చిలుకూరు అర్చకుడు రంగరాజన్ పై దాడి రాజకీయమయ్యిందా? 

Publish Date:Feb 11, 2025

Advertisement

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై  దాడి ఘటన  తెలంగాణలో పొలిటికల్ టర్న్ తీసుకుంది. రామరాజ్యం పేరిట వీరరాఘవరెడ్డి రంగరాజన్ నివాసానికి వెళ్లి దాడి చేయడాన్ని ప్రతిపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ఇప్పటికే రంగరాజన్ నివాసానికి వచ్చి పరామర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన విమర్శలు చేశారు.  కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ లోనే రంగరాజన్ ను పరామర్శించారు. అవసరమైతే కేంద్ర బలగాలను రక్షణగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఘటనపట్ల తీవ్ర నిరసన వ్యక్తం  చేశారు. సనాతన ధర్మంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. రంగరాజన్ పై దాడి వ్యక్తిగతంగా చూడకూడదని హిందుత్వంపై జరిగిన  దాడిగా చూడాలని ఆర్ఎస్ఎస్ తో బాటు మిగతా హిందుత్వ సంఘాలు అభివర్ణించాయి. 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగరాజన్ కు ఫోన్ లోనే పరామర్శించారు. . పోలీసులు  తగు చర్యలు తీసుకోగలరని ముఖ్యమంత్రి  హామి ఇచ్చారు.దేవాదాయ శాఖా మంత్రి కొండా  సురేఖ ఘటన తర్వాత రంగరాజన్ నివాసానికి చేరుకుని  పరామర్శించారు. ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ రంగరాజన్ పై దాడి హిందుత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఆయన  యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు రంగరాజన్ పై దాడికి గల కారణాలను పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. రామరాజ్యం పేరిట వీర రాఘవరెడ్డి ప్రయివేటు సైన్యాన్ని పెంచి పోషిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కొందరు యువకులను రామరాజ్యం ఆర్మీలో రిక్రూట్ చేసుకున్నాడు. నెలకు 20 వేల రూపాయల జీతం ఇస్తానని ఆశచూపి పెద్ద ఎత్తున యువకులను రిక్రూట్ చేసుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలకు వెళ్లి విరాళాలు సేకరించడం అతడి టార్గెట్ . ఇందులో భాగంగానే ఈ నెల 7న చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్  ఇంట్లో ఎంటర్ అయ్యాడు . విరాళాలు అడిగాడు. చిలుకూరు బాలాజీ దేవాలయంలో హుండీ లేకపోవడం తగదని వీర రాఘవరెడ్డి వర్గీయులు వారించారు. బూట్లతో రంగరాజన్ నివాసంలో  ప్రవేశించడమే గాకుండా దేవాలయాన్ని తమకు అప్పగించేయాలని డిమాండ్ చేశారు. రామరాజ్యం రావాలంటే దేవాలయంలో హుండీ ఏర్పాటు చేయాల్సిందేనని బెదిరించారు.  ఆయన తనకు తాను రాముడి అంశ అని చెప్పుకునేవాడు.  రంగరాజన్ పై దాడి చేసిన రామరాజ్యం ప్రయివేటు సైన్యంలోని ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు. వీరిలో కర్త, కర్మ, క్రియ అయిన వీర రాఘవరెడ్డి కూడా ఉన్నారు. రామరాజ్యం పేరిట సంఘ విద్రోహకార్యకలాలు ఏమైనా జరిగాయా అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. 
ఉస్మానియా యూనివర్శిటీ మాజీ రిజిస్టార్ ప్రొఫెసర్ సౌందర్యరాజన్ పూర్వికులు ఈ దేవాలయానికి వంశపారపర్యంగా అర్చకులుగా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడే రంగరాజన్ ఈ దేవాలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారు. 1988 బయో మెడికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆగమశాస్త్రాలు కూడా ఆయన చదువుకున్నారు. 
చిలుకూరి బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఉంది. దీనిని విసా బాలాజీ అనేమరో పేరు ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లు ఇక్కడికి వస్తుంటారు. 1995లో అర్చక ప్రవేశం పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 
చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని దేవాదాయ శాఖలో కలపాలనే ప్రభుత్వ ప్రయత్నాలను రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్  గట్టిగానే అడ్డుకున్నారు.. సుప్రీంకోర్టు నుంచి మార్గదర్శకాలను తెచ్చుకున్నారు.  రాష్ట్రంలోని ప్రయివేటు గుళ్ల యజమానుల తరపున పోరాడే వన్ మ్యాన్ ఆర్మీ సౌందర్య రాజన్ . మూడు భాషల్లో వెలువడే వాక్ అనే ఆధ్యాత్మిక పత్రికకు సంపాదకులుగా ఉన్నారు అర్చకవారసత్వాన్ని రద్దుచేయాలని ప్రభుత్వ నిర్ణయంపై సౌందర్య రాజన్ గట్టిగానే పోరాడారు. ఆయన కున్న ముగ్గురు కొడుకుల్లో రంగరాజన్ రెండో వాడు. దేవాదాయశాఖ  అధికారి ఒకాయన మీకు ఉన్న ముగ్గురు కొడుకులు విద్యాధికులు. మీరు రిటైర్డ్ రిజిస్టార్. కొడుకులు అర్చకవృత్తికి దూరంగా ఉన్నారు. అర్చక వారసత్వం కోసం  ఎందుకు? దేనికి  పోరాడుతున్నారు అని ప్రశ్నిస్తే నేను అర్చకత్వం చేస్తానని రంగరాజన్ ముందుకొచ్చారు. అప్పటికే లక్షల రూపాయల జీతాన్ని వదిలేసి అర్చకత్వం స్వీకరించిన రంగరాజన్ పై జరిగిన దాడిని ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు  ఖండిస్తున్నారు. . రంగరాజన్ కు బాసటగా నిలుస్తున్నారు.  

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.