డొనాల్డ్ ట్రంప్ కు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని షాక్.!

Publish Date:Jul 9, 2026

Advertisement

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల మధ్య ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీసుకున్న  నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న సైనిక దాడులకు తాము ఎంతమాత్రం సహకరించబోమని..  ఇటలీలో ఉన్న తమ సైనిక స్థావరాలను అమెరికా ఇరాన్ పై  దాడుల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతించే ప్రసక్తే లేదని జార్జియా మెలోనీ విస్ఫష్టంగా తేల్చి చెప్పారు. 

టర్కీ రాజధాని అంకారా వేదికగా జరుగుతున్న నాటో  సదస్సులో పాల్గొన్న జార్జియా మెలోని, ప్రపంచ దేశాల ప్రతినిధులు, మీడియా సమక్షంలో  ఇరాన్ పై దాడులకు సహకరించే ప్రశక్తే లేదని ప్రకటించి అగ్రరాజ్యాధినేత ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చారు.  పశ్చిమాసియా సంక్షోభంపై ఇటలీ  మొదటి నుండి ఒకే స్థిరమైన విధానాన్ని అవలంబిస్తోందన్న ఆమె.. భవిష్యత్తులోనూ తాము ఇలాంటి దాడుల్లో  భాగస్వాములం కాబోమని కుండబద్దలు కొట్టారు. 

 జార్జియా మెలోని చేసిన ఈ సంచలన ప్రకటన వెనుక ఒక బలమైన రాజకీయ ఘర్షణ దాగి ఉంది. ఈ నాటో సదస్సుకు కేవలం ఒక రోజు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటలీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇవ్వడానికి ఇటలీ నిరాకరించడం ఆ దేశం చేస్తున్న  ఘోరమైన తప్పదిమంటూ బహిరంగంగా మండిపడ్డారు.   అమెరికా లాంటి అగ్రరాజ్యం అధినేత నేరుగా తమ విధానాన్ని తప్పుబడుతూ విమర్శలు చేసినప్పటికీ..  జార్జియా మెలోని తగ్గేదే లే అన్నట్లుగా..  నాటో సదస్సు వేదికగానే అమెరికాకు, ట్రంప్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ జాతీయ ప్రయోజనాలు, శాంతి స్థాపనే తమకు ముఖ్యమని ఇటలీ ప్రధాని విస్పష్టంగా చెప్పారు.

పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో, అమెరికా వ్యూహంతో తాము ఏకీభవించడం లేదని నాటో సభ్యదేశమైన ఇటలీ  బహిరంగంగా ప్రకటించడం అంతర్జాతీయ దౌత్య వర్గాలను విస్మయానికి గురిచేసింది. సాధారణంగా నాటో కూటమిలో అమెరికా నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్లడానికి చాలా దేశాలు వెనుకాడతాయి. కానీ..  ఇటలీ ప్రధాని మెలోని మాత్రం ట్రంప్ విమర్శలు చేసినా, తమ దేశ సార్వభౌమాధికారాన్ని,  స్థిరమైన విదేశాంగ విధానాన్ని కాపాడుకోవడానికే మొగ్గు చూపారు. ఈ పరిణామం అమెరికా , ఇటలీ  మధ్య  ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందా అన్న ఉత్కంఠ ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నది.  అగ్రరాజ్యం ఒత్తిళ్లకు తలొగ్గకుండా మెలోని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు ఇటలీ దేశ ప్రజల్లోనూ, అటు అంతర్జాతీయంగా యుద్ధ వ్యతిరేక శక్తుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. అన్ని వర్గాల నుంచీ మెలోనీకి మద్దతు పెరుగుతోంది.  

Italy Iran strikes, NATO Summit Ankara, US Italy relations, West Asia tensions

By
en-us Political News

  
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీకి చెందిన ఆదివాసీలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లోని గిరిజన జిల్లాలను, సరిహద్దు గ్రామాలను అన్నింటినీ ఒకే చోటికి చేర్చి, ఒక సమగ్రమైన గిరిజన రాష్ట్రంగా మార్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.
చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి.. రాబోయే తరాలకు ఆయన ఆశయాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది.
ఏపీలో తల్లికి వందనం పథకం కింద జూలై 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ కానున్నాయి. అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు వర్తించే కొత్త రూల్స్, బడ్జెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవిని తిరస్కరించి, ఆర్‌సీబీతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి.
సరైన రహదారి లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా బొడ్డుమామిడి గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించింది. దీంతో దశాబ్దాల ల సాకారమవుతుండటంపై గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
జూలై 18 నాటి న్యూయార్క్ టైమ్స్ కనెక్షన్స్ పజిల్ గేమ్ 1133 హింట్స్ మరియు ఖచ్చితమైన సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. మీ విన్నింగ్ స్ట్రీక్‌ను సులభంగా కాపాడుకోండి.
అమెరికాలో ఏఐ కంపెనీల సంపద పంపిణీపై సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది. కంపెనీల స్టాక్‌లో 50 శాతం వాటాను పబ్లిక్ వెల్త్ ఫండ్‌కు బదిలీ చేయాలనే ప్రతిపాదనకు 69% మంది ప్రజలు మద్దతు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సబ్‌స్క్రైబర్లలో భారీ మార్పు! మొదటి సీజన్ తర్వాత 70 శాతానికి పైగా వ్యూయర్స్ షోలను ఎందుకు వదిలేస్తున్నారో బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ షాకింగ్ నిజాలను బయటపెట్టింది.
భారతదేశంలో యూపీఐ UPI చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ MDR ఛార్జీలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.2,000 దాటిన లావాదేవీలపై గరిష్టంగా 0.5 శాతం కంటే తక్కువ ఛార్జీ విధించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మరియు దీనివల్ల ఎవరిపై ప్రభావం పడుతుందో ఇక్కడ చదవండి.
ఆసుపత్రిలో చేరినప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సులభంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా సెటిల్ అవ్వడానికి అడ్మిషన్ నుండి డిశ్చార్జ్ వరకు పాటించాల్సిన 10 అద్భుతమైన మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా, టీసీఎస్ అద్భుత ఫలితాలు మరియు బ్యాంకింగ్ షేర్ల భారీ కొనుగోళ్ల వల్ల శుక్రవారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీల పూర్తి అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
గత 20 ఏళ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడిని 22 రెట్లు పెంచి, అదిరిపోయే రాబడులను అందించిన 7 అద్భుతమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్, మిడ్, ఫ్లెక్సీ క్యాప్) వివరాలు మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.