బుద్ధా చెబుతోంది నిజమేనా?

Publish Date:Jun 11, 2022

Advertisement

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన సమాచారం జగన్ కు ముందే తెలుసా? వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు చేస్తున్న తాజా దర్యాప్తు క్రమాన్ని చూసినా, టీడీపీ నేత బుద్దా వెంకన్న చెబుతున్న మాటల్ని గమనించినా వాస్తవం లేకపోలేదేమో అనే మాట వినిపిస్తోంది. ఈ హత్య గురించి ముఖ్య నేతకు ముందే తెలుసని, అందుకే బాబాయ్ హత్యపై ఎక్కడా మాట్లాడడం లేదని బుద్దా వెంకన్న ఆరోపిస్తున్నారు. వివేకా హత్యకేసులో నిందితులను ఎందుకు కాపాడుతున్నారని బుద్దా నిలదీస్తున్నారు. ఈ హత్య కేసు నిందితులు అనుమానాస్పదంగా ఎందుకు మరణిస్తున్నారంటూ బుద్దా వెంకన్న ప్రశ్నిస్తున్నారు.

మరో పక్కన.. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ అధికారులు మరింత ముమ్మరం చేశారు. దాంట్లో భాగంగా పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వ సర్వేయర్ తో కొలతలు తీయించడం, వీడియో, ఫొటోలు తీయించడం కూడా బుద్దా వెంకన్న మాటల్లో కొంతైనా నిజం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క్యాంపు ఆఫీసుతో పాటు అవినాశ్ రెడ్డి ఇంటికి కూడా సీబీఐ అధికారులు కొలతలు తీయించిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. నిప్పు లేనిదే పొగ రాదంటారు. వివేకా కేసులో సీబీఐ అధికారులకు లింక్ ఏదో దొరికి ఉండొచ్చని, అందుకే తమ దర్యాప్తును జగన్, అవినాశ్ రెడ్డి ఇళ్ల నుంచి కూడా చేస్తుండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య కుట్ర వెనుక ఓ కీలక మహిళ హస్తం ఉందని, ఆ ‘శివగామి’ ఎవరనే చర్చ కూడా గతంలో బాగా జరిగిన వైనాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు.

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో వివేకా హత్య జరిగింది.  అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అప్పట్లో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో గెలిచి, తాను సీఎం అయినా ఈ హత్య కుట్రను ఛేదించే విధంగా ఎందుకు ప్రయత్నించలేదనే ప్రశ్నలు పలువురి నుంచి వ్యక్తం అవుతున్నాయి. కేసు విచారణలో అసలు వాస్తవాలు బయటికి వస్తే.. బాగా కావాల్సిన వారెవరో ఇరుక్కుపోతారనే ముఖ్యనేత అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదేమో?  అని ఇంత వరకూ అంతా అనుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు బుద్ధా వెంకన్న ఆరోపణలు, సీబీఐ దర్యాప్తు గమనించిన తరువాత  అందుకేనన్న నిర్ధారణకు వస్తున్నారు.

వివేకా హత్య కేసులో ముద్దాయిలెవరో తేల్చకుండా జగనే అడ్డుకుంటున్నారని జనం అనుకుంటున్నారన్న టీడీపీ నేత వర్ల రామయ్య మాటల్లో వాస్తవం లేకపోలేదంటున్నారు. అసలు ముద్దాయిలెవరో తేల్చాల్సిన బాధ్యత సీఎంగా జగన్ కు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై జగన్ ఆధ్వర్యంలోని స్థానిక పోలీసులు కేసులు పెట్టడం వెనక కారణం ఏంటో తెలియాలంటున్నారు. బాబాయ్ ని చంపిన అసలు ముద్దాయిలెవరో బయటికి రాకూడదు, అసలు ముద్దాయిలు అరెస్ట్ కాకూడదనే ఆలోచన ఎవరిదని వర్ల ప్రశ్నించడం గమనార్హం.

వివేకా హత్య మిస్టరీ వెనుక అసలు రహస్యం మూడేళ్లు దాటిపోయినా వెలికి రాలేదు. సరికదా.. ఈ కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరికి బెదిరింపులు రావడం, ప్రాణహాని భయంతో దస్తగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, ఇదే కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించడం వెనుక పెద్ద తలకాయల ఒత్తిడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిటాల రవి హత్య తర్వాత మొద్దు శీనుతో పాటు నిందితులు, సాక్షులు ఎలా చనిపోయారో ఇప్పుడూ అదే జరుగుతోందని బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివేకా మర్డర్ కేసుకు సంబంధించి మరిన్ని సంఘటనలు భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డికి కూడా ప్రాణహాని ఉండొచ్చని, వారికి రక్షణ కల్పించాలనే డిమాండ్ వస్తోంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.