రాష్ట్ర రాజకీయాల నుంచి కవితను తప్పించినట్లేనా?

Publish Date:Oct 19, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుమార్తె కవితను రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం పెడుతున్నారా? అందుకు అవసరమైన రంగం సిద్ధం చేసేశారా? అంటే తెరాస వర్గాలు ఔననే అంటున్నాయి. ఆమెను బీఆర్ఎస్ జాతీయ అంతర్జాతీయ మీడియా కోఆర్డినేటర్ ఢిల్లీకే పరిమితమౌతారని తెరాస వర్గాలలో చర్చ జరుగుతోంది.

ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు ప్రపంచ గ్రీన్ సిటీ అవార్డు లభించిన నేపథ్యంలో దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ మీడియాకే కాకుండా అంతర్జాతీయ మీడియాకు కూడా అడ్వర్టైజ్ మెంట్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందు కోసం ఢిల్లీలో ఆయన బస చేసిన సమయంలోనే కవితను ఆ వ్యవహారాలన్నీ సమన్వయం చేయాల్సిందిగా ఆదేశాంచారని చెబుతున్నారు. ఇందుకోసమే  ఇన్ఫర్మేషన్ కమిషనర్ అరవింద్ కుమార్ ను ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించుకున్నట్లు చెబుతున్నారు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్పు చేస్తూ జాతీయ పార్టీగా ప్రకటించిన అనంతరం హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన సందర్భాన్ని పూర్తిగా ఉపయోగించుకుని దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెద్ద  ఎత్తున ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఏఐపిహెచ్‌ 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ మొత్తం 'వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ విభాగంలో మరొకటి గెలుచు కుంది. దేశం మొత్తంలో ఈ పురస్కారాలకు ఎంపిక అయిన ఏకైక ఇండియన్ సిటీ హైదరాబాద్ మాత్రమే కావడం గమనార్హం.

దేశంలోని నగరాలన్నిటినీ తోసి రాజని అంతర్జాతీయ అవార్డునకు హైదరాబాద్ ఎంపిక కావడం రాష్ట్ర పురోగతి, ప్రగతి పట్ల తెరస ప్రభుత్వం చూపిన శ్రద్ధ, కృషి ఉన్నాయని కేసీఆర్ చెబుతున్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజధానిని అగ్రభాగంలో నిలబెట్టిన తన పాలనా దక్షతకు ఈ అవార్డులే నిదర్శనమని చెబుతున్న కేసీఆర్.. ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. కేవలం జాతీయ మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలో కూడా తెలంగాణ ఘనతను చాటాలని నిర్ణయించారు.

ఇందు కోసం భారీ ఎత్తున ప్రకటనలు విడుదల చేయాలని నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. దేశంలోని అన్ని నగరాల కంటే అత్యద్బుతంగా అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ ఖ్యాతిని ప్రచారం చేయడం ద్వారా తన ప్రభుత్వ పని తీరును విశ్వవ్యాప్తం చేసుకునే ఉద్దేశంతో ఆయన ఉన్నారని అంటున్నారు. అలాగే జాతీయ అంతర్జాతీయ మీడియా సమన్వయ కర్తగా తన కుమార్తె కవిత  హస్తినకు పరిమితం  చేయడం ద్వారా లిక్కర్ స్కాం ప్రకంపనలు జాతీయ పార్టీపై ప్రబావం చూపకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాల నుంచి కవితను దూరం పెట్టడం ద్వారా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమెపై వచ్చిన ఆరోపణల ప్రభావం ఇక్కడ ప్రతిఫలించకుండా  ఉండేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెరాస వర్గాలే చెబుతున్నాయి.  

By
en-us Political News

  
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.