Publish Date:Oct 19, 2022
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుమార్తె కవితను రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం పెడుతున్నారా? అందుకు అవసరమైన రంగం సిద్ధం చేసేశారా? అంటే తెరాస వర్గాలు ఔననే అంటున్నాయి. ఆమెను బీఆర్ఎస్ జాతీయ అంతర్జాతీయ మీడియా కోఆర్డినేటర్ ఢిల్లీకే పరిమితమౌతారని తెరాస వర్గాలలో చర్చ జరుగుతోంది.
ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు ప్రపంచ గ్రీన్ సిటీ అవార్డు లభించిన నేపథ్యంలో దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ మీడియాకే కాకుండా అంతర్జాతీయ మీడియాకు కూడా అడ్వర్టైజ్ మెంట్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందు కోసం ఢిల్లీలో ఆయన బస చేసిన సమయంలోనే కవితను ఆ వ్యవహారాలన్నీ సమన్వయం చేయాల్సిందిగా ఆదేశాంచారని చెబుతున్నారు. ఇందుకోసమే ఇన్ఫర్మేషన్ కమిషనర్ అరవింద్ కుమార్ ను ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించుకున్నట్లు చెబుతున్నారు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్పు చేస్తూ జాతీయ పార్టీగా ప్రకటించిన అనంతరం హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన సందర్భాన్ని పూర్తిగా ఉపయోగించుకుని దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఏఐపిహెచ్ 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ మొత్తం 'వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ విభాగంలో మరొకటి గెలుచు కుంది. దేశం మొత్తంలో ఈ పురస్కారాలకు ఎంపిక అయిన ఏకైక ఇండియన్ సిటీ హైదరాబాద్ మాత్రమే కావడం గమనార్హం.
దేశంలోని నగరాలన్నిటినీ తోసి రాజని అంతర్జాతీయ అవార్డునకు హైదరాబాద్ ఎంపిక కావడం రాష్ట్ర పురోగతి, ప్రగతి పట్ల తెరస ప్రభుత్వం చూపిన శ్రద్ధ, కృషి ఉన్నాయని కేసీఆర్ చెబుతున్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజధానిని అగ్రభాగంలో నిలబెట్టిన తన పాలనా దక్షతకు ఈ అవార్డులే నిదర్శనమని చెబుతున్న కేసీఆర్.. ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. కేవలం జాతీయ మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలో కూడా తెలంగాణ ఘనతను చాటాలని నిర్ణయించారు.
ఇందు కోసం భారీ ఎత్తున ప్రకటనలు విడుదల చేయాలని నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. దేశంలోని అన్ని నగరాల కంటే అత్యద్బుతంగా అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ ఖ్యాతిని ప్రచారం చేయడం ద్వారా తన ప్రభుత్వ పని తీరును విశ్వవ్యాప్తం చేసుకునే ఉద్దేశంతో ఆయన ఉన్నారని అంటున్నారు. అలాగే జాతీయ అంతర్జాతీయ మీడియా సమన్వయ కర్తగా తన కుమార్తె కవిత హస్తినకు పరిమితం చేయడం ద్వారా లిక్కర్ స్కాం ప్రకంపనలు జాతీయ పార్టీపై ప్రబావం చూపకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాల నుంచి కవితను దూరం పెట్టడం ద్వారా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమెపై వచ్చిన ఆరోపణల ప్రభావం ఇక్కడ ప్రతిఫలించకుండా ఉండేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెరాస వర్గాలే చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-kavitha-side-tracked-in-telangana-politics-25-145704.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.