చక్రి ఆత్మహత్య చేసుకున్నారా?

Publish Date:Dec 20, 2014

Advertisement

 

ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం చిత్ర పరిశ్రమను, ఆయన అభిమానులను విషాదంలో ముంచింది. ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న చక్రి మరణం ఎంతో బాధాకరం. చక్రి మరణించక ముందు రోజు వరకూ ఆయన జీవితం గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కేవలం శరీరం విపరీతంగా లావుగా వుంటుందే తప్ప... మరే విషయంలోనూ ఆయనకు ఎలాంటి లోటూ లేదని అందరూ భావించారు. వందకు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన చక్రి కోట్లకు కోట్లు సంపాదించారని అందరూ అనుకుంటారు. అయితే ఆయన జీవితం వెనుక అసలు విషయాలు ఆయన మరణం తర్వాత బయటపడుతున్నాయి. అలా బయటపడిన అనేక విషయాలు చక్రి అందరూ అనుకుంటున్నట్టుగానే స్థూలకాయం కారణంగా గుండెపోటుతో మరణించారా... లేక ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే సందేహాలను ఆయన అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాల్లో కలిగిస్తున్నాయి.

 

శరీరం విపరీతంగా పెరిగిపోయిన చక్రి నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటూనే వుండేవారు. ఆయన గుండెకు ఎలాంటి సమస్య లేదని డాక్టర్లు చెప్పారని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారు. అలాంటప్పుడు ఆయన ఇంత అకస్మాత్తుగా ఎందుకు మరణిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే చక్రి మరణించిన రోజు అర్ధరాత్రి రెండు.. రెండున్నర వరకు మేలుకునే వున్నారట. తెల్లవారు ఝామున ఆరుగంటలకు చూస్తే చక్రి చనిపోయి వున్నారు. అయితే అప్పటికే ఆయన పూర్తిగా నల్లగా మారిపోయి వున్నారు. ఒకవేళ నిద్రలో గుండెపోటుతో మరణిస్తే శరీరం నల్లగా ఎందుకు మారిపోయింది? అది కూడా కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఆయన శరీరం అలా ఎందుకు మారిపోతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

చక్రి మరణించిన తర్వాత ఆయన కుటుంబంలో ఉన్న వివాదాలు బయటపడ్డాయి. చక్రి తల్లి, తమ్ముడు, సోదరీమణుల మధ్య, చక్రి భార్య శ్రావణి మధ్య విభేదాలు బయటపడ్డాయి. చక్రికి శ్రావణి విషం పెట్టి చంపేసిందని మిగతా కుటుంబ సభ్యులు ఆరోపించారట. ఈ విషయాన్ని చక్రి భార్యే బయటపెట్టారు. తనను చక్రి వైపు బంధువులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పారు. హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణభయం వుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. చక్రితో ఎలాంటి బంధుత్వమూ లేనివారు చక్రి మరణాన్ని తలచుకుని బాధపడుతుంటే, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆస్తిపాస్తుల కోసం చక్రి మరణాన్ని ‘హత్య’గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, వివాదం హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకూ వెళ్ళడం చేశారు. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. ఇంత గొడవ అయిన తర్వాత వాళ్ళంతా మనం మనం బంధువులం అనుకుని రాజీ పడిపోయారు. కానీ వారు చేసిన గొడవ వల్ల చక్రికి ఏర్పడిన అప్రతిష్ఠని చెరిపేయగలరా?

 

చక్రి మరణం తర్వాత జరిగిన గొడవ సంగతి అలా వుంచితే, చక్రి ఆత్మహత్యకు పాల్పడి వుంటారన్న సందేహాలను ఆయన అభిమానులు, సినిమా రంగంలోని వారు వ్యక్తం చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి ముంచుకొచ్చిన మానసిక ఒత్తిడి చక్రిని ఆత్మహత్యకు ప్రేరేపించి వుండవచ్చా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న వయసులోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న చక్రి బాగానే సంపాదించారు. అయితే ఆయన సంపాదన మొత్తం ఖర్చయిపోయిందని ఆయన భార్యే చెబుతున్నారు. ఒక్క ఇల్లు తప్ప బ్యాంకులో బ్యాలన్స్‌ ఏమీ లేదని చక్రి బాధపడేవారట. సినిమాలు లేక, పని చేసిన సినిమాలు కూడా విజయ సాధించక చక్రి మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యేవారట. చేతిలో డబ్బు లేదు, సినిమాలు లేవు... ఈ డిసెంబర్ 31వ తేదీ కోసం ఒక ఫంక్షన్‌ ఈవెంట్ నిర్వహించాలని చక్రికి ఆహ్వానం వస్తే ఆయన చాలా సంతోషించారట. మనకి ఇప్పుడు కొంత డబ్బు వస్తుందని సంబరపడిపోయారట. చివరికి ఆ ఈవెంట్ కూడా కేన్సిల్ అయిపోయేసరికి బాగా డీలా పడిపోయారట. ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన చక్రి ఏదో కాస్తంత డబ్బు వచ్చే ఒక ఈవెంట్ మిస్ అయిందని డీలాపడిపోయారంటే ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ‘ఎర్రబస్సు’ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న చక్రి ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయేసరికి బాగా నిరాశపడిపోయారట. ఇవన్నీ ఆయన భార్యే వెల్లడించారు.

 

సంపాదించిన డబ్బంతా ఖర్చయిపోయింది. బ్యాంక్ బ్యాలన్స్ నిల్ అయింది. దానికితోడు చేతిలో సినిమాలు లేవు. దానికితోడు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా సహకరించని భారీ కాయం. ఉన్న ఫ్రెండ్సందరూ మందుపార్టీ ఫ్రెండ్సే తప్ప మనసుకు ఊరటనిచ్చే ఫ్రెండ్స్ కాదు. చక్రికి పిల్లలంటే ఇష్టం. తమ దంపతులకు పిల్లలు పుడితే వాళ్ళని సినిమా సంగీత రంగంలో తన వారసులుగా తీర్చిదిద్దాలని చక్రి తపించేవారట. అయితే చక్రి భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదట. పిల్లల కోసం ఎన్నో ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. పిల్లలు కలగకపోవడం ఎంత పెద్ద బాధో దాన్ని అనుభవించిన వారికి తెలుస్తుంది. వీటికి తోడు చక్రి భార్యకి, చక్రి కుటుంబానికి మధ్య నిరంతరం ఘర్షణలు. చక్రి చనిపోయిన ముందు రోజు కూడా చక్రి తల్లి, చక్రి భార్య ఇద్దరూ గొడవపడ్డారట. దాంతో చక్రి కుటుంబం మొత్తం చక్రి ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోయిందట. చక్రికి విజయాల విజయాలు వచ్చి పాపులర్ అయ్యేరేగానీ, మానసికంగా చక్రి చాలా చిన్నపిల్లాడు. అలాంటి చిన్న పిల్లాడిని ఇన్ని ఒత్తిడులు ఒక్కసారిగా చుట్టుముడితే, ఒత్తిడులను తప్పించుకునే దారి కనిపించకపోతే ఏమవుతుంది? ఆ చిన్నపిల్లాడి మనసు ఏ నిర్ణయం తీసుకుంటుంది?

 

ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి తట్టుకోలేక చక్రి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘చస్తే ఏ గొడవాలేదు.. చస్తే ఏ గోలా లేదు’ అనే పాటని చక్రి పాడారు. ఇన్ని ఒత్తిడులు ఎదుర్కొంటున్న చక్రి తన పాటను అనుసరించి వెళ్ళిపోయారా అనే అనుమానాలను ఆయన అభిమానులు, సినిమా పరిశ్రమలోనివారు వ్యక్తం చేస్తున్నారు. చక్రి మరణవార్త తెలిసిన అందరూ... చక్రి బాగా లావుగా వుంటాడు కాబట్టి గుండెపోటు వచ్చి వుంటుందిలే అని అనుకున్నారు. ఇప్పుడు చక్రి జీవితంలోని అసలు గుట్టంతా బయటపడేసరికి ఇప్పుడు ఆయన మరణం మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.