Publish Date:Aug 12, 2022
భారతదేశం అనగానే అనేక సామాజిక కట్టుబాట్లు, సంప్రదాయాల పుట్టిల్లుగా ప్రతీతి. మహిళలను గౌరవించే దేశంగా ప్రసిద్ధి. వారిని అవహేళన చేస్తూ ఎలాంటి ప్రచారాలు, సంభాషణ జరగనీయని దేశం. ఇంతటి నిషేధాల సమాజంలో నిజానికి సెక్స్ అండ్ సెక్సువాలిటీ గురించి బహిరంగంగా చర్చించరు. బహిరంగం గా వాటిపై చర్చపై దాదాపు నిషిద్ధం.
కానీ ఆధునిక పోకడలు క్రమేపీ కాలంతో పాటు ఆధిపత్యం చెలాయి స్తుండడంతో సమాజంలో కొంత మార్పు వచ్చింది. కొన్ని కట్టుబాట్లను ఇప్పటి యువత బొత్తిగా అంగీకరిం చడమూ లేదు. స్వేచ్ఛపేరుతో చాలా హడావుడే జరుగుతోంది. కానీ ఢిల్లీ మెట్రోవారు మరింత అతిగా వ్యవహరించారు.
ఢిల్లీ మెట్రో కోచ్‌లో మహిళలకు మాత్రమే రిజర్వ్ చేసిన సీట్ల దగ్గర కండోమ్ యాడ్ పోస్టర్ వెలిసింది. కండోమ్ యాడ్ ఇలా బహిరంగంగా పోస్టు చేయడాన్నే చాలా మంది వ్యతిరేకిస్తుంటారు. అదీ మహిళలు మాత్రమే కూర్చునే దగ్గర కనిపించడంతో వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధిం చిన ఫొటో ఒకటి వైరల్ అయింది.
ఓ ట్విట్టర్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేస్తూ.. ఢిల్లీ మరీ ఇంత పురోగమించిందా.. అని మండిపడ్డాడు. ఇంకొం దరు ట్విట్టర్ యూజర్లకు అదేమీ పెద్ద విషయం కానిదిగా కనిపించింది. అంటే.. ఆ పోస్టర్‌లో తప్పేమిటని ప్రశ్నించారు. ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ ఇలాంటి యాడ్స్‌ని ఏమాత్రం ఉత్సాహ పర్చకూడదు. మరీ ఇలాంటివి మహిళలను అవమానించినట్టే అవుతుందని పరిశీలకులు అంటు న్నారు.
అయితే, పోస్టర్ రభస పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వర్గాలు బుధవారం స్పందించాయి. ఆ యాడ్ చాలా కాలం నాటిదని, ఇప్పుడు అక్కడ లేదని, ఎప్పుడో తొలగించారని వివరించాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/its-too-much--25-141825.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.