వెంకయ్య - కిషన్ రెడ్డి మధ్య అగాథం

Publish Date:Dec 20, 2014

Advertisement

 

వాళ్ళిద్దరూ గురు శిష్యులు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారానికి దూరంగా ఉన్నంతకాలం ఒకరికి ఒకరు దగ్గరగా వున్నారు. ఇప్పుడు అధికారం దగ్గరగా వచ్చిన తర్వాత వారిద్దరూ దూరమైపోయారు. కలసికట్టుగా దేశాన్ని ముందుకు నడిపించాల్సిన వారు ఎడమొహం పెడమొహంగా వుంటున్నారు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు... బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.

 

వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి... ఇద్దరి మధ్య ఏం జరిగిందో, ఏ అభిప్రాయ భేదాలు వచ్చాయో గానీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గతంలో వెంకయ్య నాయుడు హైదరాబాద్‌కి ఎప్పుడు వచ్చినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి అక్కడకి తప్పకుండా వచ్చేవారు. అధికార కార్యక్రమం అయినా, అనధికార కార్యక్రమం అయినా కిషన్ రెడ్డి హాజరు తప్పనిసరిగా కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో వెంకయ్య నాయుడు ఎప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా కిషన్ రెడ్డి అక్కడ కనిపించడం లేదు. బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు వచ్చినప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి హోదాలో వున్న కిషన్ రెడ్డి వెళ్ళి కలవటం మర్యాద. ఆ మర్యాదని కూడా కిషన్ రెడ్డి పాటించనంతగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. కిషన్ రెడ్డికి రైట్ హ్యాండ్‌గా భావించే యన్నం శ్రీనివాసరెడ్డి ఆమధ్య వెంకయ్య నాయుడిని విమర్శించినప్పుడు కూడా కిషన్ రెడ్డి ఆ విమర్శలను ఖండించకుండా మిన్నకున్నారు. బీజేపీ లాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఇలాంటి ధోరణులు కుదరవు. అయినప్పటికీ కిషన్ రెడ్డి ఇదే పంథాలో వ్యవహరిస్తున్నారు.

 

కిషన్ రెడ్డి వ్యవహార శైలి వెంకయ్య నాయుడికి నచ్చకపోయినప్పటికీ ఆయన ఈ అంశాన్ని నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్ళ దలచుకోనట్టు తెలుస్తోంది. ఎందుకంటే, నరేంద్రమోడీ వెంకయ్య నాయుడికి ఎంత సన్నిహితుడో కిషన్ రెడ్డికి కూడా అంతే సన్నిహితుడు. దశాబ్దాల క్రితం ఇద్దరూ కలసి భారత ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు వెళ్ళిన స్నేహం కూడా వీరిమధ్య వుంది. అందువల్ల కిషన్ రెడ్డి వ్యవహార శైలిని మోడీ దృష్టికి వెంకయ్య తీసుకెళ్ళలేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని వెంకయ్య నాయుడు ప్రోత్సహిస్తున్నట్టు, కిషన్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. చింతల రామచంద్రారెడ్డిని వెంకయ్య భుజాన వేసుకోవడం ఎంతవరకూ వచ్చిందంటే, త్వరలో ఆయనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనంత వరకు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ వెంకయ్య లాంటి నాయకుడితో కిషన్ రెడ్డి అనవసరంగా దూరాన్ని పెంచుకుంటున్నారేమోనన్న అభిప్రాయం తెలంగాణ బీజేపీ వర్గాల్లో వినిస్తోంది.

By
en-us Political News

  
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.