సంచలనం సృష్టిస్తున్న ఎన్నికల కమిషన్   వివాదంపై  బొద్దింకల పార్టీ  వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు  చేశారు. దేశంలో ఎన్నికల ప్రక్రియపై, ముఖ్యంగా ఓట్ల తొలగింపు,  రిగ్గింగ్ ఆరోపణలపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల బహిష్కరణ పిలుపునిచ్చారు. ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.  ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్   జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా డిమాండ్ తో. లేనిపక్షంలో జంతర్‌మంతర్ 2.0'పేరిట  ఆందోళనను చేపడతామని  హెచ్చరించారు.     దేశంలో ఎన్నికలు  పారదర్శకంగా జరగడం లేదనీ, ఓట్లు చోరీ అవుతున్నాయని ఆరోపించిన అభిజిత్ దిప్కే.. ఎన్నికలను బహిష్కరిస్తే తమ రాజకీయ ఉనికి కోల్పోతామనే భయంతోనే ప్రతిపక్షాలు ఈ తంతులో భాగం అవుతున్నాయని  విమర్శించారు. కానీ..  ఇలాంటి దెబ్బతిన్న, పక్షపాత వ్యవస్థలో కేవలం ఉనికిని కాపాడుకోవడం వల్ల ఒరిగేదేమిటని నిలదీశారు.  పార్టీలు విడిపోతున్నా, నాయకులు ఫిరాయిస్తున్నా ఎలాంటి రక్షణ లభిస్తుందని ప్రశ్నించారు. కేవలం తమకు ప్రయోజనం ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికల అక్రమాల గురించి మాట్లాడి.. ఇతర ప్రాంతాల్లో జరిగే అన్యాయాన్ని విస్మరించడం సబబు కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఫిక్స్డ్ మ్యాచ్ వ్యాఖ్యానం సోషల్ మీడియాలో  ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్స్ అయినప్పటికీ, ప్రజలను నమ్మించడానికి కొన్ని క్యాచ్‌లు వదిలేయడం, కొన్ని క్యాచ్‌లు పట్టడం, చివరి ఓవర్ వరకు మ్యాచ్‌ని పొడిగించడం చేస్తారన్న ఆయన... దేశంలో  ఎన్నికలో కూడా  కూడా ప్రతిపక్షాలకు కొన్ని విజయాలను ఇస్తారనీ,  అది చూసి ప్రజలు నిజంగానే అక్కడ పోటీ జరుగుతోందని భ్రమపడతారని  అభిజిత్ దిప్కే అన్నారు. ఆ చిన్న గెలుపులే ప్రతిపక్షాలను ఆటలో నిలబెట్టడానికి ఉద్దేశించిన బిస్కెట్లుగా అభివర్ణించారు.   ఇటీవల ఎన్నికల కమిషన్‌లో సీఈసీ నిర్ణయాలను మిగిలలిన ఇద్దరు కమిషనర్లు  10 నెలల వ్యవధిలో   14 సార్లు  అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రాజకీయ మనుగడ కంటే దేశహితం ముఖ్యం అని భావించి, రిగ్గింగ్‌కు గురవుతున్న ఎన్నికలను ప్రతిపక్షాలు పూర్తిగా బహిష్కరించాలని అభిజిత్ దిప్కే పిలుపునిచ్చారు. [Abhijeet Dipke, Cockroach Janta Party, Election Commission Controversy, Election Boycott Call, CEC Gyanesh Kumar, India Election Rigging]
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మెరకముడిదాం వైసీపీ మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావుతో పాటు 13 గ్రామాలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నేతలు ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా లేఖలను వైసీపీ అధినేత జగన్‌కి పంపుతున్నట్లు వారు వెల్లడించారు. ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను తామంతా అనుసరిస్తామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. త్వరలోనే వారంతా తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చీపురుపల్లికి చెందిన ఓ మాజీ జెడ్పీటీసీ దంపతులు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న సీనియర్ నేత సొంత నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనూహ్య రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా బలమైన పట్టు కలిగి ఉన్న ప్రాంతంలో కీలక నాయకులు పార్టీని వీడటం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న కొన్ని నిర్ణయాలు స్థానిక కేడర్ మధ్య తలెత్తిన విభేదాలు ఈ పరిణామాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్న నాయకులు పార్టీ వీడుతుండటంతో ఆ ప్రభావం జిల్లాలవారీగా పార్టీ శ్రేణులపై పడుతోంది.ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌లో కొంత గందరగోళం నెలకొంది. అయితే, అధిష్టానం మాత్రం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం ప్రత్యేక వ్యూహాలను రచిస్తూ, శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.     [ Vizianagaram YSRCP politics, Botsa Satyanarayana, AP local politics updates, YSRCP leader defection, Cheepurupalli political,  Majji Srinivasarao, YS Jagan, CM Chandrababu, Naralokesh, Telugu One, Telugu News ]
సీఈసీ జ్ణానేష్ కుమార్‌పై కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి జిజి థామ్సన్ చేసిన ఆరోపణలు  కలకలం రేపుతున్నాయి. తాను సర్వీస్‌లో ఉన్న సమయంలోజ్ణానేష్ కుమార్‌ బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారని, అంతేకాకుండా కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కుతుందని ప్రతిపాదించారని జిజి థామసన్ తాజాగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో  హాట్ టాపిక్ గా మారాయి.  2016లో ఢిల్లీకి వెళ్లే విమాన ప్రయాణ సమయంలో ఈ ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు.   మైనారిటీ వర్గానికి చెందిన తానకు మంచి వక్తగా పేరుండటం వల్ల బీజేపీ తరఫున బరిలోకి దిగితే సులభంగా విజయం సాధించవచ్చనిజ్ణానేష్ కుమార్‌ చెప్పారనీ,  ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌కు వెళితే కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి  దక్కే అవకాశం ఉందని తనను ఒప్పించే ప్రయత్నం చేశారని ధామ్సన్ పేర్కొన్నారు. అయితే, తనకు ప్రత్యక్ష రాజకీయాలపై   ఆసక్తి లేదని విస్పష్టంగా చెప్పి ఆ ప్రతిపాదనను   తిరస్కరించినట్లు వివరించారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికల సంఘం పనితీరు, సీఈసీ జ్ణానేశ్ కుమార్ వ్యవహారశైలి,  నిష్పాక్షికతపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంగా థామ్సన్ వెల్లడించిన విషయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  సీఈసీ గతంలో రాజకీయ పార్టీల కోసం   రాయబారాలు లేదా సిఫార్సులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.   ధామ్సన్ వెల్లడించిన వివరాలపై  కాంగ్రెస్‌ సహా  ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు జ్ణానేష్ కుమార్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజ్యాంగబద్ధమైన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థకు అధిపతిగా ఉండాల్సిన వ్యక్తి, గతంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంో సీఈసీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.   [Jiji Thomson, Gyanesh Kumar, Chief Election Commissioner, BJP ticket offer, Kerala Former Chief Secretary, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
  ఏ నిమిషం ఎవరి సినీ సుడి తిరుగుతుందో చెప్పడం కష్టం. పైగా ఎలాంటి సినీ  బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, అదీ కూడా కెమెరా వెనుక  అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ అనుకోకుండా ప్రధాన పాత్రలో నటించి ప్రపంచస్థాయి గుర్తింపు సాధించడం అత్యంత అరుదైన విషయం. ఏ జన్మలో అయినా పుణ్యం చేసుకొని ఉండాలి, లేదా ఏ దేవుడు అయినా తన కష్టాన్ని చూసి వీడికి ఎందుకు మనం సాయం చేయకూడదనైనా అనుకోని ఉండాలి.  అచ్చం అలాంటి ఒక అద్భుతమైన నిజజీవిత కథే హనుమాన్ అంశ్ ఫేమ్ 'శోభినావ్ సత్య'ది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా ఖైరాబాద్‌లో జన్మించిన శోభినావ్ సత్య, లక్నోలో పెరిగాడు. తండ్రి విద్యాశాఖ రిటైర్డ్ ఉద్యోగి, తల్లి ఉపాధ్యాయిని లక్నో విశ్వవిద్యాలయంలో చేరినా చదువుపై మనసు లగ్నం కాక, ఫైజాబాద్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేస్తూనే లక్నోలోని ఓపులెంట్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ అండ్ ఫిల్మ్స్‌లో నటనపై శిక్షణ పొంది, ఆ తర్వాత ప్రతిష్టాత్మక FTII పూణేలో కోర్సు పూర్తి చేశాడు.   చదువు పూర్తయ్యాక ముంబై సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శోభినావ్, మొదట్లో తెర వెనుక విభాగాలకే పరిమితమయ్యాడు. 'సి.ఐ.డి', 'రాగిణి ఎమ్ఎమ్‌ఎస్ రిటర్న్స్', 'హ్యాపీలీ ఎవర్‌ ఆఫ్టర్', 'మహాపోర్' వంటి ప్రసిద్ధ టీవీ మరియు ఓటీటీ ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్క్రిప్ట్ అండ్ కంటిన్యూటీ సూపర్‌వైజర్‌గా 10 ఏళ్లుకి పైగా పని చేసాడు. ఒక నటుడిగా కంటే  దర్శకుడిగా ఎదగాలనేది కోరిక. ఈ క్రమంలోనే భక్తిరస చిత్రం 'హనుమాన్ అంశ' (Hanuman Ansh) ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు, దర్శకుడు విశాల్ చతుర్వేది వద్ద శోభినావ్ సత్య కేవలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా  టీమ్‌లో చేరాడు. షూటింగ్ రెండు రోజుల్లో స్టార్ట్ అనగా, టైటిల్ రోల్(నీమ్ కరోలీ బాబా) అనుకున్న హీరో అస్వస్థతకి గుర్యయాడు. దీంతో మేకర్స్ కి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. కానీ  శోభినావ్‌లోని ప్రశాంతమైన హావభావాలు, ముఖకవళికలని దర్శకుడు విశాల్ చతుర్వేది గమించాడు. వెంటనే శోభినావ్‌కు సుదీర్ఘంగా 5 గంటల పాటు కఠినమైన స్క్రీన్ టెస్ట్ నిర్వహించాడు . ఆ స్క్రీన్ టెస్ట్‌లో అతడి సహజ సిద్ధమైన అభినయానికి ముగ్ధులైన మేకర్స్, కెమెరా వెనుక ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్‌ను ఏకంగా సినిమాలో నీమ్ కరోలీ బాబా ప్రధాన పాత్రకు కథానాయకుడిగా ఎంపిక చేశారు.   అయితే ఈ పవిత్రమైన పాత్రను పోషించడం శోభినావ్‌కి  అంత సులువు కాలేదు.      ఇది కూడా చదవండి: నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవే: హిట్టా, ఫట్టా! చిన్నతనం నుంచే, అంటే 2009లో హైస్కూల్ చదువుతున్న సమయం నుంచే నీమ్ కరోలీ బాబా భక్తుడైన శోభినావ్, ఈ పాత్ర కోసం అత్యంత కఠినమైన సాత్విక నియమాలను పాటించాడు. ధూమపానం, మద్యం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక చింతనతో జీవించాడు. షూటింగ్ సమయంలో సెట్‌లో పాదరక్షలు లేకుండా  సంచరిస్తూ, మానసిక ప్రశాంతతను కాపాడుకుంటూ భక్తిశ్రద్ధలతో నటించాడు. తెరపై తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అత్యంత సాదాసీదాగా మార్చుకున్నాడు. ప్రస్తుతం హనుమాన్ అంశ్ జై భజరంగబలి అంటూ 400 కోట్లలోకి అడుగుపుట్టింది. బడ్జెట్ కేవలం రెండున్నర కోట్లు. తెలుగులో కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.   [Hamuman Ansh, Hanuman Ansh Actor Shobhinaw Satyaa Real Story,Shobhinaw Satyaa, Hanuman Ansh Collections, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా.. బ్రేక్ ఈవెన్ సాధించలేక 'కమర్షియల్ ఫెయిల్యూర్స్'గా మిగలడం చూస్తుంటాం. అయితే నెగెటివ్ టాక్ తో హిట్ కొట్టే సినిమాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. రెండేళ్ల క్రితం వచ్చిన 'దేవర' సినిమా అలాంటి అద్భుతమనే చెప్పొచ్చు. ఇప్పుడు 'దేవర' సరసన 'ప్యారడైజ్' కూడా చేరేలా కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో 2024 సెప్టెంబర్ లో విడుదలైన 'దేవర' మూవీ మొదటి నుంచే డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎన్నో నెగెటివ్ కామెంట్స్ కనిపించాయి. ఆ నెగటివిటీని దాటుకొని రూ.400 కోట్లకు పైగా గ్రాస్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది దేవర. ఇప్పుడు రెండేళ్ల తర్వాత 'ప్యారడైజ్' రూపంలో అదే మ్యాజిక్ రిపీట్ అయ్యేలా ఉంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందిన 'ప్యారడైజ్' మూవీ, ఈ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ కనిపించాయి. కానీ ఆ టాక్, ఆ ట్రోల్స్ తో సంబంధం లేకుండా.. ప్యారడైజ్ మూవీ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఫస్ట్ వీకెండ్ లోనే థియేట్రికల్ బిజినెస్ లో దాదాపు 80 శాతం రికవర్ చేసింది. ఇదే జోరు కొనసాగితే.. త్వరలోనే బ్రేక్ ఈవెన్ అయినా ఆశ్చర్యంలేదు. అదే జరిగితే.. దేవర తర్వాత నెగెటివ్ టాక్ తో హిట్ కొట్టిన సినిమాగా ప్యారడైజ్ నిలుస్తుంది. ఇది కూడా చదవండి: రామజోగయ్య శాస్త్రి గారి మాటలు బాధపెట్టాయి.. తమన్ షాకింగ్ కామెంట్స్.!     [Devara vs Paradise, Devara Collections, The Paradise Collections, Jr NTR Devara Movie, The Paradise Movie, Nani Paradise Movie, Telugu Film News, Telugu News]  
  అదేంటో గాని నాని వన్ మాన్ షో ప్రదర్శించిన ప్యారడైజ్ ఒక పక్క నెగిటివ్ టాక్ తో రన్ అవుతూనే, మరో పక్క దేనితోవ దానిదే అంటూ కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లోనే వస్తున్నాయి. అందుకే అంటారు మనుషులకే కాదు సినిమాకి కూడా అదృష్టం, టైం అనేది ఉంటుందని.  ప్రీమియర్స్ తో రిలీజ్ డేట్ 24 కంటే ముందు 23 నైట్ ప్రీమియర్స్ తో మొదలైన ప్యారడైజ్ ప్రీమియర్స్ తో కలుపుకొని  ప్రపంచవ్యాప్తంగా  138.25 కోట్లకు చేరుకొని రికార్డు సృష్టించింది. ఈ కలెక్షన్స్ లో  ఓవర్సీస్ మార్కెట్ నుంచి 29.25 కోట్ల గ్రాస్ వసూలు కావడం హైలెట్ అని చెప్పవచ్చు. ఏరియాల వారీగా పరిశీలిస్తే, రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలోనే ఈ సినిమా అత్యధిక ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ ప్రాంతం నుంచే ఆదివారం ఒక్క రోజే 14.00 కోట్ల గ్రాస్ కలెక్ట్ అవ్వగా, నాలుగు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల గ్రాస్ 0 కోట్లకు పైగా నమోదైంది. మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక దాదాపు 8.77 కోట్లు, తమిళనాడు ₹3.50 కోట్లు, కేరళ రూ. 65 లక్షలు మరియు ఉత్తరాది మార్కెట్లు  7.83 కోట్లకు పైగా రాబట్టింది.   ఇది కూడా చదవండి: ఆసక్తికరంగా మారిన అల్లు శిరీష్ పోలీస్ కంప్లైంట్: ఆంజనేయడి సాక్షిగా ఏం జరుగుతుంది! 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిందనే న్యూస్ వినిపిస్తున్న ప్యారడైజ్ మరి ముందు ముందు ఏ మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.    [The Paradise Collections, The Paradise Four days Collections, Nani The Paradise Collections, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు ప్రముఖ హీరో అల్లు శిరీష్ చేసిన ట్వీట్ ఇప్పుడు అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. మరి ఆ ట్వీట్ ఏంటి? అందుకు గల కారణాలు ఏంటో చూద్దాం. హైదరాబాద్  షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ గేటెడ్ కమ్యూనిటీ లో అల్లు శిరీష్ నివాసముంటాడు. తన  నివాస సముదాయం సమీపంలోని వినోబా నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు మితిమీరిన శబ్దంతో మైకులు మోగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా హైదరాబాద్ పోలీసులని టాగ్ చేస్తూ ఒక పోస్ట్ చేశారు. దీనికి రుజువుగా సుమారు 9 సెకన్ల విజువల్స్ వీడియోను కూడా జత చేశారు. గతంలోనే తాము ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ సమస్యపై అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు శిరీష్ గుర్తుచేశారు. అప్పట్లో వినాయక చవితి నిమజ్జనోత్సవాలు జరుగుతున్నందున సెప్టెంబర్ 25వ తేదీ వరకు వేచి చూడాలని, పండుగ రద్దీ ముగిసే వరకు సర్దుకుపోవాలని పోలీసులు సూచించారని ఆయన తెలిపారు. అయితే సెప్టెంబర్ 25 ముగిసి, వినాయక నిమజ్జనాలు పూర్తయినప్పటికీ ఆలయం వద్ద లౌడ్ స్పీకర్ల మోత మాత్రం ఆగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: హాలీవుడ్ మూవీ 'హాట్ ఆఫ్ ది బీస్ట్' సంచలనం: కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు,కుక్క ఏమయ్యారు!     అర్ధరాత్రి వేళల్లో వచ్చే ఈ భరించలేని మైకుల గోల వల్ల తమ సొసైటీలో నివసిస్తున్న వయోవృద్ధులు, చిన్నపిల్లలు, మరుసటి రోజు ఉదయమే ఉద్యోగాలకు వెళ్లే వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీవ్ర నిద్రలేమితో అల్లాడిపోతున్నారని శిరీష్ వాపోయారు. గతంలో కూడా కాలనీ వాసులు అనేకమార్లు పోలీసులకు విన్నవించినప్పటికీ ఎటువంటి శాశ్వత పరిష్కారం లభించలేదని ఆయన పేర్కొన్నారు. అనుమతించిన డెసిబెల్ పరిమితులను దాటి సౌండ్ సిస్టమ్స్ ప్లే చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతోందని, అధికారులు వెంటనే రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన బహిరంగంగా కోరారు. శిరీష్ వేసిన ట్వీట్ పై హైదరాబాద్ సిటీ పోలీస్ స్పందించింది. సదరు సమస్యను తక్షణ చర్యల నిమిత్తం సంబంధిత ఫిలింనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) కు పంపించినట్లు అధికారికంగా సమాధానమిచ్చారు. సెలబ్రిటీ అయినప్పటికీ ఎలాంటి సంకోచం లేకుండా ఒక పౌర బాధ్యతగా బహిరంగంగా ఈ శబ్ద కాలుష్యంపై గొంతు విప్పినందుకు పలువురు నెటిజన్లు అల్లు శిరీష్‌ను ప్రశంసిస్తున్నారు. దేవుడి పేరుతో అర్ధరాత్రి వేళల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించడం సమంజసం కాదని, అన్ని రకాల ప్రార్థనా మందిరాల్లోనూ ఇటువంటి శబ్ద నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.      [Allu Sirish Police Complaint , Allu Sirish Police Complaint About Loud Music Hyderabad, Allu Sirish, Hyderabad Police complaint, Shaikpet loud music, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్, ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కాంబినేషన్ అనగానే మనకు ఎన్నో చార్ట్‌బస్టర్ పాటలు గుర్తుకొస్తాయి. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, కెమిస్ట్రీ కేవలం పాటల్లోనే కాదు.. సినిమా వేదికలపై కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఇటీవల జరిగిన 'ఆదర్శ కుటుంబం' మూవీలోని 'నారాయణమ్మ' సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఈవెంట్ లో రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. "తమన్ గారు" అని సంబోధించారు. దాంతో ఆ తర్వాత వేదికపై మైక్ అందుకున్న తమన్.. రామజోగయ్య శాస్త్రికి కౌంటర్ ఇచ్చారు. "రామజోగయ్య శాస్త్రి గారు నన్ను 'తమన్ గారు' అని పిలిచారంటే.. ఆయన మనసులో నాపై ఏదో పెద్ద కక్ష పెట్టుకున్నారని అర్థం. పాటలోని సాహిత్యం సరిగ్గా వినిపించకపోతే ఆయనకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని మనసులోనే ఉంచుకుని నన్ను 'తమన్ గారు' అని చాలా పద్ధతిగా పిలుస్తారు" అని తమన్ సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, "ఆయన నన్ను అలా 'గారు' అని పిలిచినప్పుడల్లా నేను చాలా బాధపడతాను, నా మనసంతా హెవీ అయిపోతుంది" అంటూ తమన్ చేసిన కామెంట్స్‌కు వేదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. తమన్ వ్యాఖ్యలకు ఆడియన్స్‌లో కూర్చున్న రామజోగయ్య శాస్త్రి కూడా అంతే సరదాగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ నవ్వులు చిందించారు. ఇది కూడా చదవండి: నారాయణమ్మ సాంగ్.. త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్ అయిందా.?       [Thaman S vs Ramajogayya Sastry, Thaman Speech, Ramajogayya Sastry, Narayanamma Song Launch, Aadarsha Kutumbam Movie, Victory Venkatesh, Trivikram Srinivas, Dimple Hayati, Telugu Songs 2026]  
వరల్డ్ వైడ్ గా ఈ నెల 25 న విడుదలైన హాలీవుడ్ మూవీ 'హాట్ ఆఫ్ ది బీస్ట్'. హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి సిటీస్ లో విడుదలైంది. ఈ  చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా  ప్రేక్షకులని  భావోద్వేగానికి గురి చేస్తోంది. కేవలం 1 గంట 45 నిమిషాల నిడివితో రూపొందిన ఈ చిత్రం, అలస్కాలోని ప్రమాదకరమైన అడవుల్లో విమాన ప్రమాదానికి గురైన ఒక మాజీ నావీ సీల్, అతని రిటైర్డ్ మిలిటరీ వర్కింగ్ డాగ్ 'ఓడిన్' survival కోసం చేసిన పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.  ఇక ఈ సినిమా చూసిన మన ప్రేక్షకులకి మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం స్పష్టంగా గుర్తుకువస్తోంది. భారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన అనంతరం రాజ్యత్యాగం చేసిన పాండవులు, ద్రౌపది స్వర్గారోహణం కోసం హిమాలయాల వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఆ కఠినమైన ప్రయాణంలో ఒక విశ్వాసపాత్రమైన కుక్క వారిని అనుసరించడం మొదలుపెడుతుంది.   మంచు తుఫాన్లు, తీవ్రమైన చలికి తట్టుకోలేక ద్రౌపదితో సహా నలుగురు సోదరులు ఒక్కొక్కరుగా పడిపోయి ప్రాణాలు విడుస్తారు.  ఆ క్రమంలో ధర్మరాజు మాత్రమే  ముందుకు సాగుతాడు. కుక్క కూడా చివరివరకు అడుగడుగునా తోడుగా నడుస్తుంది. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు తన దివ్య రథంతో వచ్చి ధర్మరాజును సశరీరంగా స్వర్గానికి ఆహ్వానించినప్పుడు, ధర్మరాజు తనతో వచ్చిన కుక్కను కూడా రథంలోకి ఎక్కించుకోవాలని కోరతాడు. అయితే, "స్వర్గంలోకి కుక్కలకి అనుమతి లేదు, దానిని ఇక్కడే వదిలేసి రా" అని ఇంద్రుడు స్పష్టం చేస్తాడు.   తనను నమ్మి అడవులు, కొండలు దాటి వచ్చిన ఆ ప్రాణిని ఆపద సమయంలో ఒంటరిగా వదిలేయడం అధర్మమని, దానికోసం స్వర్గ సుఖాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధమని ధర్మరాజు తెగేసి చెబుతాడు. ధర్మరాజు యొక్క ఈ నిస్వార్థ ప్రేమను, ధర్మ నిష్ఠను చూసి ఆ కుక్క రూపంలో ఉన్న ధర్మదేవుడు (యమధర్మరాజు) ప్రత్యక్షమై తన కొడుకైన ధర్మరాజుని ఆశీర్వదిస్తాడు. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆధ్యాత్మిక ధర్మాన్నే 'హాట్ ఆఫ్ ది బీస్ట్' సినిమా ఆధునిక కోణంలో అత్యంత భావోద్వేగంగా ఆవిష్కరించింది.        అలస్కాలో సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత (-20°C) ఉండే మంచు కొండలలో, ఎలాంటి ఆహారం లేకుండా మరియు భయంకరమైన వన్యప్రాణుల దాడి మధ్య 100 మైళ్ళకు పైగా సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించే క్రమంలో కథానాయకుడు ప్రాణాపాయంలో పడతాడు. అటువంటి సమయంలో ప్రతిఫలం ఆశించని ఆ మిలిటరీ కుక్క చూపించిన విశ్వాసం, కథానాయకుడు కూడా దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి నిలబడే తీరు ప్రేక్షకులచే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆధునిక యుగంలో కూడా మనుషుల మధ్య తగ్గుతున్న బంధాలకి ఈ కుక్క మనిషి అనుబంధం ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తోంది. మహాభారతంలో ధర్మరాజు ధర్మానికి కట్టుబడి నిలిచినట్లే, ఈ సినిమాలో హీరో కూడా విశ్వాసానికి ప్రతీకగా నిలవడం వల్లనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 90% పైగా రేటింగ్‌తో సంచలనం సృష్టిస్తోంది. మరి చూడని వాళ్ళు తప్పక చూడండి. ఎన్నో సత్యాలని మన కళ్ళ ముందు ఉంచుతుంది. మిలిటరీ ఆఫీసర్ జేమ్స్ గా అగ్ర నటుడు బ్రాడ్ పిట్ అత్యద్భుతంగా పోషించాడు. డేవిడ్ అయ్యర్ దర్శకుడు.         [Heart Of The Beast Movie Story Telugu,Heart of the Beast movie Review, Dharmaraju and Dog story,Mahabharata Swargarohana,  Brad Pitt survival movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం ’పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. టీజర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన టీమ్.. ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను ప్రభ, రామ్ మిరియాల ఎనర్జిటిక్‌గా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. పాటను చూస్తుంటే ఫుల్ మాస్, ఫెస్టివల్ వైబ్ వచ్చేలా డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. ఈ పాటలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ సందడి చేయగా.. డింపుల్ హయాతి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆమె ఎనర్జిటిక్ డాన్స్, స్క్రీన్ ప్రజెన్స్ పాటకు మంచి జోష్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘నారాయణమ్మ’ పాటలో వెంకటేష్‌ను కొత్తగా, ఫుల్ ఎనర్జీతో చూపించిన విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమాకు ఈ పాట మంచి మాస్ టచ్ ఇచ్చిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్ లో 1.5 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం.  ఇది కూడా చదవండి: స‌ర్జ‌రీ విష‌యంలో నివేదా 'నో' చెప్ప‌డానికి సాయిప‌ల్ల‌వి కార‌ణ‌మా? అస‌లేం జ‌రిగింది? అయితే పాటకు వస్తున్న స్పందన పూర్తిగా ఏకపక్షంగా లేదు. పాట ఎనర్జీ, డాన్స్, విజువల్స్ బాగున్నాయంటూ కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం సాధారణంగా త్రివిక్రమ్ సినిమా పాటల్లో ఉండే స్పెషల్ మ్యాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తోంది అంటున్నారు. త్రివిక్రమ్ సినిమాలు ఎలాగైతే చూసేకొద్దీ నచ్చుతాయో.. ఆయన సినిమాల్లోని పాటలు కూడా వినేకొద్దీ, వాటిలోని మ్యాజిక్ తెలుస్తుంది. ఇప్పుడు నారాయణమ్మ’ సాంగ్ విషయంలో కూడా అదే జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 9న థియేటర్లలోకి రానుంది. మరి ‘నారాయణమ్మ’ ఇచ్చిన ఈ మాస్ కిక్.. థియేటర్లలో సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.       [Aadarsha Kutumbam First Single, Narayanamma Song, Aadarsha Kutumbam Movie Songs, Victory Venkatesh, Trivikram Srinivas, Telugu Songs 2026, Dimple Hayati, Srinidhi Shetty, Nivetha Pethuraj]  
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. భుజం గాయం కారణంగా కొంతకాలంగా షూటింగ్స్‌కు దూరంగా ఉన్న తారక్.. ఇప్పుడు పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్‌పైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం ఫిజియోథెరపీ తీసుకుంటూ రికవరీ అవుతున్న ఎన్టీఆర్.. అక్టోబర్‌లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ షూటింగ్‌లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్ గాయంతో షూటింగ్‌కు బ్రేక్ వచ్చినప్పటికీ దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం సినిమా పనులను ఆపలేదు. తారక్ అవసరం లేని సన్నివేశాలతో పాటు ఇతర నటీనటులకు సంబంధించిన భాగాలను చిత్రీకరిస్తూ షూటింగ్‌ను కొనసాగించారు. దీంతో సినిమా నిర్మాణం పూర్తిగా నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రీఎంట్రీ కోసం చిత్రబృందం కీలకమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ‘డ్రాగన్’ విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, డార్క్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఈ పాత్రపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ సెట్స్‌పైకి వచ్చిన తర్వాత మిగిలిన కీలక సన్నివేశాలను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘డ్రాగన్’ను 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని తారక్ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వస్తుండటంతో ఈ సినిమా షూటింగ్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.     [Jr NTR, NTR Dragon, NTR Dragon Movie, Jr NTR Comeback, NTR Injury, NTR Shoulder Injury, NTR Dragon Shooting, Prashanth Neel Dragon, NTR Upcoming Movie, Dragon Movie Update, Rukmini Vasanth, Anil Kapoor, Tollywood News]
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలైన తర్వాత అందులోని కొన్ని సన్నివేశాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలిన పాత్ర సినిమాలో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎమ్మెల్యే శంకర్ అనే పాత్రలో ప్రియదర్శి కనిపించగా.. ఆయన గెటప్, డైలాగ్స్, కొన్ని సన్నివేశాలు కేసీఆర్‌ను గుర్తు చేసేలా ఉన్నాయి. ఈ పాత్ర సినిమాల్లో కేవలం నాలుగు నిమిషాల పాటు మాత్రమే కనిపించినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమా చూసిన అనంతరం కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేశారు. తెలంగాణ భాష, సంస్కృతి, అణచివేతపై ప్రజల పోరాటాన్ని సినిమాలో చూపించిన విధానం గురించి ఆయన ప్రశంసలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే శంకర్ పాత్రను ప్రియదర్శి అద్భుతంగా పోషించారని పేర్కొన్నారు. సినిమాలో ఆ పాత్రకు లభించిన స్పందనను కూడా ఆయన ప్రస్తావించారు. ఇదిలా ఉంటే.. ‘ది ప్యారడైజ్’లో కేసీఆర్‌తో పాటు దివంగత నటుడు నందమూరి తారక రామారావును పోలిన పాత్ర కూడా కనిపిస్తుంది. ఎన్టీఆర్ లుక్‌లో పి. విజయ్ కుమార్ చిన్న గ్లింప్స్‌లో కనిపించారు. అలాగే ఇటీవల కన్నుమూసిన పలువురు సినీ ప్రముఖులకు, కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌కు కూడా చిత్రబృందం ప్రత్యేక నివాళి అర్పించింది. దీంతో సినిమాలోని ఈ అంశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరోవైపు సినిమాలో కేసీఆర్‌ను పోలిన పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యతపై తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. దీనిపై కేటీఆర్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు చేసినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ‘ది ప్యారడైజ్’ కథ కల్పితమైనదే కాగా, అందులోని కొన్ని పాత్రలు, సన్నివేశాలు వాస్తవ జీవితంలోని ప్రముఖులను పోలి ఉండేలా రూపొందించినట్లు తెలుస్తోంది.       [Nani The Paradise, The Paradise Movie, KTR The Paradise Review, KTR On The Paradise, KCR Character In The Paradise, Priyadarshi The Paradise, Nani Srikanth Odela, The Paradise KCR Role, Telugu Cinema News, Tollywood Latest News]
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘దాదా’ కూడా ఒకటి. బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్‌ను మైసూర్‌లో నిర్వహించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి అక్కడ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మైసూర్ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ కోసం చిత్రబృందం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే బాలకృష్ణ మాత్రం అక్టోబర్ 5 నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఇతర నటీనటులతో అవసరమైన సన్నివేశాలను పూర్తి చేసేందుకు దర్శకుడు ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో ఎలాంటి గ్యాప్ లేకుండా షూటింగ్‌ను కొనసాగిస్తూ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కలయికలో వస్తున్న ‘దాదా’పై సహజంగానే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు మరో కొత్త తరహా పాత్రలో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా అప్డేట్స్, బాలయ్య లుక్‌పై అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక మైసూర్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా షూటింగ్ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. బాలకృష్ణ అక్టోబర్ 5 నుంచి సెట్స్‌లోకి అడుగుపెట్టనుండటంతో ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ అప్‌డేట్‌తో ‘దాదా’పై నందమూరి అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. సినిమా విడుదల తేదీ, ఇతర వివరాలను చిత్రబృందం త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.     [Balakrishna Dada, Dada Movie, NBK Dada Movie, Balakrishna Gopichand Malineni, Dada Shooting, Dada Movie Shooting, NBK Upcoming Movie, Balakrishna Latest Movie, Nandamuri Balakrishna, Telugu Cinema News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన భారతీయ వంటగదిలోని మసాలా దినుసులలో లవంగానికి (Clove) అత్యంత ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సాధారణంగా వంటలలో సువాసన, రుచి కోసం వాడే ఈ చిన్న లవంగం కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఆయుర్వేద మూలికా నిధి. ప్రాచీన కాలం నుండి మన పెద్దలు లవంగాన్ని రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు ఒక శక్తివంతమైన నివారణిగా ఉపయోగిస్తున్నారు. ఆధునిక పోషకాహార నిపుణులు మరియు వైద్య పరిశోధనల ప్రకారం ప్రతీ రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒకే ఒక్క లవంగాన్ని నమిలి తినడం లేదా దానిని నీటితో తీసుకోవడం వల్ల శరీరంలో ఆశ్చర్యకరమైన ఆరోగ్యకర మార్పులు చోటుచేసుకుంటాయి. మన జీర్ణవ్యవస్థను శక్తివంతం చేయడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. లవంగంలో ఉండే అత్యంత క్రియాశీలక కాంపౌండ్  యూజినాల్  (Eugenol). ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా మరియు యాంటీబ్యాక్టీరియల్ మూలకంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక లవంగాన్ని పరగడుపున నమిలి నమలడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశించిపోతుంది. లవంగంలో ఉండే సహజ నూనెలు చిగుళ్ల వాపును, పంటి నొప్పిని మరియు నోటి దుర్వాసనను తక్షణమే నివారిస్తాయి. అంతేకాకుండా, ఇది నోటిలోని లాలాజల గ్రంథులను ప్రేరేపించి, జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా ఉదయాన్నే మన జీర్ణవ్యవస్థ వేగవంతమై, తిన్న ఆహారం సులభంగా అరగడానికి నాంది పలుకుతుంది. జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారికి పరగడుపున లవంగం తినడం ఒక గొప్ప వరంగా మారుతుంది. లవంగంలో ఉండే పీచు పదార్థం మరియు ఎంజైములు కడుపులో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలను సమర్థవంతంగా అరికడతాయి. కడుపులోని అల్సర్లను కలిగించే హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకోవడంలో లవంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఒక లవంగం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బలపడటమే కాకుండా, శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోయి జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది. మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంపొందించడంలో లవంగం ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది. లవంగంలో విటమిన్ సి, విటమిన్ కే, మాంగనీస్ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఒక టీస్పూన్ లవంగాల పొడి నుండి మన శరీరానికి రోజువారీ కావలసిన మాంగనీస్ అవసరాలలో దాదాపు 55 శాతం లభిస్తుంది. మాంగనీస్ మెదడు పనితీరుకు, ఎముకల బలానికి ఎంతో అవసరం. క్రమం తప్పకుండా ఉదయాన్నే లవంగం తినడం వల్ల రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి, కాలగుణంగా వచ్చే సర్ది, దగ్గు, గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి బలమైన రక్షణ కవచం లభిస్తుంది. అంతేకాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Levels) సమతుల్యం చేయడంలో మరియు కాలేయం (Liver) ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో లవంగం సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. లవంగంలో ఉండే కాంపౌండ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, కణాలు గ్లూకోజ్‌ను త్వరగా గ్రహించేలా చేస్తాయి. దీనివల్ల టైప్ 2 మధుమేహంతో బాధపడేవారికి రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే శరీరం యొక్క జీవక్రియ రేటు (Metabolism) పుంజుకుని అదనపు కొవ్వు కరగడానికి సహకరిస్తుంది. రోజుకో లవంగం పరగడుపున తినే చిన్న అలవాటును మన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని, అమితమైన ఉత్సాహాన్ని సులభంగా పొందే వీలుంది.     [ Clove, Clove Benefits, Eugenol, Oral Health, Dental Health, Digestive Health, Immunity, Antioxidants, Blood Sugar, Liver Health ]
మన ఆహార అలవాట్లలో అత్యంత సులభంగా లభించే అద్భుతమైన పండ్లలో బొప్పాయి (Papaya) ఒకటి. ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప అమృతంగా దీనిని చెప్పుకోవచ్చు. చాలామంది దీనిని సాధారణ పండుగానే భావిస్తుంటారు, కానీ ప్రతీ రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక కప్పు బొప్పాయి ముక్కలను తినడం వల్ల మన ఆరోగ్యానికి చేకూరే మేలు అంతా ఇంతా కాదు. ఆధునిక వైద్య పరిశోధనలు మరియు పోషకాహార నిపుణుల ప్రకారం బొప్పాయిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో ఆశ్చర్యకరమైన ఆరోగ్యకర మార్పులు చోటుచేసుకుంటాయి. మన జీర్ణవ్యవస్థను వేగవంతం చేయడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం మరియు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడం వరకు బొప్పాయి ఎంతో శక్తివంతమైన మూలకంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో బొప్పాయికి సాటి మరొకటి లేదు. బొప్పాయిలో  పాపైన్  (Papain) అనే ప్రత్యేకమైన డైజెస్టివ్ ఎంజైమ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలోని ప్రొటీన్లను త్వరగా విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఒక కప్పు బొప్పాయిలో దాదాపు 3 గ్రాముల పీచు పదార్థం (ఫైబర్) మరియు సుమారు 88 శాతం నీటి శాతం ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున దీనిని తినడం వల్ల ప్రేగుల కదలికలు సులభతరమై మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం మరియు ఎసిడిటీ వంటి తీవ్రమైన సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. జీర్ణకోశాన్ని శుభ్రపరచి, పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపడంలో ఇది ఒక అద్భుతమైన నేచురల్ డిటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) కొండంత పెంచడంలో బొప్పాయి ఎంతో నమ్మకమైనది. ఒక సాధారణ బొప్పాయి పండులో మన శరీరానికి రోజువారీ కావలసిన విటమిన్ సి అవసరాల కంటే దాదాపు 200 శాతం కంటే ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించి, కాలగుణంగా వచ్చే సర్ది, దగ్గు, జ్వరం మరియు రకరకాల ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. దీనికి తోడు ఇందులో లభించే విటమిన్ ఏ, విటమిన్ ఈ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో కణాల క్షీణతను అరికట్టి, నిత్యం ఉత్సాహంగా ఉండేలా చూస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కూడా బొప్పాయి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం మరియు విటమిన్లు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధిస్తాయి. బొప్పాయిలో ఉండే లైకోపీన్ మరియు విటమిన్ సి గుండెకు రక్షణగా నిలిచి, చెడు కొలెస్ట్రాల్ (LDL) ఆక్సీకరణ చెందకుండా చూస్తాయి. తద్వారా హృద్రోగాలు, హై బీపీ మరియు గుండెపోటు ముప్పు గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక కప్పు బొప్పాయి ముక్కల్లో కేవలం 60 కేలరీలు మాత్రమే ఉంటాయి, కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మరియు మధుమేహం ఉన్నవారికి ఇది ఎంతో అనుకూలమైన పండు. రోజూ ఉదయం బొప్పాయి తినే అలవాటు చేసుకోవడం ద్వారా చర్మం ప్రకాశవంతంగా మారడమే కాకుండా, పరిపూర్ణ ఆరోగ్యాన్ని సులభంగా సొంతం చేసుకోవచ్చు.     [ Papaya, Papaya Benefits, Papain Enzyme, Digestive Health, Vitamin C, Immunity, Heart Health, Lycopene, Antioxidants, Weight Management ]  
నేటి డిజిటల్ యుగంలో ఫిట్‌నెస్ ప్రపంచాన్ని ఊపేస్తున్న సరికొత్త సోషల్ మీడియా ట్రెండ్  తైచీ వాకింగ్  (Tai Chi Walking). సాధారణంగా బరువు తగ్గాలంటే లేదా ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌లలో చెమటలు చిందించాలి, గంటల తరబడి పరుగెత్తాలి లేదా తీవ్రమైన వ్యాయామాలు చేయాలని చాలామంది భావిస్తుంటారు. కానీ ఎలాంటి వేగమూ లేకుండా, చాలా నెమ్మదిగా, మనస్సును శరీరంతో అనుసంధానిస్తూ నడవడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఈ తైచీ వాకింగ్ నిరూపిస్తోంది. చైనా దేశపు ప్రాచీన మార్షల్ ఆర్ట్స్ విధానమైన  తైచీ  నుండి పుట్టుకొచ్చిన ఈ మైండ్‌ఫుల్ నడక పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తైచీ వాకింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వేగం కాదు, శరీర సమతుల్యత మరియు శ్వాస నియంత్రణ. సాధారణ నడకలో మనం వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతాం, కానీ తైచీ వాకింగ్‌లో ప్రతి అడుగునూ ఎంతో స్పృహతో, నెమ్మదిగా వేయాల్సి ఉంటుంది. అడుగు వేసేటప్పుడు మడమను మొదట నేలకు ఆనించి, ఆ తర్వాత నెమ్మదిగా పాదాన్ని ముందుకు మోపుతూ శరీరం యొక్క బరువును ఒక కాలు నుండి మరొక కాలుకు సజావుగా బదిలీ చేయాలి. ఈ ప్రక్రియలో శ్వాసక్రియను గమనిస్తూ, కాళ్ల కండరాలపై దృష్టి సారించాలి. ఇది కేవలం శరీరానికి మాత్రమే కాకుండా మెదడుకు కూడా ఒక గొప్ప ధ్యానంలా పనిచేస్తుంది. అయితే అత్యంత నెమ్మదిగా చేసే ఈ నడక వల్ల నిజంగా బరువు తగ్గుతారా? అనే సందేహం చాలామందిలో కలగడం సహజం. పోషకాహార మరియు ఫిట్‌నెస్ నిపుణుల పరిశోధనల ప్రకారం తైచీ వాకింగ్ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. సాధారణ వేగవంతమైన నడక లేదా రన్నింగ్ చేసేటప్పుడు కేవలం కేలరీలు మాత్రమే ఖర్చవుతాయి. కానీ తైచీ వాకింగ్ చేసేటప్పుడు శరీరంలోని కోర్ కండరాలు, తొడలు, పిక్కలు మరియు నడుము కండరాలు నిరంతరం సమతుల్యత కోసం కష్టపడతాయి. దీనివల్ల కండరాల బలం పెరిగి, శరీరంలో జీవక్రియ రేటు (మెటబాలిజం) పుంజుకుంటుంది. తద్వారా విశ్రాంతి సమయంలో కూడా శరీరం ఎక్కువ కేలరీలను కరిగిస్తుంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం రోజుకు 30 నుండి 45 నిమిషాల పాటు తైచీ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ఒత్తిడిని కలిగించే  కార్టిసాల్  హార్మోన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. కార్టిసాల్ హార్మోన్ పెరిగితే పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ నడక విధానం వల్ల ఒత్తిడి తగ్గి, కార్టిసాల్ అదుపులోకి రావడం ద్వారా బెల్లీ ఫ్యాట్ వేగంగా కరుగుతుంది. అంతేకాకుండా, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి మరియు వృద్ధులకు ఇది ఒక అద్భుతమైన వ్యాయామం. అధిక బరువు ఉన్నవారు వేగంగా పరిగెత్తితే కీళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది, కానీ తైచీ వాకింగ్ వల్ల కీళ్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా సురక్షితంగా బరువు తగ్గవచ్చు. మానసిక ప్రశాంతతను అందిస్తూ, శరీర సమతుల్యతను మెరుగుపరిచే ఈ ప్రాచీన విధానం ఆధునిక జీవనశైలి వ్యాధులకు చక్కటి పరిష్కారంగా మారుతోంది. నిత్యం తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే లేదా సాయంత్రం ప్రశాంతమైన వాతావరణంలో 20 నుండి 30 నిమిషాల పాటు తైచీ వాకింగ్ అలవాటు చేసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలోకి రావడమే కాకుండా, మనస్సు ప్రశాంతంగా మారి పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.     [ Tai Chi Walking, Tai Chi, Mindful Walking, Weight Management, Balance Training, Stress Reduction, Cortisol, Joint Health, Mental Wellness, Low Impact Exercise ]  
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక్క రోజులో జరిగే  పని కాదు. నేటి ఆధునిక జీవనశైలి, సరైన పోషకాహారం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం మన దేశంలో సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే, ముందే మన లైఫ్ స్టైల్ లో  కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. చురుగ్గా ఉండటం..  బాగా  వర్కవుట్లు చేయలేకపోయినా, రోజూ కొంత సమయం నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేసే వారు మధ్యమధ్యలో లేచి కాసేపు అటుఇటు తిరగడం వల్ల శరీరంలో రక్తం సరఫరా మెరుగ్గా ఉంటుంది. ఆహారం..  బరువు తగ్గడం కోసమే కాకుండా, శరీర జీవక్రియలను క్రమబద్ధీకరించే పౌష్టికాహారాన్ని ఎంచుకోవాలి. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం ఎంత పరిమాణంలో ఉందో, అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో గమనించడం చాలా అవసరం. దీర్ఘకాలంలో గుండెకు మేలు చేసే బాలెన్స్డ్  ఆహారాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. కండరాలను బలంగా ఉంచే వ్యాయామాలు..  వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కండరాల సాంద్రత తగ్గుతుంది. అందుకే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా కండరాలను దృఢపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని, ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో రక్షణ ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం.. ఇప్పటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి చాలా సాధారణమైపోయింది. ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మనస్సును, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడానికి సంగీతం వినడం, ధ్యానం చేయడం, లోతైన శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. రోజులో కొంత సమయాన్ని మనస్సును తేలికపరిచే కార్యకలాపాల కోసం కేటాయించడం చాలా ఉపయోగకరం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏవేవో  ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ అలవాట్లలో నడకను భాగం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారానే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.  
60 ఏళ్లు దాటిన తర్వాత మతిమరుపు పెరగడం సహజమేనా? కుటుంబ సభ్యుల పేర్లు లేదా బంధుత్వాలను గుర్తుపట్టలేకపోవడం, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది పడటం వంటి మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి సాధారణ మతిమరుపు లక్షణాలా? లేక డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలకు సంకేతాలా? ఈ వీడియోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ 60 ఏళ్ల తర్వాత కనిపించే మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గడం, రోజువారీ పనుల్లో ఎదురయ్యే ఇబ్బందులు, అల్జీమర్స్ మరియు డిమెన్షియాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. జ్ఞాపకశక్తిలో మార్పులు కనిపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యుల సలహా ఎందుకు అవసరమో కూడా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో కొన్ని హోమియోపతి మందులు, వైద్య అనుభవాలకు సంబంధించిన విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. అయితే మతిమరుపు, డిమెన్షియా లేదా అల్జీమర్స్ సమస్యలకు సొంతంగా మందులు వాడకుండా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన వైద్య పరీక్షల ద్వారా సమస్యకు కారణాన్ని గుర్తించుకోవాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
ఆధునిక కాలంలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే మనస్సులో ఆందోళన, భయం, ఒక రకమైన అశాంతి కలగడం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.  బయటకు  పరిస్థితులన్నీ బాగున్నప్పటికీ, లోపల ఏదో తెలియని బెంగ మనశ్శాంతిని దూరం చేస్తుంది. దీనికి ఏదో పెద్ద సమస్యే కారణం కావాల్సిన అవసరం లేదు. మనకు తెలియకుండానే మనం పాటించే కొన్ని చిన్న చిన్న జీవనశైలి అలవాట్లే మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆందోళనను పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో వివరంగా తెలుసుకుంటే.. శారీరక శ్రమ లేకపోవడం.. శారీరక శ్రమ లేకపోవడం  మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రోజంతా ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగించడమే కాకుండా, మనస్సుకు ఉపశమనం కలిగించే హార్మోన్ల విడుదల తగ్గుతుంది. క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామం లేదా నడక చేయడం వల్ల మెదడులో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను మెరుగుపరుస్తాయి. శారీరక చురుకుదనం తగ్గినప్పుడు మనస్సులో నెగిటివ్ ఆలోచనలు పెరిగి ఆందోళనకు దారితీస్తాయి. సోషల్ మీడియా.. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించడం మానసిక అశాంతికి మరో ముఖ్యమైన కారణం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నిరంతరం ఫోన్ స్క్రీన్‌ను చూడటం, ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం వంటివి తెలియకుండానే ఒత్తిడిని పెంచుతాయి. డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే కాంతి నిద్ర లేమికి కారణమవుతుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మెదడు అలసిపోయి, చిరాకు , భయాలు పెరిగే అవకాశం ఉంది. చెడు అలవాట్లు.. మద్యపానం లేదా ఇతర వ్యసనాలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినట్లు అనిపించినప్పటికీ, ఎక్కువ  కాలంలో అవి మానసిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. ఇవి నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి, ఆందోళన తీవ్రతను మరింత పెంచుతాయి. శరీరం ఈ పదార్థాలపై ఆధారపడటం మొదలైనప్పుడు  అశాంతి మరింత తీవ్రమవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు.. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి నచ్చిన పనులపై దృష్టి పెట్టడం, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు , మంచి నిద్రను అలవర్చుకోవడం ఎంతో అవసరం. జీవనశైలిలో చేసుకునే ఈ చిన్న మార్పులు మానసిక ఒత్తిడిని తగ్గించి జీవితంలో ప్రశాంతతను నింపుతాయి.                                                                                                                                                  *రూపశ్రీ.