ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో అత్యంత కీలకమైన రెండో విడత ల్యాండ్ పూలింగ్ బుధవారం (జనవరి 7) మొదలైంది. రాజధాని ప్రాంతంలో రైల్వే ట్రాక్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడమే ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ లక్ష్యం. ఈ రెండో విడతలో భాగంగా బుధవారం (జనవరి 7) యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆరంభమైంది.
మొత్తం ఏడు గ్రామాల్లో దశలవారీగా అమలు చేయనున్న ఈ కార్యక్రమం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాలలో కొనసాగుతుంది. గుంటూరు జిల్లాలోని మూడు గ్రామాలు (వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి)లో 9,097.56 ఎకరాల పట్టా భూమి, 7.01 ఎకరాల అసైన్డ్ భూమి, అలాగే పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో 7,465 ఎకరాల పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరించనున్నారు.
ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను వచ్చే నెల 28 నాటికి పూర్తిచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేయనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/second-phase-land-poolins-started-36-212148.html
రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో పండుగకు నాలుగైదు రోజుల ముందే ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారు కుటుంబ సమేతంగా ఊర్లకు బయలుదేరడంతో తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ప్రయాణాల సందడే కనిపిస్తోంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది
తెలంగాణ రాష్ట్రంలో చైల్డ్ పోర్నోగ్రఫీ కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన సంచలన ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యికి సంబంధించి కల్తీ ఆరోపణల కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో జరిగిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కీలకోపన్యాసం చేశారు.
రాజాసాబ్ సినిమా టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటీషన్లపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది.
హైదరాబాద్ నగర శివారులోని మీర్‌పేట్ ప్రాంతంలో చోటు చేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు.
పక్క రాష్ట్రంతో సయోధ్య లేకుండా తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో కీలక ఊరట లభించింది.
పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు.
ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందితుడిగా చేర్చడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసుపై విస్తృతంగా వాదనలు విన్న హైకోర్టు.. నవదీప్ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలూ స్వాధీనం కాలేదని స్పష్టం చేసింది.