ముందస్తు ముచ్చట ఇక ముగిసినట్టేనా?

Publish Date:Jul 16, 2022

Advertisement

ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారా? వరసగా మూడవసారి ముఖ్యమంత్రి అవుతారా? అంటే, ఎవరి విషయం ఎలా ఉన్నా, మంత్రి కేటీఆర్‌ మాత్రం, అనుమానమే లేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు, మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని చాలా  ధీమాగా ఉన్నారు. అంతే కాదు, మా సర్వేలే కాదు, కాంగ్రెస్, బీజేపీ సుర్వేలు కూడా అదే చెపుతున్నాయని, కేటీఆర్ చెప్పుకొచ్చారు. గత మూడు నాలుగు రోజులుగా, రాష్ట్రంలో సాగుతున్న సర్వేల సంవాదానికి ముక్తాయింపు అన్నట్లుగా ఆయన తమ సొంత సర్వే ‘కేసీఆర్ 90’  అంటోందని చెప్పు కొచ్చారు.  

అయితే, అదే క్రమంలో కేటీఆర్, ముందస్తు ఎన్నికల విషయంలో మాత్రం వెనకడుగు వేశారు. అసెంబ్లీ రద్దుకు ముందే, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలు ప్రకటించాలని, అలా ప్రకటిస్తేనే ముందస్తుకు వెళతామని, కండిషన్ పెట్టారు. అయితే, అది ఎటూ అయ్యేది కాదని తెలిసే, కేటీఆర్ ఈ చిత్రమైన కండిషన్ తెర మీదకు తెచ్చారని, విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

కేటీఆర్  తీరు చూస్తుంటే ఆడలేక మద్దెల ఓడన్నట్లుందని విపక్ష నేతలు అంటున్నారు. ముందస్తుకు వెళ్ళాలా వద్దా అనేది తేల్చుకోవలసింది, అధికార తెరాస. అంతే కానీ, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం లేదా రాష్ట్రంలోని ప్రతిపక్షాలో కాదని, దమ్ముటే  గెలుస్తామనే ధీమా ఉంటే ముందస్తుకు వెళ్ళాలి  లేదంటే చేతకాదని చేతు లెత్తేయాలని  ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. నిజానికి, కేసీఆర్, కేటీఆర్ జోడీకి ముందస్తుకు వెళ్ళే ధైర్యం లేదని, అందుకే చేసిన సవాలు వెనక్కి తీసుకునేందుకు తెరాస నాయకులూ తంటాలు పడుతున్నారని అంటున్నారు.  

నిజానికి, కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కాంగ్రెస్, బీజేపీలకు సవాలు విసిరారు. ఆ రెండు పార్టీలు ఓకే అంటే  వెంటనే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు తాము సిద్దంగా ఉన్నామని  ప్రకటించారు అయితే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ముఖ్యమంత్రి సవాలును స్వీకరించడతో తెరాస నేతలు ఒకరొకరు బయటకొచ్చి  మెలికలు పెట్టడం మొదలు పెట్టారని అంటున్నారు. ఆ క్రమంలోనే కేటీఆర్ ఇప్పడు, ముందస్తుకు ముచ్చటే లేదని తేల్చేశారు. ఈ నేపధ్యంలో గత రెండు మూడు రోజులుగా సాగుతున్న, సర్వే డ్రామాలపై కూడా  స్టేజి మ్యానేజ్డ్  షోలు కాదు కదా  ఆనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అలాగే  కేటీఆర్ ఓ వంక తమ సర్వే ప్రకారం తెరాసకు తిరుగేలేదని, 90 సీట్లు వస్తాయని చెపుతూనే, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో కొంత మేరకు ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అంగీకరించడం అధికార పార్టీ బలహీనత అడ్డం పడుతోందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, కేటీఆర్ లో కానీ,ఆ మాట కొస్తే ఈ మధ్య ప్రెస్ మీట్లో  రెండున్నర గంటలు మాట్లాడిన కేసీఆర్ లో కానీ, ముందున్న విశ్వాసం కనిపించ లేదని అంటున్నారు.  అలాగే పార్టీలో కొట్లాటలు ఉన్నాయని అంగీకరించడం ద్వారా కేటీఆర్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఫేస్ చేసే పరిస్థితి లేదని   అంటే, తెరాసలో అంతా బాగుందనుకునేందుకు లేదని చెప్పకనే చెప్పారని అంటున్నారు.  

అలాగే ప్రజల్లో రోజు రోజుకూ పెరుగతున్న ప్రభుత్వ వ్యతిరేకతను కూడా కేటీఆర్ అంగీకరించారు, అందుకే ఆయన కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్ష‌న్లు త్వరలో ఇస్తామ‌ని ప్రకటించారు. రాష్ట్రంలో చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల మంజూరు నిలిపివేశారు. ఆసరా పెన్షన్ల విషయం అయితే  చెప్పనే అక్కరలేదు. అలాగే, ప్రభుత్వఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ అన్నిట్నీ మించి ధరణి పోర్టల్ పెద్ద సమస్యగా మారింది. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అందుకే కావచ్చును. ధరణిలోనూ మార్పులు చేస్తామని చెబుతున్నారు. సో,  కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమని ఏంత గట్టిగా చెప్పినా, ఆయన మాటల్లో ముందున్న విశ్వాసం మాయమై పోయినట్లే కనిపిస్తోందని, అందుకే, ముందస్తు ముచ్చటకు ముగింపు పలికారని, పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.