ట్రంపరితనంపై మండి పడ్డ ఇటలీ!.. మెలోనీపై అగ్రరాజ్యాధినేత వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన

Publish Date:Jun 20, 2026

Advertisement

అంతర్జాతీయ రాజకీయ వేదికలపై దేశాధినేతల మధ్య నడిచే దౌత్య సంబంధాలు ఒక్కోసారి ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనానికి దారితీశాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గుడ్ ఫ్రెండ్ గా గుర్తింపు పొందిన ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనిని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దౌత్యపరమైన ఉద్రిక్తతలను పెంచాయి. ఇటీవల జరిగిన జీ7  సదస్సులో పీఎం జార్జియా మెలోని తనతో సెల్ఫీ దిగడానికి ఎంతో ఆరాటపడిందని, ఆమెను చూసి జాలిపడి మాత్రమే తాను ఆ  సెల్ఫీకి అంగీకరించానంటూ ట్రంప్ ఒక ఇటాలియన్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒక దేశ మహిళా ప్రధానమంత్రిని ఉద్దేశించి, అగ్రరాజ్యాధినేత ఈ తరహాలో మాట్లాడటం  వివాదాస్పదంగా మారింది.

అయితే..    ట్రంప్   వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, కల్పిత కథలని ఇటలీ ప్రభుత్వం  కొట్టిపారేసింది. ఈ దౌత్య అవమానానికి నిరసనగా జూన్ 21, 22 తేదీల్లో ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తాజాని చేపట్టాల్సిన అధికారిక అమెరికా పర్యటనను తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ప్రధాని పట్ల ట్రంప్ మాట్లాడిన తీరు అత్యంత అవమానకరమని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల పర్యవసానాలు ఇప్పుడు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

ఈ వివాదంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా  ఘాటుగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమని..  ఆయన మాటలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని మెలోని అన్నారు.  అమెరికా అధ్యక్షుడు  మిత్రదేశాల అధినేతలతో ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తారో తనకు అర్థం కావడం లేదన్న మెలోనీ.. ఇలా జరగడం ఇది మొదటిసారేమీ కాదని  అసహనం వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల, అమెరికా ప్రత్యర్థుల పట్ల చూపించని మొండితనాన్ని, మిత్రదేశాలపై చూపించడం ట్రంప్‌కు తగదని మెలోని  విమర్శించారు. శత్రువుల విషయంలో ఎంతో మృదువుగా వ్యవహరించే ట్రంప్..  మిత్రులపై ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయడం శోచనీయమన్నారు.

 తాను కానీ, తన దేశం ఇటలీ కానీ ఎవరి ముందూ ఎన్నటికీ మోకరిల్లవు, దేనికోసం యాచించవు అని మెలోనీ పేర్కొన్నారు. ఇటలీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ప్రధాని మోదీతో కలిసి దిగిన సెల్ఫీలు, వారి మధ్య ఉన్న దౌత్యపరమైన స్నేహం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మెలోనిపై, ట్రంప్ లాంటి అగ్రనేత చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ట్రంప్ తీరు  అంతర్జాతీయ దౌత్య నీతికే మచ్చ తెచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
హైదరాబాద్‌లో సంచలన గోల్డ్ స్కామ్...
వేటకు వెళ్లిన కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలలకు అరుదైన మత్స్య సంపద చిక్కింది. వారు వేసిన వలలో ఏకంగా లక్షల రుూపాయల విలువైనఅరుదైన కచిడి చేపలు మూడు చిక్కాయి. చాలా రోజుల విరామం తర్వాత సముద్రంలోకి వెళ్లిన తొలి వేటలోనే ఇలాంటి అరుదైన చేపలు వలకు చిక్కడంతో ఆ మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం..
పాలమూరు జిల్లా దేవరకద్ర వద్ద డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్ ప్రతిపాదించిన కీలక రక్షణ ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రక్షణ మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధి, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్రంతో సమన్వయంతో ముందుకు సాగుతామని చెప్పారు.
మూసీ నది పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది.
బంగ్లాదేశ్‌పై 3 0తో ఆస్ట్రేలియా టి20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత, ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్ సుజుకి బైక్‌పై స్టేడియం అంతా చక్కర్లు కొట్టి అభిమానులను అలరించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు వైరల్ వీడియో విశేషాలు ఇక్కడ చూడండి.
చిన్నజాప్యాన్ని సహించలేని రాజబాబు కోపంతో విచక్షణ కోల్పోయిన రాజబాబు తల్లి నాగమణిపై దాడి చేశాడు. పూజగదిలో ఉన్న చెక్క బల్లకు అమె తలను గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అయినా కొడుకు రాజబాబు ఆమెను పట్టించుకోలేదు.
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) వల్ల సమాజానికి కలగబోయే నష్టాలపై ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు మరియు ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ వ్యక్తపరిచిన ఆందోళనలు, భవిష్యత్తులో ఉద్యోగాల కోత, యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ (UBI) పై ప్రత్యేక విశ్లేషణ.
రియాసత్ లైఫ్‌స్టైల్ ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓ చివరి రోజు సబ్‌స్క్రిప్షన్ వివరాలు, లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP), షేర్ల అలాట్‌మెంట్ మరియు టెంటేటివ్ లిస్టింగ్ తేదీల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ డెట్రాయిట్ ప్లాంట్ లో 1000 మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో 50 కోబోట్ రోబోలను ప్రవేశపెట్టింది. టెక్నాలజీ మరియు ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్న కార్మికుల గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆసియా-పసిఫిక్ రీజియన్‌లోనే తొలిసారిగా హాంకాంగ్ వేదికగా 2027 పూమా హైరాక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ (PUMA HYROX World Championships) జరగనున్నాయి. దీనికి సంబంధించిన తేదీలు, వేదిక మరియు అద్భుతమైన రికార్డుల వివరాలు మీకోసం.
ప్రముఖ మార్కెట్ నిపుణులు ఆశిష్ చతుర్మోహతా విశ్లేషణ ప్రకారం స్టాక్ మార్కెట్ తదుపరి ర్యాలీని నడిపించే బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, మరియు మిడ్‌క్యాప్ సెక్టార్ల పూర్తి వివరాలు మీకోసం
WHOOP ఫిట్‌నెస్ ట్రాకర్ ఎలా పనిచేస్తుంది? స్ట్రెయిన్, రికవరీ మరియు స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లతో మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.