లోకేష్ చర్యలతో సత్ఫలితాలు.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వంద శాతం అడ్మిషన్లు!
Publish Date:Jun 23, 2025

Advertisement
జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. విష ప్రయోగాలకు జగన్ సర్కార్ విద్యారంగాన్ని వాడుకుంది. సంక్షుమ పథకాలకు తన పేర్లు పెట్టుకోవడం వినా జగన్ రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి చేసిందంటూ ఏమీ లేని పరిస్థిది. జగన్ ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ దాదాపు కుప్ప కూలిపోయిన పరిస్థితి. అమ్మఒడి అంటూ పథకాన్ని ప్రవేశ పెట్టినా దానిలో కోతలు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాల్లో సీట్లు వందశాతం భర్తీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల మాదిరి ప్రభుత్వ విద్యా సంస్థలలోనూ అడ్మిషన్ల్స కంప్లీటడ్ , సీట్స్ ఫిల్, అడ్మిషన్స్ క్లోజ్ డ్ అన్న బోర్డులు దర్శనమిస్తున్న పరిస్థితి. టెక్కలి, నెల్లూరు ఇలా చోట్ల సీట్స్ కంప్లీటడ్ అన్న బోర్డులు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేసి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతమౌతోందనడానికి నిదర్శనమిదిగో అని పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి అంత లేలికగా ఏమీ రాలేదు. గత ఏడాది సార్వత్రి ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం తెలుగుదేశం కూటమి సర్కార్ విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టారు. పాఠశాలలలో టీచర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. పాఠశాలల రూపురేకలు మార్చే విధంగా చర్యలు చేపట్టారు. ఆ కృషి ఫలితాలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ప్రజలలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో నాణ్యమైన, మెరుగైన విద్య అందుతుందన్న నమ్మకం విద్యార్థలు తల్లిదండ్రులలో ఏర్పడింది. దీంతో ప్రస్తత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల స్ట్రెంగ్త్ అనూహ్యంగా పెరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. దాని ఫలితమే పలు స్కూళ్లల్లో విద్యా సంవత్సరం ప్రారంభమ్యే సరిగే సీట్లు భర్తీ అయిపోవడం. రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం సర్కారీ బడుల్లో అడ్మిషన్ల ప్రారంభం నాటికే 90 శాతానికి పైగా సీట్లు భర్తీ అయిపోయాయి.
ప్రస్తుత తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యావ్యవస్థ ను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ బలో పేతమైంది.
http://www.teluguone.com/news/content/100-percent-admissions-in-government-schools-39-200473.html












