Publish Date:Oct 10, 2022
టీఆర్ ఎస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మర్యాద గీత ఉంటుందన్న విషయాన్ని ఆయన ఎన్నడూ గుర్తించరు. రాజకీయ అవసరం, లబ్ధికి మించిన ప్రధానమైన అంశమేదీ ఆయన దృష్టిలో ఉండదు. జాతీయ రాజకీయాలలో అజాత శత్రువుగా అందరూ గౌరవించే మలాయం సింగ్ యాదవ్ గత నెలన్నరగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా ఒక్కసారయినా వెళ్లి పరామర్శించ లేదు.
కానీ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న తన ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసం ఆయన దేశ వ్యాప్తంగా పర్యటనలు చేసి పలువురు రాజకీయ నేతలతో భేటీ అయ్యారు. అంతేనాతనకు మద్దతు లభిస్తుందనుకుంటే.. వారికి చార్టర్ విమానాలు పంపి మరీ ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. అలాగే ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు చార్టర్ విమానాన్ని పంపించి మరీ రాష్ట్రానికి రప్పించారు. ఆయనతో భేటీ అయ్యారు. అయితే కేసీఆర్ జతీయ పార్టీ ఏర్పాటుకు ఇతర రాష్ట్రాల నుంచీ, ఇతర పార్టీల నాయకుల నుంచీ అనుకున్నవిధంగా స్పందన రాలేదు. ఇందుకు ఆయన యాటిట్యూడ్ కారణమని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఆయనకు రాజకీయ లబ్ధి ఆలోచనే తప్ప ఏ రాజకీయపార్టీతోనూ, నాయకులతోనూ ప్రత్యేకించి సత్సంబంధాలు పెట్టుకున్నట్టు ప్రత్యేకించి రాజకీయ నేతలతో స్నేహ సంబధాలు పెనవేసుకున్న సందర్భమూ లేదు. ఆయన పొత్తులూ, ములాఖత్ లూ అన్నీ రాజకీయమే. అందుకే అఖిలేష్ కు చార్టర్ ఫ్లైట్ పంపి మరీ ఆహ్వానించిన కేసీఆర్.. అదే అఖిలేష్ తండ్రి తీవ్ర అనారోగ్యంతో దాదాపు నెలన్నరగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే కేసీఆర్ కనీసం ఒక్కటంటే ఒక్కసారైనా వెళ్లి పరామర్శించలేదని రాజకీయ వర్గాలలో విమర్శలు వినవస్తున్నాయి.
ఇపుడు బీఆర్ ఎస్ పేర జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్‌కు దక్షిణాది కంటే ఉత్తరాది రాజకీయ పార్టీలు, నాయ కులతో స్నేహబంధాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చిత్రమేమంటే ఇంతవరకూ ఆయనకు ఉత్తరాది నుంచి ఎటువంటి మద్దతూ, ప్రోత్సాహం అభించలేదు. చివరాఖరికి పార్టీ పేరు మార్చిన సభకు హాజరైన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కూడా సభ తరువాత స్వరాష్ట్రానికి వెళ్లి తమరాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ చేయదనీ, తమ పార్టీకి బీఆర్ఎస్ కూ ఎలాంటి పొత్తూ లేదని ప్రకటించారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ములాయం సింగ్ అంత్యక్రియలలో పాల్గొనేందుకు కేసీఆర్ యూపీ వెళుతున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం (అక్టోబర్ 11) జరుగుతాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-kcrs-attotude-a-hurdle-for-his-national-politics-25-145210.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.