Publish Date:Jun 23, 2025
ఆవిర్భావం నుంచీ భయపెట్టడమే తన బ్రాండ్ అన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. అధికారంలో ఉన్నా, లేకపోయినా వైపీపీ జనాలను భయపెట్టి సాగుతోంది. 2014 ఎన్నికలలో ప్రతిపక్ష హోదా దక్కిన వైసీపీ అప్పుడూ జనాలను భయపెట్టే తీరుతోనే సాగింది. తాను చేసిన తప్పులకు కూడా అప్పటి అధికార పక్షంపై నెపం నెట్టి ప్రజలలో సానుభూతి సంపాదించుకుంది. ఆ తరువాత 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ సర్కార్ తీరు మారలేదు. అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరుతో వైసీపీ అంటేనే జనం వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆ కారణంగానే 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని దారుణంగా ఓడించారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని తీర్పు ఇచ్చారు. జగన్ పాలన వద్దు అన్న నిర్ణయానికి ప్రాంతాలకు అతీతంగా జనం అంతా ఏకాభిప్రాయానికి వచ్చారన్న విషయాన్ని ఆ ఎన్నికల ఫలితాలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి. జగన్ సొంత జిల్లా కడపలోనూ వైసీపీ చావు దెబ్బ తింది. స్వయంగా జగన్ పోటీ చేసిన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం లో కూడా ఆయన మెజారిటీ గణనీయంగా తగ్గింది. ఇక కడపలోని పది నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం కూటమి ఏడు నియోజకవర్గాలలో విజయకేతనం ఎగుర వేసిందంటేనే జగన్ తన అడ్డాగా చెప్పుకునే జిల్లాలో జనం ఆయనను ఎంత వ్యతిరేకించారో అర్ధమౌతుంది. ఇక ఆ ఎన్నికలలో జగన్ పార్టీ కేవలం 11 అంటే 11 స్థానాలకు పరిమితమైంది. అయినా కూడా వైసీపీ తీరు ఇసుమంతైనా మారలేదు. ఓడించిన జనంపైనే ఆ పార్టీ కక్ష గట్టిందా అన్నట్లుగా.. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన ఏడాది తరువాత వెన్నుపోటు దినం నిర్వహించి జనం తనను వెన్నుపోటు పొడిచారంటూ చాటింది. అంతే కాకుండా మళ్లీ అధికారంలోకి వచ్చి రప్పరప్ప నరుకుతాం అంటూ హెచ్చరికలు జారీ చేసే విధంగా వ్యవహరిస్తున్నది. బెదరించి గెలిచేద్దాం అన్న మోడల్ లో ఇప్పటికీ ఫాలో అవుతోంది.
ప్రజలలో మమేకం అవ్వడం కాదు.. వారిని బెదరించి, భయపెట్టి ఓట్లు వేయించుకోవాలన్న లక్ష్యంగా ముందుకు కదులులోందా అనిపించేలా ఆ పార్టీ కార్యక్రమాలు, జగన్, ఇతర వైసీపీ నేతల ప్రసంగాలు ఉంటున్నాయి. పల్నాడు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ క్యాడర్ ప్రదర్శించిన ఫ్లెక్సీలు కూడా అదే చాటుతున్నాయి. అలాగే ఆ పర్యటనలో జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొని ఒక వ్యక్తి మరణించినా కూడా కనీసం వాహనం ఆపకుండా ముందుకు సాగిపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. దీంతో వైసీపీ అన్నా, జగన్ పర్యటన అన్నా జనం భయంతో వణికిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ పార్టీ తీరు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి చట్టసభలో ప్రాతినిథ్యం కూడా లేకుండా పోయే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is--scare-people--ycp-brand-39-200469.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.