జగన్ తో సాయి రెడ్డి కటీఫ్! బీజేపీ డైరెక్షన్ లో వెన్నుపోటు? 

Publish Date:May 31, 2021

Advertisement

విజయసాయి రెడ్డి.. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్ తర్వాత నెంబర్ టు స్థానం విజయసాయి రెడ్డిదేనని ప్రచారం ఉంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, సీఎంవోలోనూ సాయి రెడ్డిదే హవా అని చెబుతారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఏ1గా జగన్ ఉండగా.. ఏ2గా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఈ కేసుల్లో జగన్ తో పాటు సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపారు సాయిరెడ్డి. అందుకే ఆయనకంత ప్రాధాన్యం అంటారు. అయితే  ప్రస్తుతం మాత్రం సీన్ మారినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, సీఎంవో నుంచి వస్తున్న లీకుల ఆధారంగా విజయసాయి రెడ్డిని సీఎం జగన్ దూరం పెట్టారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఎంపీ విజయసాయి రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి రాకపోవడం, ముఖ్యమంత్రిని కలవకపోవడం ఇందుకు బలాన్నిస్తున్నాయి. సీఎం జగన్ రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ఎక్కడా సాయి రెడ్డి  కనిపించ లేదు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చేసే విజయసాయి రెడ్డి... ముఖ్యమైన ప్రోగ్రామ్ లో సైలెంట్ గా ఉండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయి రెడ్డిని తన దగ్గరకు రానివ్వడం లేదని తెలుస్తోంది. అందుకే అతను విశాఖకే పరిమితం అయ్యారని అంటున్నారు. విశాఖకు సంబధించిన ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎంపీ ప్రోటోకాల్ ప్రకారమే తప్ప ఇతరత్రా గతంలోగా విజయసాయికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెబుతున్నారు. గతంలో విశాఖలో ఏం జరిగినా అంతా సాయిరెడ్డి చెప్పినట్లే ఉండేది. కాని ఇప్పుడా సీన్ కనిపించడం లేదు. ఇటీవలే తూర్పు తీరంలో యాస్ తుఫాన్ వచ్చింది. ఏపీపైనా ప్రభావం పడింది. అయితే తుపానుపై జరిగిన సమీక్షల్లో విజయసాయి ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు సీఎస్ ఆధిత్యనాథ్ ను విశాఖ పంపించారు సీఎం జగన్. సీఎస్సే రెండు రోజుల పాటు అక్కడే ఉండి పర్యవేక్షించారు. విజయసాయి రెడ్డి విశాఖలోనే ఉన్నా..  తుపాను సమయంలో ముఖ్యమంత్రి అతన్ని పట్టించుకోకపోవడం చర్చగా మారింది.  

గత సంవత్సరం ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకైన సమయంలోనూ ఎంపీ విజయసాయిని పక్కన పెట్టారు సీఎం జగన్. విజయవాడ నుంచి జగన్ తో పాటు ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖ వచ్చేందుకు విజయసాయి ప్రయత్నించారు. అయితే విజయసాయిని కిందకు దించి వైద్య శాఖ మంత్రి అళ్లనానిని తనతో పాటు తీసుకెళ్లారు జగన్. ఈ ఘటన అప్పడు సంచలనంగా మారింది. విజయసాయిని ఆగమని జగన్ చెబుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. అప్పటి నుంచే సాయి రెడ్డిని జగన్ క్రమంగా దూరం పెడుతున్నారని, ఇప్పుడా గ్యాప్ మరింతగా పెరిగిపోయిందని తెలుస్తోంది. జగన్ తనను దూరం పెట్టడం వల్లే విజయసాయి తాడేపల్లి రావడం లేదని అంటున్నారు. సాయి రెడ్డికి షాకిచ్చిన జగన్.. అతనికి గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇస్తున్నారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

జగన్ రెడ్డి , విజయసాయి రెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వస్తున్న సమయంలోనే మరో ఆసక్తికరమైన ఘటన జరిగింది. జగన్​మోహన్ రెడ్డిపై ఇప్పటికే 11 సీబీఐ, 6 ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి. తాజాగా ఈడీ దాఖలు చేసిన మరో ఛార్జ్​షీట్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీంతో సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్‌పై కేసుల సంఖ్య 18కి చేరాయి. తాజా కేసుకు సంబంధించి ఈడీ  గత ఏడాదిలోనే ఛార్జ్​షీట్ దాఖలు చేసినప్పటికీ.. కొన్ని లోపాల వల్ల న్యాయస్థానం దానిని రిజెక్ట్ చేసింది. మార్చిలో మళ్లీ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. తాజాగా నమోదైన 18వ కేసులో జగన్‌ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఇందూ గ్రూపు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అనూహ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగించారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. విజయసాయి రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చేసిన లాబీయింగ్ వల్ల ఇలా జరిగిందా అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ హైకమాండ్ తో విజయసాయి రెడ్డి సంబంధాలు పెంచుకోవడం కూడా జగన్ .. అతన్ని దూరం పెట్టడానికి కారణమనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. 

తాజాగా జరుగుతున్న పరిణామాలతో జగన్ అక్రమాస్తుల కేసులో ఏదైనా జరగవచ్చని, జగన్ పై కోపంతో విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారినా ఆశ్చర్యం లేదనే టాక్ కూడా నడుస్తోంది. బీజేపీ పెద్దలతో కలిసి విజయసాయి రెడ్డి.. జగన్ పై  కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన కూడా  కొందరు వైసీపీ నేతల్లో ఉందంటున్నారు. అందులో భాగంగానే  గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన కేసులో సాయి రెడ్డి పేరు తొలగించారనే వాదనలు వస్తున్నాయి. ఇక బెయిల్ రద్దై జగన్ జెైలుకు పోతే ముఖ్యమంత్రి కావాలని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై విచారణ మొదలైంది. ఈ సమయంలో  మంత్రి పెద్దిరెడ్డికి  విజయసాయి రెడ్డి తోడైతే ఏపీలో అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా వైసీపీలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని, సీఎం జగన్ కేసుల్లో ఏదైనా జరగవచ్చనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.