఫ్రంట్‌లైన్ కొవిడ్-19 క్రిటికల్ కేర్ అలయెన్స్’ (ఎఫ్ఎల్సీసీసీ) సంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 2500 మందిపై నిర్వహించిన అధ్యయనంలో కొవిడ్ నివారణలో ఐవర్‌మెక్టిన్ సమర్థంగా పనిచేస్తుందని తేలింది. క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని తీసుకున్న వారిలో కరోనా సోకే ప్రమాదం గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. కొవిడ్ బాధితులపైనా ఇది అద్భుతంగా పనిచేస్తుందని 42 ప్రయోగాల డేటాను విశ్లేషించినప్పుడు తేలిందని ఎఫ్ఎల్సీసీసీ అధ్యక్షుడు పీయర్ కోరీ తెలిపారు. కొవిడ్ బాధితుల్లో మరణాన్ని ఈ ఔషధం ఆపుతుందని పేర్కొన్నారు. అలాగే శరీరంలో ఉన్న వైరస్‌ను ఇది వేగంగా నిర్మూలిస్తుందని వివరించారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ థెరాప్టిక్స్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
http://www.teluguone.com/news/content/ivermectin-for-covid-39-115196.html





